Tuesday, September 29, 2026
More
    HomePoliticsSP Sharath Chandra : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర ఆదే శాలు, సమర్థవంత నేరనియంత్ర...

    SP Sharath Chandra : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర ఆదే శాలు, సమర్థవంత నేరనియంత్ర ణకు మరింత కఠినచర్యలు

    📰 Generate e-Paper Clip

    SP Sharath Chandra : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో నేరాలపై ప్రత్యేక దృష్టి సా రించి, వాటిని సమర్థవంతంగా ని యంత్రించేందుకు మరింత కఠిన చ ర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జిల్లా పోలీసు అధికా రులను ఆదేశించారు.జిల్లా పోలీ సు కార్యాలయంలో పోలీసు అధి కారులు, సిబ్బందితో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశం లో జిల్లాలో నేర నియంత్రణకు తీ సుకుంటున్న చర్యలు, పెండింగ్‌లో ఉన్న కేసుల స్థితి, కేసుల విచారణ లో అధికారుల చొరవ, నేరస్తులకు కోర్టుల ద్వారా శిక్షలు పడేలా చేప డుతున్న ముందస్తు చర్యలపై జి ల్లా ఎస్పీ సమీక్ష నిర్వహించారు.

    ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లా డుతూ ప్రజల అవసరాలకు అను గుణంగా పోలీస్ శాఖ పార దర్శ కంగా, బాధ్యతాయుతంగా సే వ లందిస్తూ ప్రజల విశ్వాసం పొందే లా పనిచేయాలని సూచించారు. పెరుగుతున్న వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వాటి నియంత్రణకు అన్ని రకాల చర్య లు తీసుకుంటూ శాంతి భద్రతల ప రిరక్షణలో ఎలాంటి రాజీ ఉండకూ డదన్నారు.నిఘా వ్యవస్థలో సీసీ కె మెరాలు కీలక పాత్ర పోషిస్తున్న నే పథ్యంలో, కమ్యూనిటీ పోలీసింగ్‌ లో భాగంగా సీసీ కెమెరాల ఏర్పా టును మరింత ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.నేరం చేసినవారికి శిక్ష, నేరం చేయని వా రికి రక్షణ అన్న లక్ష్యంతో పోలీస్ శాఖ పని చేయాలని, మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యధిక ప్రా ధాన్యం ఇస్తూ నాణ్యమైన, సత్వర సేవలు అందించాలని అన్నారు.

    పోక్సో, గ్రేవ్, నాన్-గ్రేవ్, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో విచారణను వేగ వంతం చేసి కోర్టుల్లో చార్జ్‌షీట్లు స కాలంలో దాఖలు చేయాలని ఆదే శించారు.

    రోడ్డు ప్రమాదాల నివారణకు అవ సరమైన రోడ్డు భద్రత ప్రమాణాల ను కచ్చితంగా అమలు చేయాల ని, ట్రాఫిక్ సమస్యల పరిష్కారాని కి సంబంధిత శాఖలు, ప్రజలతో స మన్వయం చేసుకుంటూ ముందు కు సాగాలని తెలిపారు. జిల్లాలో దొంగతనాల నివారణకు పగలు, రాత్రి పెట్రోలింగ్‌ను అప్రమత్తంగా నిర్వహించాలని, రౌడీ షీటర్లు, అ నుమానితులు, పాత నేరస్థులపై క ఠిన నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. సైబర్ నేరాలు, ఆన్‌ లైన్ బెట్టింగ్, లోన్ యాప్ మోసాల పై ప్రజలకు విస్తృత అవగాహన క ల్పించాలని తెలిపారు. అలాగే అక్ర మ గంజాయి, జూదం, పీడీఎస్ బి య్యం అక్రమ రవాణా, అక్రమ ఇ సుక రవాణా వంటి అసాంఘిక కా ర్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిం చి కఠిన చర్యలు తీసుకోవాలని ఆ దేశించారు.

    అలాగే బాధితుల గౌరవం, హక్కు లను కాపాడుతూ వృత్తిపరమైన సేవలు అందించడమే లక్ష్యంగా

    ఏదైనా నేరం జరిగిన వెంటనే బా ధితులు ఫోన్ ద్వారా లేదా మౌఖి కంగా సమాచారం అందిస్తే, మహి ళలు, చిన్నారులు తదితర బాధి తులు ఇకపై పోలీస్ స్టేషన్‌కు వెళ్ల కుండానే వారి ఇంటి వద్దే ఎఫ్‌ఐ ఆ ర్ నమోదు చేసే విధానాన్ని పోలీ స్ శాఖ అమల్లోకి తీసుకొచ్చిందని జిల్లా ఎస్పీ తెలిపారు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు, శారీరక దా డులు, ఆస్తి వివాదాలు, పోక్సో చ ట్టం, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు, బాల్య వివాహాల నిషేధ చట్టం, దొం గతనం, ర్యాగింగ్ నిరోధక చట్టం కింద నమోదయ్యే కేసుల్లో ఈ వి ధానం అమలులో ఉంటుందని పే ర్కొన్నారు.

    ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్. బి డిఎస్పీ మల్లారెడ్డి, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, మి ర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రా జు, దేవరకొండ డిఎస్పీ శ్రీనివాసరా వు, డీసీఆర్‌బీ డీఎస్పీ రవి, సీఐ లు, ఎస్‌ఐలు, సిబ్బంది తదితరు లు పాల్గొన్నారు.

    *నల్లగొండ జిల్లా సైబర్ వారియ ర్స్‌ కు రాష్ట్ర స్థాయి గుర్తింపు*

    సైబర్ నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు సైబర్ అవగాహన కల్పిం చడంలో ఉత్తమ సేవలు అందించి న నల్లగొండ జిల్లా సైబర్ వారియ ర్స్‌కు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ల భించింది. నల్లగొండ జిల్లా పోలీస్ శాఖకు చెందిన సైబర్ వారియర్ పోలీస్ కానిస్టేబుళ్లు కె. సత్యనారా యణ (1 టౌన్ పోలీస్ స్టేషన్), ఆ ర్. శ్రీనివాస్ (2 టౌన్ పోలీస్ స్టే ష న్) లు తమ ప్రతిభకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు, బహు మతులు స్వీకరించారు.ఈ సంద ర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ప వార్ ప్రశంసాపత్రాలు అందుకున్న సైబర్ వారియర్ కానిస్టేబుళ్లను అ భినందిస్తూ భవిష్యత్తులో కూడా సై బర్ నేరాల నియంత్రణలో మరింత చురుకుగా పనిచేస్తూ ప్రజలకు రక్ష ణ కల్పించాలని ఆకాంక్షించారు.

    సైబర్ నేరాల నియంత్రణలో నల్ల గొండ జిల్లా పోలీసుల కృషికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించడం గ ర్వకారణమని జిల్లా పోలీస్ అధి కారులు పేర్కొన్నారు. పెరుగుతు న్న సైబర్ నేరాల నేపథ్యంలో నల్ల గొండ జిల్లా పోలీస్ శాఖ చేపడు తున్న అవగాహన కార్యక్రమాలు, సాంకేతిక చర్యలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారుతున్నా యని తెలిపారు.

    ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్,డిఎస్పి లక్ష్మీనారాయణ, టూ టౌన్ సీఐ రాఘవరావు, వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, టూ టౌ న్ ఎస్ఐ సైదులు తదితరున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.