Tuesday, September 29, 2026
More
    HomePoliticsNalgonda District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలాత్రిపాఠి ఆదేశం, ధాన్యంశుభ్రపరిచే...

    Nalgonda District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలాత్రిపాఠి ఆదేశం, ధాన్యంశుభ్రపరిచే ఆటోమే టిక్ యంత్రాలను వెంటనే కొనుగో లు చేయాలి

    📰 Generate e-Paper Clip

    Nalgonda District Collector Ila Tripathi :

    ప్రజా దీవెన, తిప్పర్తి: నియమావళి ప్రకారం, నాణ్యత ప్రమాణాలతో ధా న్యాన్ని కొనుగోలు చేసేందుకు ధా న్యాన్ని శుభ్ర పరచేందుకు గాను జి ల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్ యార్డులు, పెద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం శుభ్రపరిచే ఆటో మేటి క్ యంత్రాలను కొనుగోలు చే యాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మార్కె టింగ్ శాఖ సహాయ సంచా లకులు ఛాయాదేవిని ఆదేశించారు. బుధవారం ఆమె నల్గొండ జిల్లా తి ప్పర్తి వ్యవసాయ మార్కెట్ యార్డు లో ఏర్పాటుచేసిన ఆటోమెటిక్ ధా న్యం శుభ్రపరిచే యంత్రం పని తీరు ను పరిశీలించారు.

     

    వానకాలం సీజన్లో దాన్యం కొనుగో లు కేంద్రాలతో పాటు, మార్కెట్ యార్డులకు పెద్ద మొత్తంలో ధాన్యం వచ్చే అవకాశాలు ఉన్నందున ఈ సీజన్ లో ధాన్యాన్ని శుభ్రపరిచేందు కు, పూర్తి నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు చేసేందుకుగాను ధాన్యం శుభ్రపరచే ఆటోమేటిక్ యంత్రాలు బాగా ఉపయోగపడుతున్నందున జిల్లాలోని అన్ని వ్యవసాయ మార్కె ట్ యార్డులు, సౌకర్యాలు ఉన్న పె ద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వీ టిని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇందుకుగాను తక్షణమే ప్రతిపాదన లు రూపొందించి ప్రభుత్వానికి పం పించేందుకు సమర్పించాలని ఆదే శాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ధాన్యం శుభ్రపరిచే ఆటోమెటిక్ యంత్రం పనితీరును పరిశీలిస్తూ మూడు గంటల వరకు పనిచేస్తే ఖర్చయ్యే విద్యుత్తు, అ లాగే సగం దినం, రోజు మొత్తం పని చేస్తే ఎన్ని యూనిట్ల విద్యుత్తు ఖర్చ వుతుందో వివరాలు సమర్పించా లని కోరారు. సాధ్యమైనంతవరకు ఈ సీజన్ నుండే జిల్లా వ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేసేందుకు చర్య లు తీసుకుంటామని తెలిపారు .

    యూరియాపై మాట్లాడుతూ యూ రియా కొరతను దృష్టిలో ఉంచుకొని ఎవరు ఎక్కువ మొత్తంలో యూరి యాను నిలువ చేసుకోవద్దని, ము ఖ్యంగా పెద్ద రైతులు యూరియా విషయంలో సహకరించాలని, అం దరికీ యూరియా అందేలా చూడా లని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు యూరియా నిల్వలను ని యంత్రిస్తూ అవసరమైన రైతులకు అవసరమున్నంత మేర పంపిణీ చే యడం జరుగుతున్నదని, ఈ విష యంలో పూర్తిగా రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని, అదే సమయంలో వ్యవ సాయ మార్కెట్ కమిటీలు, పెద్ద రై తులు, ప్రాథమిక వ్యవసాయ సహ కార సంఘాలు సహకరించి యూరి యా కొరత లేకుండా చూడాలని కో రారు.

     

    రెవిన్యూ అదనపు కలెక్టర్ జెశ్రీని వాస్ ,మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు ఛాయాదేవి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జిల్లా పారసరఫరాల అ ధికారి వెంకటేశం,పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరీష్ ,నల్గొండ వ్య వసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూడి రమేష్, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, తహసిల్దార్ రా మకృష్ణ, ఎంపీడీవో సుధాకర్, ఇత ర అధికారులు, ప్రజాప్రతినిధులు జి ల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.