Monday, September 28, 2026
More
    HomePoliticsNalgonda Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ సంచలన ప్రకట న, చెట్లు నరికితే, పంట...

    Nalgonda Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ సంచలన ప్రకట న, చెట్లు నరికితే, పంట అవశేషా లు కాల్చితే క్రిమినల్ చర్యలు 

    📰 Generate e-Paper Clip

    Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, చండూరు: పర్యావర ణ పరిరక్షణలో ప్రజల భా గస్వా మ్యం కావాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. ప్రజాపా ల న- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కా ర్యాక్రమంలో భాగంగా ప ర్యావరణ వారోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ గురువారం చండూరు మం డలం, బంగారుగడ్డ గ్రామంలో ని ర్వహించి న గ్రామసభకు హాజర య్యారు.ప్రజాపాలన- ప్రగతి ప్రణా ళిక సందర్బంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింద ని, పర్యావరణ వారోత్సవంలో భా గంగా జూన్ 12 వరకు పెద్ద ఎత్తు న మొక్కలు నాటాలని పిలుపుని చ్చారు. ప్రతి ఒక్కరూ తమ తల్లి పే రుతో ఒక మొక్క నాటి దానిని సం రక్షించాలని అన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేం దుకు చెత్తను వీధుల్లో వేయకుండా ప్రత్యేక చెత్త బుట్టలను ఏర్పాటు చేశామని, గ్రా మం స్వచ్ఛతలో ఆదర్శంగా నిలిచి స్వచ్ఛ పురస్కారాలు సాధించేలా కృషి చేయాలని కోరారు.

    ఉపాధి హామీ పథకం ద్వారా లభిం చే నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకో వచ్చని తెలిపారు. గ్రామంలోని బోర్ల మరమ్మతులకు చర్య లు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల పథ కం కింద తొలి విడతలో అర్హులకు ఇ ళ్లు మంజూరు చేశామ ని, రెండో వి డతలో గుడిసెల్లో నివసిస్తున్న అర్హులందరికీ ఇ ళ్లు అందజేస్తామని తెలిపారు. రోడ్డు విస్తరణ కారణంగా ఇ ళ్లు కోల్పోయిన వారికి గ్రామం లో ప్రభుత్వ భూమి అందు బాటులో ఉంటే సర్వే నిర్వహించి స్థలాలు పరిశీలించమ న్నారు. మహిళా సంఘాల ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణానికి రూ.1 లక్ష రుణ సదు పాయం కల్పిస్తామన్నారు.

    విద్యార్థులు పదో తరగతి తర్వాత చదువును మధ్యలో ఆపకుండా ఇంటర్, డిగ్రీ స్థాయిలో విద్యను కొ నసాగించేలా తల్లిదండ్రులు ప్రోత్స హించాలని చెప్పారు. ప్రస్తుతం ప్ర భుత్వ కళాశాలలు, మెడికల్, నర్సింగ్ కళాశాలలు, స్కిల్ డెవల ప్‌మెంట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, యువత వాటిని స ద్వినియోగం చేసుకోవాలని అన్నా రు. మహిళల ఆర్థిక సాధికారత కు ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కా ర్యక్రమం ద్వారా పెట్రోల్ బంకులు, రైస్ మిల్లులు వంటి ఉపాధి అవకా శాలు కల్పిస్తోందని, స్వయం ఉపా ధి చేపట్టాలనుకునే మహిళా సం ఘాలకు రుణాలు అందిస్తా మని తెలిపారు.

    వర్షపాతం తక్కువగా ఉండే పరిస్థి తుల్లో రైతులు నీటి అవసరం త క్కువగా ఉండే కందులు, పెసర్లు, మినుములు వంటి పంటలను సా గు చేయాలని సూచించారు. వర్షా కాలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ద్వారా దోమల వ్యా ప్తిని నివారించి డెంగ్యూ వంటి వ్యా ధులను అరికట్టవచ్చన్నారు. గ్రా మంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపర చడం, తాగునీటి నాణ్యతను విలే జ్ వాటర్ లెవల్ కమిటీ ద్వారా ని రంతరం పర్యవేక్షించాలని సూచిం చారు. గ్రామా ల్లో ఎవెన్యూ ప్లాంటే షన్ కింద నాటిన చెట్లను నరికివేస్తే కఠి న చర్యలు తీసుకుంటామని హె చ్చరించారు. పంట అవ శేషాలను కాల్చితే రూ.5 వేల జరిమానా, ఇ తరుల పంట లకు నష్టం కలిగించే లా కాల్చితే రూ.25 వేల జరిమా నా విధిస్తామని, అవసరమైతే ఎఫ్‌ ఐఆర్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

    ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా త గ్గించాలని పిలుపునిచ్చా రు. ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ మహబూబ్ గ్రామ పంచాయతీకి 500 ప్లేట్లు, 500 గ్లాసులను విరాళంగా అంద జేశారు. అనంతరం జిల్లా కలె క్టర్ గ్రామంలో ఇంకుడు గుంత ల ను నర్సరీలను పరిశీలించి తల్లి పే రుతో రావి మొక్కను నాటారు. ప్ర తి కుటుంబం ఒక మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడా లని పిలుపునిచ్చారు. అంతకు ముం దు వ్యవసాయ, హర్టికల్చర్, ఆరోగ్యశాఖ అధికారులతో వా నా కాలంలో ఎలాంటి పంటలు వే. యాలి? ఆరోగ్యం పట్ల తీసుకోవ లసిన జాగ్రత్తలపై వివరించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ శంకర్ నాయ క్ , తహసిల్దార్ రవి కాంత్ శర్మ , ఎంపీ డీవో బండారు యాదగిరి, ఇం చార్జ్ ఎంపిఓ, కార్య దర్శి కో టి, అగ్రి కల్చర్ డివిజన్ ఏడి వేణుగోపాల్, సర్పంచ్ బోయప ల్లి సునీత, శ్రీను, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.