Minister Komatireddy : ప్రజా దీవెన, నల్లగొండ: త్వరలో జ రిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను నల్ల గొండలో అన్ని స్థానాల్లో పూర్తి మె జార్టీతో గెలిపించడం ద్వారా నల్ల గొండ కార్పొరేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహుమతిగా అంది ద్దామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలు పునిచ్చారు. నల్లగొండ కార్పొరేషన్ అభివృద్ధికి సమస్త ప్రజలు సహకా రం అందించాలని కోరారు. రాజకీ యాలకతీతంగా నల్లగొండ సమ గ్రా భివృద్ధికి సహరించుకుందామని అ ప్పీల్ చేశారు.
శనివారం నల్లగొండ మున్సిపల్ కా ర్పొరేషన్ పరిధిలో రూ. 18.7 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు, ప్రారంభోత్సవాలు చేశారు మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ సం దర్భంగా ఆయా వార్డులలో చేప ట్టి న కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడు తూ నల్లగొండ మున్సిపల్ కా ర్పొ రే షన్ కావటం వల్ల కేంద్రం నుండి నే రుగా నిధులు తీసుకొచ్చుకునేందు కు మెరుగైన అవకాశాలున్నాయని గుర్తుచేశారు. 25 నెలల్లోనే కార్పొ రే షన్ తీసుకువచ్చానని, గతంలో క న్నా ఇంకా వేగంగా నల్లగొండను అ భివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉందన్నారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మా దిరిగా నల్లగొండ కార్పొరేషన్ ను అ భివృద్ధి చేసుకోవచ్చన్నారు. నల్లగొం డ కార్పొరేషన్ లో ఇందిరమ్మ ఇం డ్లు, డబుల్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ తో పాటు, రూ. 700 కోట్లతో ఓఆర్ ఆర్ నిర్మాణం, ధర్వేశిపురం వరకు 6 లైన్ల రోడ్, రూ. 140 కోట్లతో బ్రహ్మగారి గుట్ట, లతీప్ సాబ్ దర్గా గుట్ట అభివృద్ధి, దొరేపల్లి, అనంతా రం వరకు రోడ్లు, ఎస్ఎల్ బిసీని పూర్తి చేయడమే లక్ష్యంగా ముందు కు సాగుతున్నామని చెప్పారు.
ఏఎం ఆర్ పి కాలువల లైనింగ్ కి రూ. 450 కోట్లు మంజూరు చేయిం చామని, బ్రాహ్మణ వెళ్లెముల ప్రాజె క్టు ద్వారా మునుగోడు, చండూరు లకు సైతం సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా కేం ద్రంలోని ప్రజలందరూ మాట సమ రస్యంతో శాంతియుతంగా ఉండా లని కోరారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని, కార్పోరేషన్ ప రిధిలో అన్ని వార్డులో సిసి రోడ్లు భూగర్భ మురికి కాలువలతో అ భివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
ఆయా కార్యక్రమాల్లో మంత్రి వెంట
రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీని వాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ బు ర్రి శ్రీనివాసరెడ్డి ,మాజీ జెడ్పిటిసి గు మ్మల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథా ల య సంస్థ అధ్యక్షులు ఆఫీజ్ ఖాన్ తదితరులు హాజరయ్యారు.

