Sunday, September 27, 2026
More
    HomePoliticsDistrict Collector Ila Tripathi : విద్యార్థులు.. చదువుతోపాటు శ్రమదానం కూడా అవసరం

    District Collector Ila Tripathi : విద్యార్థులు.. చదువుతోపాటు శ్రమదానం కూడా అవసరం

    📰 Generate e-Paper Clip

    –జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

    District Collector Ila Tripathi : ప్రజాదీవెన నల్గొండ : విద్యార్థులు చదువుతోపాటు, మొక్కలు నాటడం శ్రమదానం, పరిశుభ్రత వంటి కార్యక్రమాలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సోమవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్ లో ఉన్న ప్రతీక్ రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ బాగా చదువుకోవాలని, అందరికీ మంచి పేరు తీసుకురావాలని అన్నారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు చదువు ఒక్కటే మార్గం అని, ముందే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యసాధన కోసం కృషి చేయాలన్నారు.

     

    చదువుతోపాటు, మొక్కలు నాటడం, శ్రమదానం చేయటం, పరిశుభ్రత కార్యక్రమాలు వంటివి విద్యార్థి దశ నుండి చేపట్టాలని, ఇలాంటి కార్యక్రమాలు ఎంతో సంతృప్తిని ఇస్తాయని అన్నారు. జిల్లాలో వనమహోత్సవం కింద పెద్ద ఎత్తున మొక్కలను నాటుతున్నట్లు ఆమె తెలిపారు. జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్ ,ప్రతీక్ ఫౌండేషన్ చైర్మన్ గోనారెడ్డి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.