Nalgonda Photojournalists Awards : ప్రజాదీవెన నల్గొండ : ప్రపంచ ఫోటోగ్రఫీ(2025) దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పౌర సంబంధాల శాఖ హైదరాబాద్ వారు నిర్వహించిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన పోటీలొ.
నల్గొండ జిల్లాకు చెందిన నలుగురు ఫోటో జర్నలిస్టులకు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, రాజీవ్ యువ వికాసం తెలంగాణలో ఉత్తమ వార్త చిత్రాలు ఫోటోగ్రఫీ పోటీలలొ ముచ్చర్ల విజయ్ కుమార్,(ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్)ముచ్చర్ల శ్రీనివాస్,(ది హాన్స్ ఇండియా)కారింగు శ్రీనివాస్,(మనం న్యూస్ ఫోటోగ్రాఫర్) కారింగు వెంకన్న( నవతెలంగాణ ఫోటోగ్రాఫర్ ) అవార్డులు గెలుపుపొందారు.
ఎఫ్ టి సి సి ఐ తెలంగాణ టూరిజం వారు నిర్వహించిన పోటీలలో రాష్ట్ర ప్రధమ బహుమతి ముచ్చర్ల శ్రీనివాస్,(ది హాన్స్ ఇండియా) గెలుపొందారు. రాష్ట్ర సమాచార శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కె. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఐ.ఎ.ఎస్ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక ఐ అండ్ పిఆర్ డిపార్ట్‌మెంట్, కె. శ్రీనివాస రెడ్డి, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, తెలంగాణ ప్రభుత్వం.
డాక్టర్.జి.మాల్సూర్ (సీఎం చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (సిపిఆర్‌ఓ) చేతులమీదుగా గ్రీన్ పార్క్ హోటల్ హైదరాబాద్ లో అవార్డుతో పాటు నగదు పురస్కారాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా పట్టణ జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ నాయకులు, కుల సంఘ నాయకులు వారికి అభినందనలు తెలియజేశారు.



