–నల్లగొండలోనే వరి ధాన్యం పం డుతుంది
–నల్లగొండ బత్తాయి ఎంతో ప్రసిద్ధి చెందింది
–మా రైతుల కోసం అత్యాధునిక ధాన్యం గోదాము, బత్తాయి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలి
–కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి
Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర ఆహార,వినియోగదా రుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి,రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కలిసి ఎఫ్.సి.ఐ డివిజనల్ ఆఫీస్,బఫర్ స్టోరేజ్ కాంప్లెక్స్ ను నల్లగొండ లో గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ.. జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న కీలక స మస్యల పరిష్కారం కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభు త్వాన్ని అభ్యర్థించారు. ఈ పర్య టన సందర్భంగా జిల్లాను వ్యవసా య ఉత్పత్తుల కేంద్రంగా” (Agro Produce Hub)* మార్చేందుకు గల ప్రాధాన్యతను మంత్రి వివరిం చారు.
తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన ప్పటికీ, వాతావరణం, భూమి అను కూలంగా ఉండటంతో ప్రధానంగా వరి పంటను అత్యధికంగా పండి స్తోంది. గతేడాది యాసంగిలో దేశం లోనే అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది, రికార్డు స్థాయిలో 148 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది. ఎఫ్. సి .ఐ.కి ధాన్యం సరఫరా చేయ డంలో నల్గొండ జిల్లా ముఖ్యపాత్ర పోషిస్తోంది ఈ యాసంగి సీజన్లో తుఫాను వల్ల పంట దెబ్బతిన్నా, జిల్లా ఏకంగా 8.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించింది.
నిరంతరం అకాల వర్షాలు,ఆధునిక గోదాములు లేకపోవడం వలన, ధా న్యం నాణ్యత తగ్గి, సకాలంలో ఎఫ్.సి.ఐ.కి పంపడం కష్టంగా మా రింది. వాతావరణ సమస్యల నుండి రైతులను కాపాడటానికి, న ల్గొండ జిల్లాకు ఒక ప్రత్యేకమైన, అ త్యాధునిక గోదాం కేంద్రాన్ని మం జూరు చేయాలి. జిల్లాకు 1 లక్ష మె ట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదా ములు అవసరం.శాస్త్రీయ పద్ధతిలో ఎక్కువ ధాన్యాన్ని నిల్వ చేసే పెద్ద స్టీల్ సైలోస్ (Steel Silos), గ్రెయిన్ డ్రైయర్స్ మరియు ఆటోమేటిక్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేయాల న్నారు.
గోదాముల నిర్మాణానికి జిల్లా కేంద్రా నికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిప్పర్తి మండలంలో కావాల్సినంత స్థలం అందుబాటులో ఉందని, నల్గొండలో బాయిల్డ్ రైస్ ఎక్కువగా తయారు చేస్తారు కాబట్టి, ఇక్కడి మిల్లర్లకు రా రైస్ లేదా పార్ బాయి ల్డ్ రైస్ ఏదైనా ఎఫ్.సి.ఐ.కి ఇచ్చే అవ కాశం కల్పించాలని మం త్రి పేర్కొన్నారు.
*నల్గొండ బత్తాయి కి జాతీయ గుర్తింపు…* నల్గొండ జిల్లాలో బత్తాయి పంట కూడా అత్యధికంగా పండుతున్నదని,సుమారు 4.50 లక్షల టన్నుల తీపి బత్తాయి (స్వీట్ ఆరెంజెస్) పంట దిగుబడి వస్తుంద ని, బత్తాయి రైతులకు మద్దతుగా వారు ఎదుర్కొంటున్న సమస్యలు మంత్రి కోమటి రెడ్డి కేంద్రం మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
“నల్గొండ బత్తాయి రకాన్ని తక్షణమే భారత ప్రభుత్వ “ఒక జిల్లా ఒక ఉ త్పత్తి” (ODOP) పథకంలో చేర్చా లి. దీనివల్ల అధికారిక బ్రాండింగ్, మార్కెటింగ్, మార్కెట్ అనుసం ధానం,మంచి రేటు లాంటి అవకా శాలు లభిస్తాయి. బత్తాయి నిల్వ సమస్యలను అధిగమించడానికి, అత్యవసరంగా 2500 మెట్రిక్ టన్నుల (MT) సామర్థ్యం గల కోల్డ్ స్టోరేజ్‌ను నల్గొండకు మంజూరు చేయాలన్నారు.
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచు కుని, ఈ ముఖ్యమైన గోదాములు మరియు కోల్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను త్వరగా మంజూరు చేయాలని మం త్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని,మంత్రిని కోరారు. ఈ కొత్త సౌకర్యాలు వస్తే, రైతులు సం తోషంగా ఉంటారని, ఆహార ధాన్యా లు పాడవకుండా ఉంటాయని, దేశానికి ధాన్యం సరఫరా నిరంతరం జరుగుతుందని ఆయన ఆశాభా వం వ్యక్తం చేశారు.
నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుం దూరు రఘువీర్ రెడ్డి,ఎమ్మెల్సీ శంక ర్ నాయక్,భారత ఆహార సంస్థ ఈ డి వనిత శర్మ,జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, భారత ఆహార సంస్థ జిల్లా మేనేజర్ రాజు, ఎఫ్‌సిఐ అధి కారులు, తదితరులు ఈ కార్యక్ర మంలో పాల్గొన్నారు.

