Monday, September 28, 2026
More
    HomePoliticsCongress President Punna Kailash Netta : అధికారం లేనప్పుడే కృష్ణాజలాలు గుర్తుకొస్తాయి 

    Congress President Punna Kailash Netta : అధికారం లేనప్పుడే కృష్ణాజలాలు గుర్తుకొస్తాయి 

    📰 Generate e-Paper Clip

    –సురభి నాటకాల మాదిరిగా కేటీఆ ర్, హరీష్ రావు తీరు

    –రేవంత్ ప్రభుత్వంలోనే రాష్ట్రం స స్యశ్యామలం

    — రాబోయే ఏ ఎన్నికైన కాంగ్రెస్ దే విజయం

    — నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షు డు పున్న కైలాష్ నేత

    Congress President Punna Kailash Netta : ప్రజా దీవెన, నల్లగొండ: అధికారం లేనప్పుడు, మాత్రమే కృష్ణా జలా లు గుర్తుకు వస్తాయని, అధికారం కోల్పోయిన కెసిఆర్ హరీష్ రావు కేటీఆర్ లకు అహంకారం తగ్గలేదని నల్లగొండ డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత తీవ్ర స్థాయిలో ధ్వజమె త్తారు. బుధవారం నల్గొండ కేంద్రం లోని తన నివాసంలో ఏర్పాటు చే సిన విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ బుధవారం నల్లగొండ జి ల్లా కేంద్రానికి వచ్చిన బిఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్ర భుత్వం పై చేసిన అవాకులు చవా కులు, చూస్తే కాంగ్రెస్ నాయకులకు ఆవేశం వస్తుందని అన్నారు. వారు చేసిన వ్యాఖ్యలు ఎటువంటి వాస్త వం లేదని అన్నారు.

    ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టిన ఇం కా సిగ్గు రాలేదని కేసీఆర్ ఫామోజికి పరిమితం చేసింది రేవంత్ రెడ్డి కా దా అని నిలదీశారు. సిగ్గులజ్జా లే కుండా నేడు కృష్ణ జలాలపై ముసలి కన్నీరు కారుస్తున్నారని, టిఆర్ఎస్ నేతలు 299 టీఎంసీలకు సంతకం పెట్టింది నీ అయ్యా కేసీఆర్ కాదా అ ని కేటీఆర్ ను ప్రశ్నించారు. పాల మూరు రంగారెడ్డి ప్రాజెక్టులు ఎత్తు తగ్గించి తెలంగాణకు ద్రోహం చేసిం ది కేసీఆర్ అని అన్నారు. అసలు బి సి సొరంగం పనులు 10 సంవత్స రాల కాలంలో తట్టెడు మట్టి అయి నా తీశారా అని ప్రశ్నించారు. చర్ల గూడెం నెల్లికల్ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని కృష్ణరాంపల్లి, ఉ దయ సముద్రం గ్రామంలో ప్రాజె క్టు ను ఎందుకు కట్టలేదని అన్నారు.

    రూ. 8.30 లక్షల కోట్లు అప్పు చేసి న విషయం వాస్తవం కాదని ఆ అ ప్పుడు రాష్ట్ర రాబందుల లెక్క పీ క్కు తిన్నది మీరు కుటుంబమే అ న్నారు. నల్గొండ ఖమ్మం మహబూ బ్ నగర్ జిల్లాలను శాశ్వతంగా ఎ డారి చేయాలని కేసిఆర్ లో కుట్ర దా గి ఉందని ఆరోపించారు.

    జిల్లా మంత్రులైన ఉత్తంకుమార్ రె డ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నాయ క త్వంలో జిల్లా సశ్యామలం అవు తుందని అన్నారు. రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని రై తులు తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయని అన్నారు. నిన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలలో టిఆర్ఎస్ పా ర్టీ బిజెపితో పొత్తు పెట్టుకుని పోటీ చేసి సిగ్గు లేకుండా మళ్లీ మాట్లాడు తున్నారని ఏద్దవ చేశారు. సర్పంచ్ ఎన్నికలలో 60 శాతం ఓట్లతో కాంగ్రె స్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని మొన్న జరిగిన, కంటోన్మెంట్ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో రేవంత్ రెడ్డి ప్ర భుత్వం పై ప్రజలు విశ్వాసం చూపి విజయాన్ని అందించాలని అన్నా రు. పార్టీలో నాయకత్వం కోసం, కవి త కేటీఆర్, హరీష్ రావులు త న్నుకుంటున్నది ప్రజలు చూస్తున్నా రని అన్నారు. వీరి రాజకీయం చూ స్తుంటే సురభి నాటకాలు గుర్తుకు వస్తున్నాయని అన్నారు.

    నాడు ఆంధ్ర కాంట్రాక్టర్లకు తెలంగా ణలోని ప్రాజెక్టులు కట్టబెట్టి కమిష న్లు తీసుకున్న ఘనత హరీష్ రావు కు ఉందని అన్నారు. 23వ పులి కే సి లెక్క కేటీఆర్ హరీష్ రావుల, బ్రో కర్ రాజకీయం ఉందని అన్నారు. బీసీలకు అన్యాయం చేసి నేడు మళ్ళీ ఎం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని అన్నారు.

    నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వ్యాకలు చూస్తే డ్రై నేజీ లో చెత్తలాగా ఉన్నాయని అ న్నారు. సీఎం రేవంత్ రెడ్డి పై గాదరి కిషోర్ చేస్తున్న రేఖలు అహంకారా నికి నిదర్శనమని, బాల్క సుమన్ సంతోష రావులకు పదవులు వస్తే తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగ సమ స్య తీరుతుందా ప్రశ్నించారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తన్ని త రుముతామని హెచ్చరించారు.

    ఈ సమావేశంలో సీనియర్ నాయ కులు కన్నారావ్, ఎస్ఎస్సి జిల్లా అ ధ్యక్షుడు బోడ స్వామి బీసీ సెల్ జి ల్లా అధ్యక్షులు జిల్లపల్లి పరమేష్, చింతమల్ల వెంకటయ్య, పుట్ట వెంక న్న గౌడ్, తిరుమ లేష్ శివ గౌడ్ నరే ష్, కర్నాటి మచ్చ గిరి వేణు సైదు లు తదితరులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.