Wednesday, October 7, 2026
More
    HomeOpinionNalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ అప్పీల్, ప్రత్యా మ్నయ పంటల సాగుపై రైతులకు...

    Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ అప్పీల్, ప్రత్యా మ్నయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి

    📰 Generate e-Paper Clip

    Nalgonda Collector Chandrasekhar  : ప్రజా దీవెన, నల్లగొండ: ఎల్‌నినో ప్ర భావం వల్ల ఈ ఏ డాది వర్షపాతం త క్కువగా ఉండే అవకాశం ఉన్నందున రై తులు నీటి అవస రం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ పం టల సాగుపై దృష్టి సారించేలా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు అ వగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశిం చారు. మంగళవారం ఆయన కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, సహాయ వ్యవసాయ సం చాలకులతో యూరియా, విత్త నాలు, రైతు నమోదు అంశా లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

    ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం త గ్గే పరిస్థితులు ఉన్నందు న రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా కంది, జొన్న, పొ ద్దుతిరుగుడు, నువ్వులు వంటి ప్రత్యామ్నాయ పం టలను సాగు చేసేలా ప్రోత్సహిం చాలని కలెక్టర్ తెలిపారు.నేల స్వ భావం, మార్కెట్ డిమాండ్‌ను పరిశీలించి రైతులు పం టల ను ఎంపిక చేసుకు నేలా సూచనలు ఇవ్వాలన్నారు. కంది పంటకు కనీస మద్దతు ధర ఉన్నందున రై తులు అధికంగా సాగు చేసేలా ప్రో త్సహించాలని, ఉత్పత్తి ఎక్కువగా వచ్చిన సందర్భంలో మార్కెటింగ్ సదుపాయాల ఏర్పాటుకు చర్య లు తీసుకుంటామని తెలిపారు. ఉ ద్యా నవన పంటల వైపు వెళ్లే రైతు లను కూడా ప్రోత్సహించాలని, ఆయిల్ ఫామ్ వం టి పంటల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.వివిధ రకాల విత్తనాలు జిల్లాలో అందు బాటులో ఉన్నాయని, రైతుల అ వసరాలకు అనుగుణంగా సరిపడా విత్తనాల నిల్వలు ఉండే లా చూడాలని ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు సమ న్వయంతో పనిచేసి రైతులకు అవ సర మైన సాంకేతిక సలహాలు అoదించాలన్నారు.

    నకిలీ విత్తనాలను విక్రయించే వా రిపై కఠిన చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు.అన్ని ప్రాంతాల్లో యూరియా అందుబాటులో ఉందని, రైతులు యాప్ ద్వారా బుకింగ్ చే సుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. కౌలు రై తులకు యూరియా పంపిణీలో ఎలాంటి ఇ బ్బందులు తలె త్తకుండా చూడాల ని, సాగు చేయని వ్యక్తులు యూరియా బుక్ చేసుకుని అక్రమంగా వి క్రయించకుండా పర్యవేక్షణ చే పట్టాలని తెలిపారు.ప్రతి కేంద్రంలో యూరియా, డీఏపీ తది తర ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతులందరూ తప్పనిసరిగా ఫార్మ ర్ రిజిస్ట్రేషన్ చేసుకునేలా చూడాలని, ఆగస్టు 5వ తేదీ లో గా కనీసం 75 శాతం నమోదు పూర్తి చేయాలని ఆదేశిం చా రు. వ్యవసాయ అధికారులు ప్రతిరోజూ రైతు వేదికల్లో అం దుబాటులో ఉండాలని, విత్తనాలు, ఎరువుల నిల్వలు, సర ఫరా సమయాల వివరాలను స్పష్టంగా ప్రదర్శించేలా బ్యా నర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. రైతు వేదికలను పరి శుభ్రంగా ఉంచి, రైతులకు అవసరమైన సమాచారం ఎప్ప టికప్పుడు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూ చించారు. ఈ వీడియో కాన్ఫ రెన్స్ లో రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కు మార్స, బంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

    ఈనెల 15లోగా సర్ డిజిటైజేషన్ పూర్తి చేయాలి

    నల్లగొండ: ఈనెల 15లోగా సర్ ఫారాల డిజిటైజేషన్ పూర్తి చేయా లని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. మం గళవారం కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుం డి సర్ పై ఈ ఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

    బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల కు ఎన్యుమరేషన్ ఫారా లు అంద జేసి, వివరాలను సక్రమంగా నమోదు చేయాలని తెలిపారు. ప్రతి రో జు కనీసం 2,500 ఫారాల లక్ష్యం తో పని చేసి, నిర్దేశిత గడువులోగా పెండింగ్ ప్రక్రియను పూర్తి చేయా లని ఆదేశించారు. గ్రామాల్లో సర్పం చ్‌లు, బీఎల్‌ఏలతో స మావేశాలు నిర్వహించి ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన క ల్పించాలన్నారు. ఓట ర్లు సకాలంలో ఫారాలు పూర్తి చేసి అందజేసేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడా నిర్లక్ష్యం లే కుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆ దేశించారు.బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఫారం నింపాలని చెప్పారు.

    మిగిలిపోయిన ఫారాలను జులై 15 నాటికి పూర్తి చేయాలని ,ఓటర్ల సంతకాలను చెక్ చేసుకోవాలని, మ్యాపింగ్ కరెక్ట్ గా చేయాలని, ని యోజకవర్గంలో రాజకీయ పార్టీల ప్రతినిధు లతో సమావేశాలు నిర్వ హించాలని చెప్పారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ,జిల్లా రెవెన్యూ అధికారి దశరథ, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కర ణ్ రెడ్డి, సంబంధిత శాఖల అధి కా రులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.