Tuesday, September 29, 2026
More
    HomePoliticsNalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అ ప్పీల్, రైతులు కూరగాయలు, పండ్ల...

    Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అ ప్పీల్, రైతులు కూరగాయలు, పండ్ల తోటలు సాగుచేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలి 

    📰 Generate e-Paper Clip

    Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా జిల్లాలోని రై తులు కూరగాయలు, పండ్ల తో టలు పెంచే విధంగా వ్య వసాయ అధికారులు చర్యలు తీ సుకోవా లని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. గురువారం అయ న వ్యవసాయ, ఉద్యానశాఖ అ ధికారులతో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమావే శం నిర్వహించారు. ప్రస్తుత అం చనాల ప్రకారం ఆగస్టుతో పాటు, సెప్టెంబర్ మొదటివారంలో సరైన వర్షాలు వచ్చే అవకాశం లేదని, అంతేకాక శ్రీశైలం పూర్తిస్థాయిలో నిండనందున కిందికి నీరు వదిలే అవకాశం లేనందున రైతులు పొ లాలను ఖాళీగా ఉంచకుండా ప్ర త్యామ్నాయ పంటలు వేసుకునే విధంగా ప్రతి ఎంఈఓ ప్రత్యేక శ్ర ద్ధ వహించాలన్నారు.

    రైతుల దగ్గరకు వెళ్లి కూరగాయ లు లేదా పండ్ల తోటలు ,ఆయిల్ ఫామ్ వంటి తోటలను పెంచేందు కు చర్యలు తీసుకోవాలని, ము ఖ్యంగా జిల్లాలో 4 వేల ఎకరాల వరకు ఆయిల్ ఫామ్ తోటలు పెంచేందుకు అవకాశం ఉందని, వీలైనంత ఎక్కువ విస్తీర్ణంలో ఆ యిల్ ఫామ్ సాగు చేసేలా ప్రతి రై తును ప్రోత్సహించాలని తెలిపా రు. అలాగే కూరగాయల సాగు చేసేందుకు అవకాశం ఉన్న భూ ములలో కూరగాయలు సాగు చే యించాలని, ఆగస్టు నెలలో వే సేందుకు అవకాశం ఉన్న ఆ రు తడి పంటలను ప్రోత్సహించాల ని, కమాండ్ ఏరియాలో కూడా ప్రత్యేకమైన పంటలకు ప్రణాళిక రూపొందించాలని చెప్పారు.

    ప్రభుత్వం సూచించిన కాంటిన్జె న్సీ ప్లాన్ ను తప్పనిసరిగా అమ లు చేయాలన్నారు. మరోసారి మండలాలలో రైతు వారిగా పం టల వివరాలను సేకరించడమే కాకుండా పంటల వైవిధ్యం పై ప్ర తి రైతుకు తెలియజేయాలని, 4, 5 రోజులలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. ఉద్యాన పం టలు, కూరగాయల పంటల సా గు సమయంలో అడవి పందు లు, ఇతర జంతువుల బెడద లే కుండా ఉండే పంటలను వేసుకు నేలా ప్రోత్సహించాలన్నారు. అ యితే పంటల సాగు, ప్రత్యామ్నా య పంటల సాగు విషయంలో ఏ రైతును బలవంత పెట్టొద్దని, వా రికి అవగాహన మాత్రం కల్పించా లని, రైతులు వారి సమ్మతితో ప్ర త్యామ్నాయ పంటలు వేసుకునే విధంగా ప్రోత్స హించాలని చె ప్పారు. జిల్లా వ్యవసాయ అధి కారి వినోద్ కుమార్, ఉద్యాన శా ఖ అధికారి టి. శేఖర్, ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు, వ్య వసాయశాఖ సహాయ సంచాల కులు, మండల వ్యవసాయ అధి కారులు ఈ సమావేశానికి హాజర య్యారు.

    రోడ్డుప్రమాదాల నివారణకు అధి కారులు సమన్వయం పాటించా లి

    నల్లగొండ: జిల్లాలో రోడ్డు ప్రమా దాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప నిచేయాలని జిల్లా కలెక్టర్ బి. చం ద్రశేఖర్ అధికారులను ఆదేశించా రు.గురువారం కలెక్టర్ కార్యాల య సమావేశ మందిరంలో నిర్వ హించిన రోడ్డు భద్రత కమిటీ జి ల్లా స్థాయి సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రత చ ర్య లను మరింత పటిష్ఠంగా అమ లు చేయాలని చెప్పారు.జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరుగు తున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి సంబంధిత పోర్టల్‌లో వెంటనే అప్‌లోడ్ చేయాలని, గు ర్తించిన బ్లాక్ స్పాట్ల వద్ద తక్షణ చర్యలు తీసుకొని ప్రమాదాలని వారణకు అవసరమైన ఇంజినీరింగ్ మా ర్పులు చేపట్టాలని సూచించారు.

    జాతీయ రహదారులు, రాష్ట్ర ర హదారులు, ప్రధాన జిల్లా రహ దారులపై అక్రమ పార్కింగ్, రోడ్డు ఆక్రమణలు, రాత్రి వేళల్లో హెచ్చ రిక లైట్లు లేకుండా నిలిపే లారీ లు, ఇతర వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. రాత్రి సమయంలో నిలిపే వాహనాలకు రిఫ్లెక్టివ్ టేపులు, హెచ్చరిక లైట్లు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పా ఠశాలలు, బస్‌స్టాండ్లు, ఆసుప త్రులు, ప్రధాన కూడళ్లు వంటి ప్రాంతాలను ప్రత్యేక రోడ్డు భద్రత జోన్‌లుగా గుర్తించి జీబ్రా క్రాసింగ్‌ లు, హెచ్చరిక బోర్డులు, స్పీడ్ ని యంత్రణ చర్యలు ఏర్పాటు చే యాలని ఆదేశించారు.

    ముఖ్యంగా పాఠశాలల వద్ద వి ద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇ వ్వాలని తెలిపారు.రోడ్డు ప్రమా దం జరిగిన వెంటనే బాధితులకు గోల్డెన్ అవర్లో వైద్య సేవలు అందే లా అంబులెన్స్ సేవలను మరిం త సమర్థంగా వినియోగించాల ని, పోలీసు, రవాణా, వైద్య, రెవె న్యూ, స్థానిక సంస్థలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.ప్రతి మం డలంలో ఎంపీడీవోలు, తహసీ ల్దార్లు, పోలీసు అధికారులు, ర వాణా శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు కలిసి రోడ్డు భద్రతపై క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని సూచించారు.

    రోడ్లపై ఉన్న ఆక్రమణలను తొల గించడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే అంశాలను వెంటనే పరి ష్కరించడం, అవసరమైన చోట సైన్‌బోర్డులు ఏర్పాటు చేయడం వంటి చర్యలను వేగవంతం చే యాలని ఆదేశించారు.జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు బాధ్యతాయుతం గా వ్యవహరించాలని, సమన్వ యంతో పనిచేసినప్పుడే ప్రమా దాలను గణనీయంగా తగ్గించగ లమని జిల్లా కలెక్టర్ అన్నారు.

    జిల్లా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ప వార్ మాట్లాడుతూ జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ బ్లాక్ స్పాట్స్ విజి ట్ చేసి ప్రమాదాలు తగ్గిం చేందు కు చర్యలు తీసుకోవాలని, అలా గే ఎక్కడ పడితే అక్కడ వాహనా లు నిలపకుండా వాహనాలు నిలి పేందుకు పార్కింగ్ స్థలాలను గు ర్తించాలని, మండల స్థాయిలో రహదారి ప్రమాదాలను తగ్గించ డంలో తహసిల్దార్ మండల ఎస్ హెచ్ ఓలు సమన్వయంతో చే యాలన్నారు.రోడ్ సేఫ్టీ కమిటీ ద్వారా ఆక్రమణలను తొలగించే చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సమావేశంలో రవాణా డిప్యూటీ కమిషనర్ వాణి, జిల్లా అధికారు లు హాజరయ్యారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.