District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: జాతీయ కు టుంబ ప్రయోజన పథకం కింద న ల్గొండ జిల్లాలో 3500 మందికి లబ్ధి చేకూర్చవచ్చని, ఇందుకుగాను అ ర్హులైన లబ్ధిదారులందరూ దరఖా స్తు చేసుకునే విధంగా జాతీయ కు టుంబ ప్రయోజన పథకంపై విస్తృ తంగా ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.
మంగళవారం ఆమె జాతీయ కు టుంబ ప్రయోజన పథకం పై ఆర్డీవో లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీ డీవోలు, తహసిల్దార్లతో టెలికాన్ఫె రెన్స్ నిర్వహించారు.
ఈ పథకం గురించి అందరూ తెలు సుకునే విధంగా తహసిల్దార్ కార్యా లయాలు, ఎంపీడీవో కార్యాలయా లు, మున్సిపల్ కమిషనర్ కార్యాల యాల్లో ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చే యాలని చెప్పారు. అలాగే గ్రామ సంఘాలతో సమావేశం నిర్వహించి పథకం వివరాలను వెల్లడించి చని పోయిన కుటుంబ పెద్ద కుటుంబం నుండి పథకానికి దరఖాస్తు చేసుకు నే విధంగా అవగాహన కల్పించాల న్నారు. ఆర్డీవోలు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు వారి స్థాయిలో మంగ ళవారమే (26.8.2025) జాతీయ కుటుంబ ప్రయోజన పథకం పై ప్రెస్ నోట్ జారీ చేయాలని ఆదేశించారు.
ఈ పథకం కింద ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 2070 దరఖా స్తులు రావడం జరిగిందని, జిల్లాలో ఏప్రిల్,1,2017 నుండి చనిపోయిన వారు చాలామంది ఉంటారని, మ రోసారి గ్రామ, మున్సిపల్ పట్టణ స్థాయిలో పరిశీలించి వివరాలను సేకరించి జాగ్రత్తగా నివేదికలు పం పించాలన్నారు. గ్రామ సమాఖ్య సం ఘాలతో సమావేశం నిర్వహించాల న్నారు. జిల్లాకు నిర్దేశించిన 3500 లక్ష్యం చేరుకునే విధంగా అధికారు లు దరఖాస్తులను స్వీకరించాలని, వచ్చిన దరఖాస్తులన్నింటిని తహ సిల్దార్లు పూర్తిస్థాయిలో పరిశీలించి ఆర్డీవోల కు సమర్పించాలని, ఆర్డీ వోలు ఆన్లైన్లో డిఆర్ఓ కు సమర్పిం చాలని ఆదేశించారు.
మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారా యణ అమిత్ , నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దారులు, ఎంపీ డీవోలు ఈ టెలికాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.
