Sunday, September 27, 2026
More
    HomePoliticsSupreem Court updates : బిగ్ బ్రేకింగ్, వివేకాహత్యకేసులో సీబీఐకోర్టు కీలకఆదేశాలు,  రీ ఇన్వెస్టిగేషన్‌కు ఆమోదం

    Supreem Court updates : బిగ్ బ్రేకింగ్, వివేకాహత్యకేసులో సీబీఐకోర్టు కీలకఆదేశాలు,  రీ ఇన్వెస్టిగేషన్‌కు ఆమోదం

    📰 Generate e-Paper Clip

     

    Supreem Court updates:  ప్రజా దీవెన, కడప: ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీ వై.ఎస్. వివేకానంద రె డ్డి హత్య కేసులో కీలక పరి ణా మం చోటుచేసుకుంది. సంచలనా త్మ కమైన వివేకా హత్యకే సు లో కొన్ని ముఖ్యమైన అంశాలపై  తిరిగి ద ర్యాప్తు (రీ–ఇన్వెస్టి గే షన్) చేయాలని సీబీఐకి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బు ధవారం వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీత దాఖలు చేసిన పిటి షన్‌ను విచారించిన కోర్టు ఇప్పటివరకు జరిగిన దర్యా ప్తులో కొన్ని అంశాలు పూర్తిగా వెలుగులోకి రాలేదని అభిప్రాయప డింది. ఈ నే పథ్యంలో ఆ కీలక అంశాలపై సమగ్రంగా తిరిగి దర్యాప్తు చేయాలని సీబీఐకి ఆదేశాలు ఇచ్చింది.

    హత్యకు సంబంధించిన కుట్రకోణం, సాక్షుల వాంగ్మూలాలు, కీలక ఆధారాల పరిశీలనలో లోపాలున్నాయని సునీత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు, న్యాయసంప న్నమైన విచారణ జరగాలంటే రీ–ఇన్వెస్టిగేషన్ అవసరమని స్పష్టం చేసింది.ఈ ఆదేశాలతో కేసులో కొత్త మలుపులు తిరిగే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో కొత్త ఆధారాలు, కీలక పరిణామాలు బయటపడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.