Wednesday, September 30, 2026
More
    HomePoliticsCollector Ila Tripathi : నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదే శం, సాయంత్రం 5తర్వాత...

    Collector Ila Tripathi : నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదే శం, సాయంత్రం 5తర్వాత ఎట్టిపరి స్థితుల్లోనూ నామినేషన్లు స్వీకరిం చొద్దు 

    📰 Generate e-Paper Clip

    Collector Ila Tripathi : ప్రజా దీవెన, పెద్దవూర: నామినేషన్ పత్రాల సమర్పణ సమయంలో ఎవ రైనా అభ్యర్థి నామినేషన్ తో పాటు, కుల ధ్రువీకరణ పత్రం బదులుగా గ జిటెడ్ డిక్లరేషన్ సమర్పించినా అం గీకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రి పాఠి చెప్పారు. అలాంటి వారు నా మినేషన్ల పరిశీలన సమయం వర కు కుల ధ్రువీకరణ పత్రం సమర్పిం చే విధంగా తెలియజేయాలన్నారు. రెండవ విడత నామినేషన్లలో భా గంగా సోమవారం ఆమె నల్గొండ జి ల్లా మిర్యాలగూడ డివిజన్ పరిధి లోని పెద్దవూర గ్రామ పంచాయతీ లో ఏర్పాటు చేసిన నా మినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు.

    నామినేషన్ కేంద్రంలో సౌకర్యాల ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. డి జిటల్ క్లాక్ ను నామినేషన్ వేసే అభ్యర్థులకు స్పష్టంగా కనిపించే వి ధంగా ఏర్పాటు చేయాలని చెప్పా రు. సాయంత్రం 5 గంటలలోపు నా మినేషన్ కేంద్రంలోకి వచ్చిన వారిని మాత్రమే నామినేషన్ వేసేందుకు అనుమతించాలని, 5 తర్వాత వ చ్చన వారిని ఎట్టి పరిస్థితులలో నా మినేషన్ వేసేందుకు అనుమతిం చ వద్దని ఆదేశించారు.

    బ్యాంకు ఖాతాలు, ఇతర ధ్రువీకర ణ పత్రాలతో పాటు, నామినేషన్ ప త్రంలో అన్ని ఖాలీలు సంపూర్ణంగా పూరించేలా అవగాహన కల్పించా లని ,హేల్ఫ్ డెస్క్ లో ఉన్న వారు, ఆర్వో వీటన్నిటిని తెలియజేసేలా ఉండాలని సూచించారు. నామినే షన్ల వివరాలను జాప్యం లేకుండా పంపించాలని, టీ పోల్ లో అప్లోడ్ చేయడం, జిల్లా కేంద్రానికి పంపించ డం లో జాప్యం చేయవద్దన్నారు.

    నామినేషన్ కేంద్రంలో ఏర్పాటు చే సిన హెల్ప్ డెస్క్, నామినేషన్ సం దర్భంగా స్వీకరించే పత్రాల వివరా లు తెలిపే ఫ్లెక్సీ, తదితర వివరాల ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారా యణ్ అమిత్,ఎంపిడిఓ ఉమాదేవి, త హ సీల్దార్ శ్రీదేవి,ఎంఈఓ రా ము, ఆర్ ఐలు శ్రీనివాస రెడ్డి, రా మకృష్ణ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.