–12వ విడత ఉచిత కంటి వైద్య శి బిరంలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
Munugode MLA Rajagopal Reddy : ప్రజా దీవెన, మునుగోడు:తన మా తృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మునుగో డు నియోజకవర్గ వ్యాప్తంగా కంటి సమస్యలతో బాధపడే ప్రతి ఒక్క రికి కంటి చూపు మెరుగవ్వాలనే తలంపుతో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాలకు భారీ స్పంద న వస్తోందని మునుగోడు కోమటిరె డ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. ఆది వారంమునుగోడు లోని క్యాంపు కా ర్యాలయం వద్ద చండూరు మున్సి పాలిటీలోని 10 వార్డుల ప్రజలతో పాటు, చండూరు మండలంలోని 19 గ్రామాల ప్రజలకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని చండూరు మున్సి పల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ భూతరాజు దశరధలతో పా టు చండూరు మున్సిపాలిటీ మం డల నాయకులతో ప్రారంభింపచే శారు.
ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పరిశీ లించి ఎవరెవరికి ఏ ఏ కంటి సమ స్యలు ఉన్నాయని ఆరా తీసి మీకు నేనున్నానని భరోసా ఇచ్చారు. ఈ 12వ విడత ఉచిత కంటి వైద్య శి బిరంలో 610 మంది కి కంటి పరీ క్షలు నిర్వహించగా వారిలో 250 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక య్యారు. కంటి ఆపరేషన్లకు ఎంపి కైన వారిలో 155 మంది ని వెంటనే ఆపరేషన్ల కొరకు హైదరాబాద్ లో ని శంకర కంటి ఆసుపత్రికి తరలిం చారు. మిగిలిన వారిని మంగళవా రం రోజు తీసుకెళ్లి ఆపరేషన్లు చే యిస్తారన్నారు.
కంటి ఆపరేషన్లకు ఎంపికైన వారికి మీకు నేనున్నానని ధైర్యంగా వెళ్లి ఆపరేషన్లు చేయించుకుని రండని భరోసా ఇచ్చారు. మీ రెండు కళ్ళు మంచిగా అయ్యేంతవరకు చూ యించుకోండని మీకోసం ప్రతి నెల ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ని ర్వహిస్తామని మరోసారి స్పష్టం చేశారు.
ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలను ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర కంటి ఆ సుపత్రుల వారి సౌజన్యంతో తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీల మ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వ హిస్తున్నారు.

