Jamiat Ulema Appeal : ప్రజా దీవెన, నల్లగొండ:కర్ణాటక రా ష్ట్రంలో అమలులో ఉన్న తరహాలో ద్వేషపూరిత ప్రసంగాలు, ద్వేష ఆ ధారిత నేరాలను అరికట్టేందుకు తె లంగాణలో ప్రత్యేక చట్టం తీసుకు రావాలని జమియత్ ఉలేమా- ఎ- హింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా షా సయ్యద్ ఎహ్సాను ద్దీ న్ ఖాస్మీ డిమాండ్ చేశారు. తెలం గాణ కాంగ్రెస్ ప్రభుత్వం జమియత్ ఉలేమా ప్రాతినిధ్యంపై తన ఎన్నిక ల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆయన కోరారు.
ప్రస్తుతం భారతదేశం అసహనం, ద్వేష వాతావరణానికి కేంద్రంగా మారుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం, కేంద్రంలో ఉన్న ఉన్నత రాజ్యాంగ పదవులు నిర్వహిస్తున్న కొందరు వ్యక్తులే రా జ్యాంగ విలువలను ఉల్లంఘిస్తూ, సాధారణ పౌరుల స్వేచ్ఛలు మ రి యు రాజ్యాంగ హక్కులను హరిం చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్ర జమియత్ ఉలేమా రాజకీ య పార్టీలకు సమర్పించిన డిమాం డ్లలో అత్యంత ముఖ్యమైనది ద్వేష ప్రసంగాలు, ద్వేష ఆధారిత నేరాల ను అరికట్టేందుకు అసెంబ్లీలో ప్ర త్యేక బిల్లును ఆమోదించడమేనని తెలిపారు. ఈ డిమాండ్‌ను కాంగ్రెస్ పార్టీ అంగీకరించి తన మ్యానిఫెస్టో లో చేర్చిందని గుర్తుచేశారు. ఈ అం శంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో కూడా సమావేశం జరిగి, స్పష్టమైన విజ్ఞప్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు న్న చర్యలను ఆదర్శంగా తీసుకుని, రాబోయే తెలంగాణ అసెంబ్లీ సమా వేశాల్లో ఈ బిల్లును వెంటనే ప్రవేశ పెట్టి ఆమోదించాలని ఆయన డి మాండ్ చేశారు. భవిష్యత్ కార్యా చరణను ఖరారు చేయడానికి త్వ రలోనే జమియత్ ఉలేమా సమా వేశం నిర్వహిస్తామని, ప్రజాభిప్రా యం రూపొందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సమావేశా లు, ప్రచార కార్యక్రమాలు చేపడ తామని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చట్టం జా తీ య భద్రత దృష్ట్యా కూడా అత్యంత అవసరమని మౌలానా ఎహ్సాను ద్దీ న్ ఖాస్మీ అభిప్రాయపడ్డారు. దేశం లో పెరుగుతున్న అసహనం, ము స్లింలపై వివక్ష, మైనారిటీలను ము ఖ్యంగా ముస్లింలను ప్రధాన స్ర వం తి నుంచి వేరుచేసే ప్రయత్నాలు, ముస్లింలలో భయం, అభద్రతా భా వం పెరుగుతున్న నేపథ్యంలో ఈ చట్టం అవసరమని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే జమియత్ ఉలే మా-ఎ-హింద్ జాతీయ అధ్యక్షుడు హజ్రత్ మౌలానా సయ్యద్ మహ మూద్ అసద్ మదానీ ‘మైనారిటీల న్యాయం మరియు సాధికారత’ అ నే ప్రత్యేక విభాగాన్ని జమియత్‌లో ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ వి భాగం ప్రధాన లక్ష్యం పక్షపాతం, ద్వే షం ఆధారంగా జరిగే నేరాలను ని వారించడం, అణచివేయడమేనని చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమా వే శాల్లో ద్వేషాన్ని వ్యాప్తి చేసే వారిపై చట్టం తీసుకువస్తామని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అ యితే ఆ ప్రకటనకు వెంటనే చట్ట పరమైన రూపం కల్పించాలని జమి యత్ ఉలేమా డిమాండ్ చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్య క్షు డు ఎం.ఏ. హఫీజ్ ఖాన్, జిల్లా జన రల్ సెక్రటరీ మౌలానా అక్బర్ ఖాన్ అసాది, జాయింట్ సెక్రటరీ సయ్య ద్ ఫుర్ ఖాన్, పట్టణ అధ్యక్షుడు మౌలానా అబ్దుల్ రెహమాన్ ఖాన్, మౌలానా జుబేర్ మజాహిరి, మౌ లానా ఉబేద్, మౌలానా ఖాజా జి యావుద్దీన్, మౌలానా యాసర్, మౌ లానా అబ్దుల్ సమీ, ముఖ్తి సో హె బ్, ఆఫీస్ శంషుద్దీన్, హఫీజ్ అతీ క్, ముజ్జు తదితరులు పాల్గొన్నారు.
