Sunday, September 27, 2026
More
    HomePoliticsKavitha : తుంగతుర్తి లో కవిత కస్సుబుస్సు 

    Kavitha : తుంగతుర్తి లో కవిత కస్సుబుస్సు 

    📰 Generate e-Paper Clip

    — బిఆర్ఎస్ నాయకులూ రుద్రమ చెరువు రిజర్వాయర్ ఎక్కడ

    –గత ప్రభుత్వ వైఫల్యo వల్లే రు ద్రమ చెరువు దుస్థితి

    — తుంగతుర్తి పర్యటనలో బి ఆర్ ఎస్ నేతలపై జాగృతి కవిత కన్నెర్ర

    Kavitha : ప్రజా దీవెన, తుంగతుర్తి: తుంగతు ర్తి మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామంలో ఉన్న రుద్రమ చెరువును రిజర్వుగా మారుస్తామని గత ప్రభు త్వం రెండు ఎన్నికల్లో హామీలు గు ప్పించి నేటికీ ఆచరణలో పెట్టకపో వడంపై తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బిఆర్ఎస్ నాయకుల పై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జనం బాట కార్యక్రమంలో భాగంగా వెలుగుపల్లిలోని రుద్రమ చెరువును జాగృతి జిల్లా అధ్యక్షురాలు సూరా రపు కృష్ణవేణి, నాయకులతో కలిసి పరిశీలించి మాట్లాడారు.

    బిఆర్ఎస్ నాయకులు ప్రజలకు ఇ చ్చిన హామీలను విస్మరించడం ఆ నాయకుల నిర్లక్ష్యానికి నిదర్శనమ న్నారు. ఈ చెరువు 700 ఎకరాల వి స్తీర్ణంలో ఉందని, సుమారు ఒక కి లోమీటర్ నర మేరా కాల్వను తవ్వి తే గోదావరి జలాలు ఈ చెరువులో కి వస్తాయని అన్నారు. ఆపరేషన్ మెయింటెనెన్స్ కింద పదేండ్లు పరి పాలించిన బిఆర్ఎస్ గాని రెండు సంవత్సరాలుగా పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్క నిధులు రాకపోవడం శోచనీయమన్నారు.

    ఈ రిజర్వాయర్ నిర్మాణం జరిగితే ఆయకట్టులోని రైతన్నలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఆ తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభు త్వం లో ఈ నియోజకవర్గంలో ఎ న్నికైన ఎమ్మెల్యే సామెల్ పలు ద ఫాలుగా ఈ చెరువును పరిశీలించి రిజర్వాయర్ చేస్తానని, లక్నవరం చేస్తానని చెప్పడం తప్ప చేసింది లే దని ఎద్దేవా చేశారు.

    మాటలు మాత్రమే కాదు చేతల్లో పనిచేయాలని, ఈ ప్రాంత రైతన్నల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రిజ ర్వాయర్లను కట్టే విధంగా చొరవ చూపాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వా న్ని ఆమె డిమాండ్ చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.