Tuesday, September 29, 2026
More
    HomePoliticsNalgonda Father, Son Suspicious Death : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో ఘోర వి షాదం,...

    Nalgonda Father, Son Suspicious Death : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో ఘోర వి షాదం, ఒకే ఇంట్లో తండ్రీకొడుకుల అనుమానాస్పద మృత్యువాత 

    📰 Generate e-Paper Clip

    Nalgonda Father, Son Suspicious Death : ప్రజా దీ వెన, నల్లగొండ క్రైమ్: నల్ల గొండ పట్టణంలోని సూర్యవంశీ కాలనీ (రోడ్డు నెం-1) లో సోమవా రం ఒకే ఇంట్లో తండ్రీకొడు కులు విగతజీవులుగా పడి ఉండటం తీవ్ర కలకలం రేపింది. విద్యుత్ శాఖలో జె.ఎల్.ఎమ్ (LT ల్యాబ్) గా పనిచేస్తున్న పబ్బతిరెడ్డి లింగారెడ్డి (42), అతని చిన్న కుమారుడు, 9వ తర గతి చదువుతున్న ప్రణీత్ రెడ్డి (14) ఇద్దరూ తమ ని వాసంలోనే అ నుమానాస్పద స్థితిలో మరణించారు.

    పోలీసుల ప్రాథమిక విచారణ ప్ర కారం… మృతుడు లింగా రెడ్డి భా ర్య కవిత ఈరోజు ఉదయం తన పెద్ద కుమారుడు ప్రశాంత్ రెడ్డిని ఇంటర్ సెకండ్ ఇయర్ హాస్టల్‌లో చేర్పించ డానికి హైదరాబాద్‌కు వె ళ్లారు. అదే సమయంలో లింగా రె డ్డి తండ్రి సత్తి రెడ్డి తన స్వగ్రామమైన అప్పాజీపేటకు వెళ్లా రు. సాయంత్రం కవిత హైదరాబాద్ నుండి తిరిగి వచ్చేసరికి ఇంటి ప్రధాన గేటు లోపలి నుండి గడియ పెట్టి ఉంది. భర్తకు వరుసగా ఫోన్ చేసి నా సమాధానం లేకపోవడంతో, ఆందోళ న చెందిన ఆమె పక్కింటి అబ్బాయి సహాయంతో గేటుపై నుంచి లోపలికి దించి, తలుపులు తెరిపించారు. లోపలికి వెళ్లి చూడగా హాలులో భర్త, కొడుకు ఇద్దరూ శవాలై పడి ఉ న్నారు.

         హత్యనా ఆత్మహత్యనా ?

    ఘటనా స్థలంలో దృశ్యాలు పలు అనుమానాలకు తావిస్తు న్నాయి. 9వ తరగతి విద్యార్థి ప్రణీత్ రెడ్డి తలపై నాలుగు తీవ్రమైన రక్తగా యాలై, హాలులో రక్తపు మడుగు లో పడి ఉన్నాడు. ఇక తండ్రి లిం గారెడ్డి నోటి నుండి నురగలు వ స్తూ పడి ఉన్నాడు. అతని పక్కనే మంచంపై ‘మోనోక్రోటోఫా స్’ అనే పురుగుల మందు డబ్బా లభ్య మైంది. కుమారుడి తలపై గాయా లు ఉండటం, తండ్రి పక్కన పురుగుల మం దు డబ్బాదొరకడంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలా లే క మరేదైనా కారణమా అనేది తే లాల్సి ఉంది.

    రంగంలోకి ప్రత్యేక బృందాలు మృతుడి తండ్రి పబ్బతి రెడ్డి సత్తి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు న ల్గొండ వన్ టౌన్ పోలీ సులు కేసు నమోదు చేశారు. ఘటన తీవ్రత దృష్ట్యా నల్గొం డ వన్ టౌన్ ఇన్‌స్పె క్టర్ ఏ. రాజశేఖర్ రెడ్డి, సబ్-ఇన్‌స్పె క్టర్లు జె. సైదులు, ఎన్. వెంకట్ నా రాయణ తమ క్రైమ్ సిబ్బం దితో క లిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కే సు ఛేదన కోసం క్లూస్ టీమ్ (Clues Team) మరియు డాగ్ స్క్వాడ్ (Dog Squad) రంగంలోకి దిగి భౌతిక ఆధారాల ను, వేలిముద్రలను సేకరించాయి. నిందితులు ఎవరైనా ఉం టే వదిలిపెట్టబోమని, త్వరలోనే కేసు పూర్తి వివరాలను వెల్ల డిస్తామని ఇన్‌స్పె క్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.