Monday, September 28, 2026
More
    HomePoliticsDistrict Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ కీలక ఆదేశాలు, వ చ్చే విద్యాసంవత్సరం నాటికి...

    District Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ కీలక ఆదేశాలు, వ చ్చే విద్యాసంవత్సరం నాటికి తరగ తి గదుల నిర్మాణo పూర్తి చేయాలి

    📰 Generate e-Paper Clip

    District Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: వచ్చే విద్యా సంవత్సరం నాటికి నల్లగొండ ఎస్ ఎల్ బిసీ వద్ద చేపట్టిన యంగ్ ఇండి యా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పా ఠశాల అకడమిక్ బ్లాక్, తరగతి గ దుల నిర్మాణ పనులను పూర్తి చేసి అప్పగించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఇంజనీరింగ్ అధికారు లను ఆదేశించారు. మంగళవారం ఆయన ఎస్ఎల్ బి సి వద్ద ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసి డెన్షియల్ పాఠశాల నిర్మాణ పను లను తనిఖీ చేశారు.

    పనులు నిరంతరం కొనసాగించాల ని, ఒక్క రోజు కూడా పనులు ఆగ రాదని, నిర్దేశించిన సమయానికి ముందే నిర్మాణం పూర్తి చేసి అప్ప గించాలని, ముఖ్యంగా వచ్చే విద్యా సంవత్సరం నాటికి అకాడమిక్ బ్లా క్ ,తరగతి గదులను పూర్తి చేసి ఇ వ్వాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బా ల ప్రసాద్ ను ఆదేశించారు.

    ఇందుకుగాను టైం షెడ్యూల్ ఏర్పా టు చేసుకొని నిర్దేశించిన సమయం ప్రకారం పనులు పూర్తి చేయాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ ల్ పాఠశాల నిర్మాణ పనుల పురోగ తిని సమీక్షించడం జరుగుతుందని తెలిపారు. పాఠశాల నిర్మాణ పను లు నాణ్యతగా ఉండాలని, భవనా నికి బీటలు రావడం ,నాణ్యత లో పించడం వంటివి ఉండకూడదని, ఒకవేళ అలాంటివి జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు.

    రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న దని, నిర్మాణాలు పూర్తయినట్లుగా నిధులు సైతం విడుదల చేస్తున్నద ని, అందువల్ల ఈ విషయంపై ప్రత్యే క దృష్టి కేంద్రీకరించి నిర్మాణ పను లు వేగవంతం చేయాలన్నారు. న ల్గొండ యంగ్ ఇండియా ఇంటిగ్రే టె డ్ రెసిడెన్షియల్ పాఠశాలకు సంబం ధించి కాంపౌండ్ వాల్ తో పాటు పా ఠశాలకు సంబంధించిన స్థలం మొ త్తం భద్రతగా ఉండేలా చూసుకోవా లని ఈఈ ని ఆదేశించారు.

    మునుగోడు పాఠశాల నిర్మాణ పను లను సైతం ఇదేవిధంగా వేగవంతం గా పూర్తిచేయాలన్నారు. తక్కిన ని యోజకవర్గాలలో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియ ల్ పాఠశాల పనులకు సంబంధిం చి న స్థలాలను వెంటనే పొజిషన్లోకి తీ సుకోవాలని ఆయన ఆదేశించారు.

    ఈ ఈ బాల ప్రసాద్ నల్గొండ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ ల్ పాఠశాల వివరాలను జిల్లా కలెక్ట ర్ కుమ్యాప్ ద్వారా పాఠశాల బ్లాక్ లు, డార్మెటరీ, తరగతి గదులు, ప్రి న్సిపల్, సిబ్బంది క్వార్టర్స్ తదితర అన్ని వివరాలను తెలియజేశారు.

    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠ శాల నిర్మాణ పనులను పరిశీలించా రు. స్థానిక సంస్థల ఇంచార్జ్ అదన పు క లెక్టర్, ఆర్డిఓ వై.అశోక్ రెడ్డి, న ల్గొండ తహసిల్దార్ పరశురాం, ఇంజ నీరింగ్ అధికారులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.