Sunday, September 27, 2026
More
    HomePoliticsCollector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అప్పీల్, ధాన్యం కొనుగోళ్లలో...

    Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అప్పీల్, ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్లు సహకరించాలి

    📰 Generate e-Paper Clip

    Collector Ila Tripathi : ప్రజా దీవెన, చిట్యాల: ఈ వానకా లం సీజన్ లో పండించి న ధాన్యం కొనుగోలులో రైస్ మిల్లర్లు సహకరిం చాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా చిట్యాల మండలం, వట్టిమర్తి గ్రామంలో ఉన్న సిద్ధార్థ రైస్ మిల్లు ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

    కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్ కు వచ్చే దాన్యం వివరాలను పరిశీ లించారు. ఇప్పటివరకు ఎన్ని లారీ లు వచ్చాయని తేమశాతం, ఇతర నాణ్యత ప్రమాణాల వివరాలను యాజమాన్యం ద్వారా అడిగి తెలు సుకున్నారు.

    వర్షాల కారణంగా గడిచిన వారం, పది రోజుల్లో దాన్యం రైస్ మిల్లు లకు రాలేదని, ప్రస్తుతం వర్షాలు లే నందున, తెరిపి ఇచ్చినందున మి ల్లులకు దాన్యం వస్తున్నదని అం దు వల్ల వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్లు ఆన్ లోడ్ చేసుకునే విధంగా రైస్ మిల్లర్లు సహకరించాలని కోరారు. ఇందుకు అవసరమైన అన్ని ఏ ర్పాట్లు చేసుకోవాలని, ముఖ్యంగా స్థలం, హమాలీలను సంసిద్ధంగా ఉంచు కొన్నట్లైతే తెచ్చిన ధాన్యాన్ని తక్షణమే మిల్లులలో దించుకునేం దుకు అవకాశం ఉంటుందని అ న్నారు.

    ధాన్యాన్ని దించుకోవడంలో ఆల స్యం చేయవద్దని, ఒకవేళ వర్షం వ స్తే మళ్ళీ తడిచిపోయేందుకు అ వకాశం ఉందని ఆమె తెలిపారు. రెవెన్యూ అదన పు కలెక్టర్ జే. శ్రీని వాస్, జిల్లా పౌర సరఫరాల అధికా రి వెంకటేష్ , పార సరఫరాల జిల్లా మేనేజర్ గోపికృష్ణ, జిల్లా సహకార అధికారి పత్యా నాయక్, తదితరు లు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.