Rachakonda CP : ప్రజా దీవెన, హైదరాబాద్: క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ) అనేది ఎక్కువకాలం పా టు పొగ తాగడం, లేదా పీల్చడం వ ల్ల ఊపిరితిత్తుల్లో వచ్చే తీవ్ర సమ స్య. దీన్ని పూర్తిగా నయం చేయడం దాదాపు సాధ్యం కాదు. మధుమే హం, రక్తపోటు లాంటివి మన చే తుల్లో లేని, మనం నియంత్రించలేని వ్యాధులు. అదే సీఓపీడీ అయితే మనం సిగరెట్లు కాల్చకుండా ఉంటే చాలు, మన దరి చేరదు. కాలుష్యం బారిన పడకుండా, పొగ తాగకుం డా ఉంటే చాలావరకు పెద్దవయసు లో ఈ వ్యాధి రాకుండా చూసుకోవ చ్చు. అంటే మీ ఆరోగ్యం మీ చేతు ల్లోనే ఉంది. దురలవాట్లకు దూరం గా ఉంటే ఇలాంటి సమస్యలు మీ దరిచేరకుండా ఉంటాయి. అందువ ల్ల ఊపిరి ఆగిపోకుండా ఉండాలం టే సిగరెట్లు కాల్చడం ఆపాల్సిందే నoటూ రాచకొండ పోలీస్ కమిషన ర్ జి. సుధీర్ బాబు అప్పీల్ చేశారు.
అంతర్జాతీయ సీఓపీడీ డే సందర్భం గా నగరంలోని ప్రధాన ఆస్పత్రుల లో ఒకటైన ఎల్బీనగర్ కామినేని ఆ స్పత్రిలో జరిగిన కార్యక్రమంలో ఆ యన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా రాచకొండ సీపీ చే సిన వ్యాఖ్యలు ఆయన మాట ల్లో నే…‘సీఓపీడీని వీలైనంత ముందు గా గుర్తిస్తే అప్పటివరకు ఊపిరితి త్తులకు అయిన నష్టాన్ని కొంతవర కైనా తగ్గించే అవకాశం ఉంటుంది. సాధారణంగా 60 ఏళ్ల తర్వాతే ఈ వ్యాధి లక్షణాలు బయటపడతా యి. అప్పుడు ఊపిరి అందడం కొం త తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడో 2 0లలో చేసిన తప్పులకు 60లలో ప డే శిక్ష ఇది. దీన్ని గుర్తించడానికి ఉ న్న ఏకైక పరీక్ష.. పల్మనరీ ఫంక్షన్ టె స్ట్ (పీఎఫ్టీ). సాధారణంగా దీనికి రూ.3వేల వరకు ఖర్చవుతుంది.
అయితే, సీఓపీడీ డే సందర్భంగా కామినేని హాస్పిటల్స్ వారు ఈ నెల 22వ తేదీ వరకు రూ.400కే ఈ ప రీక్షను, పల్మనాలజిస్టు కన్సల్టెన్సీ ని అందిస్తున్నారు. పొగతాగే అలవా టు ఉన్నవారు, ఇప్పటికే ఇబ్బంది పడుతున్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకొండి.”
సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రోజుకు 10 సిగరెట్ల చొప్పున 20 ఏ ళ్లు కాల్చినా, లేదా 20 సిగరెట్ల చొ ప్పున పదేళ్లు కాల్చినా సీఓపీడీ వ చ్చే అవకాశం ఉంటుంది. ఇది సా ధారణంగా 60 ఏళ్లు దాటిన తర్వా తే బయటపడే సమస్య. ఎప్పుడో సిగరెట్లు కాల్చి తర్వాత మానేశాం అనుకున్నా కూడా అప్పటికే ఈ న ష్టం జరిగి ఉండొచ్చు. దాని లక్షణా లు మాత్రం 60 ఏళ్ల తర్వాత క్రమం గా మన రోగనిరోధక శక్తి తగ్గినప్పు డు బయటపడతాయి. సిగరెట్లు కాల్చడమే కాక.. పొయ్యి పొగ ఎ క్కువగా పీలుస్తున్నా, తీవ్రమైన వా యుకాలుష్యానికి గురైనా కూడా ఈ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుం ది.
అలాగని సిగరెట్లు కాల్చేవారందరికీ ఇది వస్తుందని చెప్పలేం. కేవలం 20% మందిలో మాత్రమే ఇది కనప డుతోంది. ఈ వ్యాధి ఉన్నవారు త ప్పనిసరిగా న్యుమోనియా టీకా, ఇ న్ఫ్లూయెంజా టీకాలు వేయించు కోవడం మంచిది. సీఓపీడీ వల్ల ఊ పిరితిత్తుల్లోని శ్వాసనాళాలు బాగా సన్నబడిపోతాయి. అందువల్ల ఊ పిరి అందడం కష్టమవుతుంది. ఆస్థ మా ఉన్నవారికైతే దాన్ని పూర్తిగా నయం చేయగలం. కానీ సీఓపీడీని మాత్రం పూర్తిగా నయం చేయడం అసాధ్యం.
పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనే పరీక్ష ద్వారానే దీన్ని గుర్తించగలం. అం దువల్ల పొగతాగే అలవాటు ఉన్నా, పొగ వచ్చే పొయ్యిలను ఎక్కువ కా లం ఉపయోగించినా, తరచుగా వా యుకాలుష్యానికి గురవుతున్నా ఈ పరీక్ష చేయించుకోవడం మంచి ది. ఊపిరితిత్తులు మరింత పాడ వ్వకముందే వాటిని కాపాడుకో వా లని సూచించారు.

