Sunday, September 27, 2026
More
    HomePoliticsGovernor Vishnu Dev Verma : తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ వర్మ పిలుపు, నల్లగొండ జిల్లాను...

    Governor Vishnu Dev Verma : తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ వర్మ పిలుపు, నల్లగొండ జిల్లాను మాద కద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

    📰 Generate e-Paper Clip

    Governor Vishnu Dev Verma :ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాను టీబి రహిత, మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్ర తి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపుని చ్చారు. ఒకరోజు నల్గొండ జిల్లా ప ర్యటనలో భాగంగా సోమవారం అయన మహాత్మా గాంధీ విశ్వవి ద్యాలయం నాల్గవ స్నాతకోత్సవం లో పాల్గొన్న అనంతరం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణ లోని ఉదయాదీత్య భవన్లో జిల్లా అధికారులు, ప్రముఖ వ్యక్తులతో లతో ముఖాముఖి నిర్వహించారు.

    ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వ పథకాల అమలుపై జిల్లా కలె క్టర్ ఇలా త్రిపాఠి ముందుగా రాష్ట్ర గవర్నర్ కు పవర్ పాయింట్ ప్రజెం టేషన్ ద్వారా వివరిస్తూ నల్గొండ జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథ కాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, జిల్లాలో వైటిపిఎస్, నీటిపారుదల, వైద్య ఆరోగ్య,విద్య, జల్ జీవన్, ప్రధానమంత్రి ఎంప్లా యిమెంట్ గ్యారెంటీ పథకం, సమగ్ర శిక్ష అభియాన్, భవిత కేంద్రాలు గ్రా మ సడక్ యోజన, టిబి ముక్త్ భా రత్, ఆయుష్మాన్ భారత్, గ్రామీ ణాభివృద్ధి, ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్, జాతీయ కుటుంబ ప్రయో జన పథకం, గృహ నిర్మాణం, ఇంది రమ్మ ఇండ్లు, ఆబజన జాతీయ యోజన, ఆది కర్మయోగి అభియా న్, తదితర పథకాలపై లెక్కలతో సహా వివరించారు.

    జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జిల్లా లో శాంతి భద్రతల పై వివరాలను తెలియజేశారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు లయన్ డిస్టిక్ గవర్నర్ మదన్ మోహన్, ఇండియ న్ రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ పు ల్లారావు, వైద్యులు జయప్రకాశ్ రె డ్డి,సామాజిక కార్యకర్త సురేష్ గు ప్తా, కవి సగర్ల సత్తయ్య,దుశ్చర్ల స త్యనారాయణ, రాష్ట్రస్థాయి ఉత్త మ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కృష్ణ కాంత్ నాయక్, రైతు రాంరెడ్డి, పదవతరగతి జిల్లా టాపర్ విద్యా ర్థిని అమూల్య, హెచ్ఐవి పై పని చేస్తున్న సంఘసంస్కర్త మేరీ తది తరులు వారు చేస్తున్న రంగాలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర గవర్నర్ కు వివరించారు.

    జిల్లా అధికారులతో ముఖాముఖి సందర్భంగా జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాసులు జిల్లాలో టీబీ వ్యాధి నివారణకు తీసుకుం టున్న చర్యలు, చికిత్స, తదితర అంశాలను వివరించారు. అనంత రం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ క్షయ వ్యాధిని జిల్లా లో సమూలంగా నిర్మూలించేందుకు ఉన్న అడ్డంకులను అడిగి తెలుసు కున్నారు. ప్రజల్లో టీబీ పట్ల అవగా హన కల్పించాలని, క్షయ వ్యాధి ని వారణకు సొసైటీలో అందరినీ భా గస్వామ్యం చేయాలని అన్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో కవు లు, కళాకారులు, రచయితలు వివి ధ రంగాలలోని ప్రముఖులను టీబి ముక్త్ భారత్ లో భాగస్వాములను చేసి వారితో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి టీబిని పూర్తిగా ని ర్మూలించేందుకు చర్యలు చేపట్టాల ని నల్గొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డికి సూచిం చారు.

    టిబి నివారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టీబి ముక్త్ భారత్ కార్యక్రమానికి భారత ప్రధాని సైతం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, దీనిని దృష్టిలో ఉంచు కొని ఈ కార్యక్రమం పై ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని వర్గాల ప్రజల అభి ప్రాయాలను పరిగణనలోకి తీసుకో వాలని, గ్రామాలలో సర్పంచ్ లను చురుకుగా పాల్గొనే విధంగా చూడా లని, కవులు, కళాకారులు, రచయి తల ద్వారా సాంఘిక నాటకాలు, నాటికలు, పద్యాలు, పాటల ద్వా రా ప్రజల్లో చైతన్యం కల్పించాలని, టీబికి వ్యతిరేకంగా అందర్నీ భాగ స్వాములు చేయాలని సూచించా రు. అలాగే నల్గొండ జిల్లాలో గాంజా ఎక్కువ మొత్తంలో ఉందని తెలుసు కొని గాంజా నిర్మూలనలో సైతం ప్ర త్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఈ రెండు అంశాలపై తో పాటు, మహిళా సాధికారతకు కృషి చేయాలని, ఈ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరిని భా గ స్వామ్యం చేయాలని చెప్పారు.

    కళాకారులు, కవులు, పర్యావరణ వేత్తలు సైతం టీబీ ముక్తుభారత్ లో పనిచేయాలని కోరారు. విశ్వవిద్యా లయ వీసీలు మొదలుకొని కింది స్థాయి వరకు అందరూ భాగస్వా ములు అయితే టీబి, మాదకద్ర వ్యాలను పూర్తిగా నివారించవ చ్చని, అప్పుడు నల్గొండ జిల్లాను టీబి, మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్ద వచ్చని అన్నారు. ముఖ్య మైన పథకాల అమలులో గ్రామీణ ప్రాంతాలలో ప్రత్యేకించి మారుమూ ల గిరిజన ప్రాంతాలపై ఎక్కువ ప్రా ధాన్యత ఇవ్వాలని అన్నారు. క్షేత్రస్థాయిలో చివరి మనిషి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

    వివిధ రంగాలలో పని చేస్తున్న ప్ర ముఖులు వారు సొసైటీకి ఏం చే యగలమో ఆలోచించాలని, ఈ వి షయంపై ఎంపీ ప్రత్యేక శ్రద్ధ వహిం చాలని పునరుద్గాటించారు. నల్గొం డ జిల్లాలో వైద్యం, ఆరోగ్యం, విద్య పథకాల అమలు పట్ల ఆయన జి ల్లా యంత్రాంగాన్ని ప్రశంసించారు. అలాగే పోషణ అభియాన్ తో పా టు, ఇతర పథకాలు బాగా అమలు చేస్తుండడం పట్ల కితాబునిచ్చారు. పౌష్టికాహారం టి బి నివారణ, మా దకద్రవ్య నివారణ, తదితర పథ కాలలో సమాజంలోని ప్రతి ఒక్క రిని భాగస్వామ్యం చేయాలని ఆయ న పిలుపునిచ్చారు.

    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంపీ రఘువీర్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ ను శాలువా, మేమేంటోతో సత్కరిం చారు. నల్గొండ పార్లమెంట్ సభ్యు లు కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లా డుతూ రాష్ట్ర గవర్నర్ సూచనల మేరకు నల్గొండ జిల్లాలో టీబి నివా రణకు ముఖ్యుల సలహాలు తీసుకో వడమే కాకుండా, జిల్లా యంత్రాం గంతో కలిసి పని చేస్తామని అన్నా రు. మిర్యాలగూడ ప్రాంతంలో ఆసి యాలోనే అతి పెద్ద రైస్ మిల్లు ఇం డస్ట్రీ ఉందని, దీనివల్ల వాతావరణ కాలుష్యం ,టీబి వంటి వ్యాధులు సోకడానికి ఆస్కారం ఉందని,ఆ ప్రాంతంపై ఎక్కువ దృష్టి కేంద్రీక రించి టీబి నివారణకు కృషి చేస్తా మన్నారు. అలాగే పట్టణాలలో గాం జా వాడకం ఎక్కువగా ఉందని, దీనిని నివారించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మిర్యా లగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారా యణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, దేవరకొండ ఏసీపీ మౌనిక, డిఎఫ్ఓ రాజశేఖర్, రాష్ట్ర గవర్నర్ జాయింట్ సెక్రెటరీ భవాని శంకర్, జిల్లా అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు, తదిత రులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.