Sunday, September 27, 2026
More
    HomePoliticsMinister Komatireddy Venkat Reddy: ప్రజాప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుoది 

    Minister Komatireddy Venkat Reddy: ప్రజాప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుoది 

    📰 Generate e-Paper Clip

     

    Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: క్రిస్మస్ పర్వ దినం పురస్కరించుకుని నల్లగొండ పట్ట ణం లోని క్లాక్ టవర్ సెంటర్లోనీ పురాతన సేయింటినరీ బాప్టిస్ట్ చ ర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో రా ష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంక ట్ రె డ్డి పాల్గొన్నారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్న మంత్రి ప్రజలం తా సుభిక్షంగా ఉండా ల ని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

    యేసు క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవ సోదర,సోదరీమణులకు క్రి స్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పు రాతన సేయింటినరీ బాప్టిస్ట్ చ ర్చి లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో వేలాది మందితో కలిసి పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. యేసుక్రీ స్తు బోధనలు ప్రేమ, శాం తి,త్యాగం, సేవా భావాన్ని మనకు గుర్తుచేస్తాయన్నారు.

    మిషనరీలు,హాస్పిటల్స్ సేవా భా వంలో క్రైస్తవులు ముందుంటార న్నారు. యేసు బోధనలు శాంతిని, ప్రేమను కోరుకునే విధంగా ఉం టాయని,శత్రువును సైతం క్షమించే గు ణం కలిగి ఉండాలనే ఆయ న బోధనలు ప్రపంచ మానవాళికి ఆచరణీయం అన్నారు.

    డిసెంబర్ నెల అంటే తెలంగాణ ప్ర జలకు సంతోషాన్ని నింపిన నెల అ ని, డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన చేసిన రోజు తెలంగాణ ఇచ్చి న తల్లి సోనియా గాంధీ పుట్టిన రోజు ఒకే రోజు కావడం మన అదృ ష్టమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదే ళ్ల తర్వాత ప్రజా ప్రభు త్వం అధికారంలోకి వచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయక త్వంలో అన్ని వ ర్గాల ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నామన్నా రు.

    ఇందిరమ్మ ఇళ్లు,సన్నబియ్యం లాం టి మానవీయ కోణంలో పథకా లు అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతం త మాత్రంగా ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులం సమష్టిగా పనిచేస్తూ రాష్ట్రాన్ని రెండేళ్లుగా క్రమంగా గాడిన పెడు తున్నామన్నారు. యే సు ప్రభువు కృపతో ప్రజలు అంతా ఆనందంగా ఉండాలని, తెలం గాణ రాష్ట్రం అభి వృద్ది పథంలో సాగాలని ప్రార్ధిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

    ఈ కార్యక్రమంలో మంత్రి తో పాటు చర్చి ప్రతినిధులు విలియమ్స్, పస ల శౌరయ్య, మాజీ మున్సిపల్ ఛైర్మ న్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్ట ణ కాంగ్రె స్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రె డ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అ బ్బగోని రమేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొ న్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.