Wednesday, October 7, 2026
More
    HomeOpinionMinister Komatireddy Venkat Reddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి కీలకవ్యాఖ్య, అభివృద్ధిని ఆకాంక్షించే...

    Minister Komatireddy Venkat Reddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి కీలకవ్యాఖ్య, అభివృద్ధిని ఆకాంక్షించే వారoదరూ చెయ్యిగుర్తుకే ఓటేయాలి 

    📰 Generate e-Paper Clip

    –నల్లగొండ అభివృద్దే నా ధ్యేయం, నా జీవిత లక్ష్యం

    –పేద ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షే మ పథకాలoదిస్తాం

    –పేదోళ్లకు ఏ కష్టమొచ్చినా ఆదు కునేందుకు అండగా ఉంటాo

    –అన్ని డివిజన్ లలో అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం

    — గెలిపిస్తే నల్లగొండ అభివృద్ధి నిధులెన్నయినా కేటాయిస్తాం

    –పూటకోపాటి మారే వారిని నమ్మి తే మనoదరికీ తీరని నష్టం

    — మూడోరోజు రోడ్ షోలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

    Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ను అన్ని విధా లుగా అభివృద్ధి చేయడమే తన ప్రధాన ధ్యేయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెం కట్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ప రిధిలో గల 14, 15, 16,17, 3 డివి జన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ రోడ్ షో ని ర్వహించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్లగొండ మున్సి పల్ కార్పొ రే షన్ లో ఇంకా మిగిలి ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రో డ్డును పూర్తి చేయడంతో పాటు సమస్యలు లేని కాలనీలు గా తీర్చి దిద్దారన్నారు.

    డివిజన్ లో ప్రతి కాలనీకి 24 గం టలు తాగునీరు వచ్చే వి ధంగా ఇ ప్పటికే చర్యలు చేపట్టడం జరి గిం దని తెలిపారు. నల్గొండ మున్సి ప ల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అన్ని విధాలుగా అభివృద్ధి జరుగు తుందని మరోసారి మంత్రి స్పష్టం చేశా రు. పూటకో పార్టీ మారే వాళ్లను, ఇతర పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకే న ష్టంజరుగుతుందన్నారు.నల్లగొండలో మున్సిపల్ కార్పొరేష న్ గా చేసుకున్నందున కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధు లు వస్తాయన్నారు. దీంతో మరిన్ని అభివృ ద్ధి పనులు చేసు కోవచ్చని పేర్కొన్నారు.

    ఇప్పటికే నల్గొండ మున్సిపల్ కా ర్పొరేషన్ లో 2,200 కోట రూపా యలతో అభివృద్ధి పనులు జరు గుతున్నాయని తె లిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అన్ని డివిజన్ లో ఇచ్చిన హామీలన్నిటిని కచ్చితంగా అమలు చేస్తానని స్ప ష్టం చేశారు. నేను పేదోళ్ల మనిషి ననీ, ఇచ్చిన మాట తప్పని పేర్కొ న్నారు. నల్లగొండ అభివృద్ధి మన చేతుల్లోనే ఉందని, ఇతర పార్టీల అభ్యర్థులను గెలిపించి మోసపోవద్దని కోరా రు.

    కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వారు డివిజన్లోని స మ స్యలనుతన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు వీలుం టుంది అన్నారు.ఇతర పార్టీకి చెందిన అభ్యర్థులు గెలిస్తే వా రితో ఎలాంటి ప్రయో జనం ఉండదన్నారు. చర్లపల్లి, ఆర్జాల బావి, పాతపల్లె, శేషమ్మ గూడెం గ్రామా ల లో ఎలాంటి సమ స్యలు ఉన్న వాటన్నింటినీ పరిష్కరించే బాధ్యత నాదేనని హామీ ఇచ్చారు. మున్సి పల్ కార్పొరేషన్ ఎన్నికలలో ప్రజ లంతా చెయ్యి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ను రికార్డు స్థాయి మెజార్టీతో గెలిపించాలని కోరారు.

    ఇక్కడి పార్టీ అభ్యర్థుల గెలుపు రి కార్డు స్థాయిలో ఉండాల ని, అది ప్ర జల చేతుల్లోనే ఉందని పేర్కొన్నా రు.నల్లగొండ మున్సిపల్ కార్పొరే షన్ ప్రశాంతంగా ఉండాలన్న, అన్ని రం గాలలో అభివృద్ధి కావాల న్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్య మ న్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అ ధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీ ని వాస్ రెడ్డి, తిప్పర్తి మాజీ జెడ్పిటిసి పాశం రామ్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, మార్కెట్ కమి టీ చైర్మన్ జూకురి రమేష్ లు ఉన్నారు.

    14వ డి విజన్ కార్పొరేటర్ అభ్యర్థి బొజ్జ శంకర్, 15వ డి విజన్ అభ్యర్థి పెరిక నాగ రా జు, 16వ డివిజన్ అభ్య ర్థి పెరిక స్వాతి వినాయక రాజు (చి ట్టి), 17వ డివిజన్ అభ్యర్థి జేరిపో తుల అశ్విని భాస్కర్ గౌడ్, 3వ డి విజన్ కార్పొరేటర్ అభ్యర్థి గాలి వి నోద, మాజీ కౌన్సిలర్ మందడి శ్రీనివాస్ రె డ్డి, యువజన కాంగ్రెస్ నల్ల గొండ పట్టణ అధ్యక్షుడు గాలి నాగ రాజు, పలువురు మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.