Monday, September 28, 2026
More
    HomePoliticsDistrict Collector Badugu Chandrashekhar : జిల్లాలో రెండవ రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

    District Collector Badugu Chandrashekhar : జిల్లాలో రెండవ రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

    📰 Generate e-Paper Clip

    — నల్లగొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్

    District Collector Badugu Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సి బ్బంది కేటా యింపులో భాగంగా రెండవ రాండ మైజేషన్ ప్రక్రియను మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో మున్సి ప ల్ జిల్లా ఎన్నికల పరిశీలకులు జి. రమేష్ సమక్షంలో జిల్లా కలెక్టర్, జి ల్లా ఎన్నికల అధికా రి బి. చంద్రశేఖ ర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జ రిగింది. జిల్లాలోని నల్గొండ మున్సి పల్ కార్పొరేషన్,నందికొండ, చం డూర్, చిట్యాల, దేవరకొండ, హాలి యా, మిర్యాలగూడ మున్సిపా లి టీల పరిధిలోని అన్ని పోలింగ్ స్టే ష న్లకు అవసరమై న పోలింగ్ సిబ్బం దిని కేటాయించినట్లు కలెక్టర్ తెలి పారు.

    అన్ని మున్సిపాలిటీలలో మొత్తం 162 వార్డులు,475 పోలింగ్ స్టేష న్లు ఉండగా,20 శాతం రిజర్వుతో కలిపి ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక పి ఓ,ఒక ఏ పి ఓ,ఇతర పిఓ ల చొ ప్పున మొత్తం 1713 మంది పోలిం గ్ సిబ్బందిని రెండవ రాం డమైజే షన్ ద్వారా కేటాయించినట్లు తెలి పారు. పోలింగ్ ప్రక్రియ పారదర్శ కంగా, నిష్పక్షపాతంగా నిర్వ హిo చేందుకు రాండమైజేషన్ విధానం అత్యంత కీలకమన్నారు.

    ఈ ర్యాండమైజేషన్ కార్యక్రమానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ జె .శ్రీని వాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అద నపు కలెక్టర్, నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, జిల్లా విద్యా శాఖ అధి కారి బిక్షపతి తదితరులు హాజర య్యారు.

    *మిర్యాలగూడలో సీఎం సభా ఏర్పాట్ల పరిశీలన* ఈ నెల 4 న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రె డ్డి నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప ర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను జి ల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఎ స్పీ శరత్ చంద్ర ప వార్ లు మంగ ళవారం పరిశీలించారు. హేలి ప్యా డ్, ప్రధాన వేదిక, రాష్ట్ర ముఖ్య మంత్రి చేతులమీదుగా చేసే శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాల శిలా ఫలకాల స్థలం, బహిరంగ సభకు హాజరయ్యే ప్రజల కోసం చేసిన ఏ ర్పాట్లు, తాగునీరు, బ్యా రికేడింగ్, తదితర అన్ని ఏర్పాట్లను పరిశీలిం చారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూసు కోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించా రు.

    ముఖ్యమంత్రి రాక సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ తెలి పారు. ముఖ్యమంత్రి రాక సం ద ర్భంగా మిర్యాలగూడ రూరల్ పరి ధిలోని గూడూరు వద్ద పెద్ద ఎ త్తు న బహిరంగ సభ, ఇతర ఏర్పా ట్ల ను చేయడం జరుగుతున్నది.

    ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డి ఎస్ పి రాజశేఖర్ రాజు, జిల్లా అధి కారులు, పోలీస్ అధికారులు, ఇత ర అధికారులు ఉన్నారు.

    *విద్యార్థులు ఒత్తిడిని జయిం చేందుకు ఇంగ్లీష్ లో ప్రత్యేక శిక్ష ణ తరగతులు*

    పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీ క్షల సమయంలో విద్యార్థులు ఎ లాంటి ఒత్తిడి ఎదుర్కోకుండా 8వ తరగతి నుంచే ఇంగ్లీష్ లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ . శ్రీధర్ అన్నారు. మంగళవారం కలె క్టరేట్ సమావేశ మందిరంలో బీసీ హాస్టల్స్‌, రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్‌, గురుకుల విద్యాసంస్థల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడు తూ విద్యార్థులు పరీక్షల్లో వెనుక బడటానికి ప్రధాన కారణం ఇంగ్లీష్ భాషపై సరైన అవగాహన లేకపోవ డమేనని అన్నారు.

    విద్యార్థుల్లో చిన్న తరగతుల నుం చే రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ స్కిల్స్‌ ను పెంపొందించేలా శిక్షణ ఇవ్వాల ని సూచించారు. 8 వ తరగతి నుం చే ఇంగ్లీష్‌పై పట్టు సాధిస్తే టెన్త్, ఇం టర్ దశలో పరీక్షల భయం తగ్గి మె రుగైన ఫలితాలు సాధించగలుగు తారని తెలిపారు.

    ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాల లతో పోలిస్తే గురుకుల విద్యా వి ధానం మెరుగైనదని ప్రిన్సిపల్ సెక్ర టరీ స్పష్టం చేశారు. గురుకులాల్లో విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన వాతావరణం, నాణ్యమైన బోధన, వ్యక్తిగత శ్రద్ధ లభిస్తోందని అన్నా రు.

    గురుకుల విద్యా సంస్థల్లో విద్యా ర్థుల అకడమిక్ ప్రగతితో పాటు స మగ్ర వ్యక్తిత్వ వికాసం జరుగుతోం దని, ఈ విధానాన్ని మరింత బలో పేతం చేయాలని అధికారులకు సూచించారు.మాహత్మ జ్యోతిరా వు పూలే సెక్రెటరీ బడుగు సైదులు మాట్లాడుతూ ఆరో తరగతి నుంచి విద్యార్థులకు ఇంగ్లీషు మ్యాథ్స్ పై పట్టు వచ్చేలా శిక్షణ ఇవ్వాలని వి ద్యార్థులకు ప్రత్యేక తరగతులు ని ర్వహించాలని భవిష్యత్తులో కాం పిటీటివ్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యే లా విద్యార్థులును. తీర్చిదిద్దాలని తెలిపారు.

    హాస్టల్లో విద్యార్థులకు భోజనాలు కల్తీ జరగకుండా హాస్టల్ సిబ్బంది తమ విధులను బాధ్యతగా నిర్వ హించాలని తల్లిదండ్రుల మీటింగ్ తప్పక పెట్టాలని సొంత బిల్డింగ్ ఉ న్న హాస్టల్లో మౌలిక సదుపాయాలు కావలసిన రిపేరు చేయించండి. వా టికి బిల్లులు మంజూరు చేస్తామని చెప్పారు.ఈ సమావేశంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి ఏ. సంజీవ, ఉమ్మడి జిల్లాల ఆర్సి అధికారి స్వ ప్న , సంబంధిత శాఖాధికారులు, హాస్ట ల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, గురుకు ల పా ఠశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొ న్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.