Monday, September 28, 2026
More
    HomePoliticsSP Sharath Chandra Pawar : సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులను క్లియర్ చేయాలి

    SP Sharath Chandra Pawar : సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులను క్లియర్ చేయాలి

    📰 Generate e-Paper Clip

    –ప్రజల్లో రోడ్డు భద్రత నిబంధనల పై అవగాహన కల్పించాలి

    –వినాయక చవితి, ఈద్ మిలాద్ ఉన్ నబీ ని శాంతి యుత వాతావరణంలో జరుపుకోవాలి

    –జిల్లా యస్పి శరత్ చంద్ర పవార్

    –ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని ఆదేశం

    –ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు పతకాల అందజేత

     

    SP Sharath Chandra Pawar : ప్రజాదీవెన నల్గొండ :  పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారి నేర సమీక్షా సమావేశంలో పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గూర్చి అడిగి, గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ తో పూర్తి పారదర్శకంగా చేయాలి అన్నారు. కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకుషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలి అన్నారు. ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని పేర్కొన్నారు. ప్రతి అధికారికి సి.సి.టి.యన్.ఎస్ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని సూచించారు. అవసరమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని సూచించారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు పని చేయాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సంవర్దవంతమైన సేవలు అందజేస్తు సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలని అన్నారు. గ్రామ పోలీసు అధికారులు ప్రతీ రోజు గ్రామానికి సందర్శించి ప్రజలతో మమేకం అవుతూ నేర నియంత్రణకు కృషి చేయాలని ఆదేశించారు. కమ్మునిటీ పోలిసింగ్ ద్వారా గ్రామాలలో సిసిటీవి లు ప్రాముఖ్యత అవగాహన కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

    ఆన్లైన్ మోసాలకు గురి అయినట్లైతే 1930కు కాల్ చేసి లేదా యన్.సి.ఆర్.పి. https://www.cybercrime.gov.in/ పోర్టల్ నందు నమోదు ఫిర్యాదు నమోదు చేయాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృ ష్టి సారించాలని, ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లు గా గుర్తించి, సైన్ బోర్డు లను ఏర్పాటు చేయించాలని సూచించారు. హైవే రోడ్లను కలుపుతూ ఉండే లింకు రోడ్లకు స్పీడ్ బ్రేకర్స్ వేయించడం, రోడ్డుకు అడ్డుగా ఉన్న పొదలను తొలిగించే విధంగా చూడాలని అన్నారు. రోడ్డు ఇంజనీరింగ్ లో లోపాలున్నట్లయితే నేషనల్ హైవే స్టేట్ హైవే అథారిటీ ఇతర సంబంధిత అధికారుల సమన్వయంతో ప్రమాదాల నివారణ కృషి చేయాలని అన్నారు.అలాగే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతీ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ డ్రైవింగ్, మైనర్లు వాహనాలు నడుపుట లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో రోడ్డు భద్రత నిబంధనల గురించి అవగాహన కల్పించాలని అన్నారు.విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని, దొంగతనాలు జరగకుండా పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. వారి మళ్ళీ రిపిటెడ్ గా దొంగతనాలకు పాల్పడితే గ్యాంగ్ కేసులు నమోదు చేయాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు గంజాయిని ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా క్రయ విక్రయాల పైన, జూదం, పి.డి.యస్ అక్రమ రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

    అలాగే రానున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు, ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగలను పురస్కరించుకొని జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉంటూ ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. వినాయక ప్రతిమను ప్రతిష్టించదలచినవారు ముందస్తుగా జిల్లా పోలీసులకు ఆన్లైన్ https://policeportal.tspolice.gov.in/index.htm లింక్ ద్వారా సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు.

    అనంతరం విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినా జిల్లా పోలీసు అధికారులు ఆడిషనల్ ఎస్పీ జి. రమేష్ ఉత్తమ సేవ,RSI అశోక్ మహోన్నత సేవా పథకం, యస్.ఐ ఖాలీలుల్ల ఖాన్, ఏఎస్ఐలు వెంకట్ రెడ్డి, రవి ప్రసాద్, ఏఆర్ ఏస్ఐలు యాదగిరి రెడ్డి, రవి కుమార్ హెడ్ కానిస్టేబుల్ మోహన్ రావు,గోవర్ధన్ రెడ్డిలకు సేవా పతకాలు అందజేశారు.

    ఈ సమావేశంలో ఏఎస్పీ మౌనిక ఐపీఎస్, అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు, డి.సి.ఆర్.బి డీఎస్పీ రవి కుమార్, సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీ నారాయణ, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సిఐ లు, యస్.ఐ లు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.