Varuna Yagam at Nagarjuna Sagar : ప్రజా దీవెన, నాగార్జునసాగర్ (విజయ విహార్):కృష్ణానది తీరం వేద మంత్రోచ్ఛారణలతో పుల కించిపోయింది. నాగార్జునసాగర్ విజయ విహార్ ప్రాంగణంలో ప విత్ర కృష్ణమ్మ ఒడ్డున రాష్ట్ర స మృద్ధిని, పచ్చదనాన్ని కాంక్షిస్తూ ‘వరుణ యాగం’ అత్యంత భక్తిశ్ర ద్ధలతో వైభవంగా ప్రారంభ మైం ది.వేద పండితులు మరియు ఋత్వికుల మంత్రోచ్ఛారణల నడుమ కార్యక్రమం ఆధ్యాత్మిక శోభతో ప్రారంభమైంది. యాగం నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థిస్తూ ఋత్వికులు ముందుగా శాస్త్రో క్తంగా గోపూజ, విశ్వక్సేన పూజ నిర్వహించారు. పూజా కార్యక్ర మాల అనంతరం వేద మంత్రాల జయజయధ్వ నాల మధ్య యా గశాల ప్రవేశం ఘనంగా జరిగిం ద
యాగాన్ని ప్రారంభించిన మంత్రి దంపతులు
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫ రాల శాఖ మంత్రి ఎన్. ఉత్తంకు మార్ రెడ్డి ఆయన సతీమణి ప ద్మావతి రెడ్డి దంపతులు ఈ వరు ణ యాగాన్ని అధికారికంగా ప్రా రంభించి, ప్రత్యేక ప్రార్థనలు సమ ర్పించారు.ఈ ఆధ్యాత్మిక మహో త్సవంలో పలువురు ఉన్నతా ధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హ నుమంతరావు, నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్, యాదగిరిగుట్ట ఈవో
భవాని శంకర్, దేవాదాయ ధర్మా దాయ శాఖ డిప్యూటీ ఈవో, ఇతర ముఖ్య అధికారులు పాల్గొ న్నారు.
సుభిక్షమైన భవిష్యత్తు వైపు
కృష్ణవేణి ఒడ్డున వేద పండితుల ఆశీస్సులతో సాగుతున్న ఈ యాగం, వరుణ దేవుని కరుణతో రాష్ట్రంలోని జలాశయాలను నిం పి, రైతాంగానికి నిరంతర నీటి పారుదలను, సమృద్ధిగల భవి ష్యత్తును అందిస్తుందని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


