Tuesday, September 29, 2026
More
    HomePoliticsNalgonda Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ కీలక ఆదే శం, నెలాఖరుకు...

    Nalgonda Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ కీలక ఆదే శం, నెలాఖరుకు డబుల్ బెడ్ రూ మ్ ఇండ్ల పంపిణీ పూర్తి చేయాలి

    📰 Generate e-Paper Clip

    Nalgonda Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాల ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికా రులను ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పై శనివారం ఆమె గృ హనిర్మాణ శాఖ పీడి,ఆర్డీవోలు, త హసిల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వ హించారు.

    జిల్లాలోని అన్ని నియోజకవర్గాల లో దాదాపుగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తయ్యాయని, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పారదర్శకంగా పం పిణీ చేయాలన్నారు.

    ఇందులో భాగంగా బుధవారం నా టికి లబ్ధిదారుల జాబితాలను రూ పొందించాలని, లబ్ధిదారులు ఎక్కు వగా ఉన్నచోట శుక్రవారం లాటరీ ద్వారా ఎంపిక చేయాలని, ఎంపికైన లబ్ధిదారులకు. ఇండ్లను పంపిణీ చే సేందుకుగాను శనివారం నాటికి ప్రొ సీడింగ్స్ సిద్ధం చేయాలని, సంబం ధిత శాసనసభ్యుల సమ్మతితో స్థా నిక ప్రజాప్రతినిధులు, జిల్లా మం త్రుల ద్వారా లబ్దిదారులకి ఇండ్లను పంపిణీ చేసే కార్యక్రమాలు చేపట్టా లని ఆదేశించారు.

    డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపి ణీ లో ఎలాంటి ఆరోపణలకు తావివ్వ కుండా, జీవోలోని నియమ, నిబంధ నల ప్రకారం ప్రక్రియ మొత్తం నిర్వ హించాలని, ప్రత్యేకించి లాటరీ ద్వా రా లబ్ధిదారులను ఎంపిక చేసే కా ర్యక్రమం మొత్తం వీడియోగ్రఫీ చే యించాలని అన్నారు. గృహ నిర్మా ణ శాఖ పీడీ తోపాటు, ఆర్డీవోలు ల బ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని ద గ్గరుండి పర్యవేక్షించాలని ఆదే శిం చారు.

    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయా మండలాల వారిగా పూర్తి అయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, తయా రు చేయాల్సిన ప్రొసీడింగ్స్, తదిత ర అంశాలపై మాట్లాడారు. కొన్ని ఇ ళ్లకు ఇదివరకే ప్రభుత్వం చెల్లింపు లు చేయడం జరిగిందని, లబ్ధిదా రులకు కేటాయించిన తర్వాత త క్కిన బ్యాలెన్స్ మొత్తాన్ని లబ్ధిదా రుల ఖాతాలోపే నేరుగా జమ చే యడం జరుగుతుందని ,ఈ విష యాన్ని లబ్ధిదారులకు తెలియజే యాలని ఆమె గృహ నిర్మాణ శాఖ పి డి రాజ్ కుమార్ ను ఆదేశించా రు.

    డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, శాస న సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరిని భాగస్వామ్యం చే యాల ని ఆమె ఆదేశించారు. రెవెన్యూ ఆ దనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్, ఆ ర్డీవోలు అశోక్ రెడ్డి, రమణారెడ్డి, త హసిల్దార్లు తదితరులు మాట్లాడా రు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.