Sunday, September 27, 2026
More
    HomePoliticsTelangana jagruthi kalvakuntla Kavitha : బిగ్ బ్రేకింగ్,కవిత ఘాటు వ్యాఖ్య లు, బిఆర్ఎస్ అసెంబ్లీ...

    Telangana jagruthi kalvakuntla Kavitha : బిగ్ బ్రేకింగ్,కవిత ఘాటు వ్యాఖ్య లు, బిఆర్ఎస్ అసెంబ్లీ బాయ్ కా ట్ కేసీఆర్, కేటీఆర్ నిర్ణయమైతే అ ది చరిత్రలో క్షమించరాని తప్పు 

    📰 Generate e-Paper Clip

    Telangana jagruthi kalvakuntla Kavitha : ప్రజా దీవెన, సూర్యాపేట: మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీ ష్ రావును తిడితే సభను వాయిదా వేసుకొని వెళ్లిపోవటం బీఆ ర్ఎస్ డ్రామా అని తెలంగాణ జా గృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవి త ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆ ర్ఎస్ బాయ్ కాట్ హరీష్ రావు నిర్ణ యమా,బీఆర్ఎస్ పెద్దల నిర్ణయ మా అని ప్రశ్నించారు. అసెంబ్లీ లో మాట్లాడే అవకాశం వదులుకొని బ యట సభలు పెట్టి ప్రజలకు వివరి స్తారా అని ఎద్దేవా చేశారు. తెలంగాణకు 3 శాతం నీళ్ల వాటా తగ్గించే ఒ ప్పందంపై హరీష్ రావు సంతకం చేశారా లే దా అని వ్యాఖ్యానించారు.

    జూరాల నుంచి శ్రీశైలం కు ఇన్ టేక్ పాయింట్ ను ఎందుకు మా ర్చారో సమాధానం చెప్పాలని, కేసీఆర్ ను టెర్రరిస్ట్ తో పోల్చితే నేనే రియాక్ట్ అ య్యాను కానీ బీఆర్ఎస్ నుంచి ఎవరూ స్పందించ లేద ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సూర్యాపేటలో ఏ ర్పాటు చేసిన మీడియా సమావే శంలో ఆమె మాట్లాడారు.

    ఈ సందర్భంగా కవిత చేసిన వ్యా ఖ్యలు ఆమె మాటల్లోనే… సూ ర్యా పేట్ లో జగదీష్ రెడ్డి అనుచరులు గుడులను, చెరువులను కూడా వ దలలేదని తీవ్రమైన ఆరోపణలు చే శారు. హరీష్ రావు, జగదీష్ రెడ్డి పై నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదు. అడ్డగో లుగా అవినీతి చేసిన వారిపై నేను మాట్లాడుతూనే ఉం టాను. సభలో కాంగ్రెస్ ది ఒక డ్రా మా అయితే బీఆర్ఎస్ ది మరొక డ్రామా. సభలో మూసీ, జీహెచ్ ఎం సీ కి సంబంధించిన డివిజన్లపై చర్చ జరిగితే ప్రతిపక్షం లేదు. నేను గుంటనక్క అనే వ్యక్తిని అందరూ హరీ ష్ రావు అంటారు. ఆయనను ము ఖ్యమంత్రి ఒక్క మాట అంటే సభ ను వాయిదా వేసుకొని వెళ్లిపోయా రు. కేవలం హరీష్ రావు ను అంటే బాయ్ కాట్ చేస్తారా, కేసీఆర్ ను తి ట్టినప్పుడు ఈ గుంటనక్క అలాగే వ్యవహరించిందా.ప్రతిపక్షం అంటే ఒక పార్టీ మాత్రమే కాదు ప్రజల గొం తుక. ఏదైనా అంశంపై వ్యతిరేకత ఉంటే ఆ అంశంపై మాత్రమే బాయ్ కాట్ చేయాలి.

    అసెంబ్లీలో ప్రభుత్వం అడ్డగో లు అబద్దాలు

    పాలమూరు రంగారెడ్డి విషయంలో అసెంబ్లీలో ప్రభుత్వం అడ్డగోలు అ బద్దాలు చెప్పింది. ఆల్మట్టి ఎత్తు పెం పు, అప్పర్ భద్ర కు జాతీయ హో దాను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చే యాలి.కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజం గా చిత్తశుద్ది ఉంటే కృష్ణా నది నీళ్ల అంశంపై చర్చించాలి. పాలమూరు, రంగారెడ్డి, నారాయణ్ పేట్ -కొడంగల్ కు 77.5 టీ ఎంసీ లు కేటాయిస్తే 40 టీఎంసీలకే ఎందుకు అంగీకరించారు. పాలమూరు ప్రజలకు రేవంత్ రెడ్డి చేస్తున్న అన్యాయాన్ని ప్రజలు క్షమించరు.నిన్న అసెంబ్లీలో విచిత్ర పరిణామాలు జరిగాయి. అస లు సె షన్ లో మొత్తం ప్రతిపక్షమే లేకుండా సభ జరిగింది. దీంతో పాలక ప క్షం అడ్డగోలుగా అబద్దాలు చెప్పిం ది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్త మ్ కుమార్ రెడ్డి లు ఇష్టానుసారం ప్రసంగం కొనసాగిం చారు. నిజానికి కృష్ణా నది నీళ్ల మీద చర్చ అని చెప్పారు. అలాంట ప్పుడు స్టేక్ హో ల్డ ర్స్ అయిన మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ గురించి మాట్లాడాలి.

    కానీ అపెక్స్ కౌన్సిల్ లో మాట్లాడి వ చ్చిన దాని మీద మాత్రమే చ ర్చ చే శారు. దాంతో ప్రజలకు ఏం లాభం. కృష్ణా వాటర్ రివర్ మేనేజ్ మెంట్ బోర్డులోనే రెండు రాష్ట్రాలను మాత్రమే ఉంచి మన కు అన్యాయం చేశారు. సభలో మాత్రం సీఎం నేను మాట్లాడేది వం దేళ్లు చరిత్రలో ఉం టుందన్నారు. అసలు కర్ణాటక ప్రభుత్వం ఆల్మ ట్టిని 5 మీటర్లు పెంచు తుంటే దాని మీద కదా మాట్లాడాలి. కర్ణాటక చర్య కారణంగా వంద టీఎంసీ ల నీళ్లను మనం నష్టపోయే పరిస్థి తి ఉంది. దీనిపై ఏమాత్రం చ ర్చ జరపకుండా ఒక లెటర్ రాసి సై లెంట్ గా ఉన్నారు. అసలు ఆల్మట్టి ఎత్తు పెంపు పై ఎందుకు మాట్లా డ లేదు. కృష్ణా నది నీళ్లపై ఎందుకు చర్చించలేదు.

    బీఆర్ఎస్ ను తిట్టి పొలిటికల్ గా ప్రయోజనం పొందేందుకు చర్చ జ రిగినట్లు ఉంది.నిజంగా పాలమూ రు జిల్లాపై ఈ ముఖ్యమంత్రికి చి త్త శుద్ధి ఉందా. జాతీయ హోదానే ఇ వ్వమని చెప్పిన కేంద్రం కర్ణాటక ఎ న్నికల కోసం అప్పర్ భద్రకు ఆ హో దా ఇచ్చింది. దీని కారణంగా తుంగ భద్రకు రావాల్సిన నీళ్లను వాళ్లు ఆ పుకున్నారు. అదే విధంగా ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతున్నారు. అక్కడ కాంగ్రె స్ ప్రభుత్వమే ఉంది.ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎందుకు మాట్లాడటం లేదు. భవి ష్యత్ లో మహారాష్ట్రతో ఇబ్బంది వస్తే ఎలా అన్న దానిపై కూడా చ ర్చించాలి కదా. తన తప్పులు కప్పి పుచ్చు కునేందుకు సీఎం రేవంత్ రెడ్డి కురచ మనసుతో మాట్లాడారు.

    రేవంత్, ఉత్తమ్ లకు చిత్తశుద్ధి ఉం టే అప్పర్ భద్ర జాతీయ హో దా, ఆ ల్మట్టి ఎత్తు పెంపునకు వ్యతిరేకంగా తీర్మానం చేయండి. ఆ ల్మట్టి ఎత్తు తగ్గించేలా రేవంత్ రెడ్డి కృషి చేయా లి. లేదంటే ఆయ నను పాలమూరు ప్రజలు క్షమించరు. నారాయణ పే ట్, కొండగల్- మక్తాల్ ఇన్ టేక్ పా యింట్ ను జూరాల నుంచి మార్చు కోవాలి. పాలమూరు ప్రజలకు ఎం తో మేలు చేసే అవకాశాన్ని వదులు కోని చరిత్ర హీనులు కావద్దు. మే ము పార్లమెంట్ లో ఉన్నప్పుడు కూడా అంశాలను బట్టి వ్యతిరేకత చెప్పే వాళ్లం. మళ్లీ వేరే అంశానికి సం బంధించి చర్చ జరిగినప్పుడు వచ్చి మాట్లాడే వాళ్లం. నిన్న జీ హె చ్ఎంసీ ని 300 డివిజన్ చేసే బిల్లు పెట్టారు. అది అవసరం లేదా. హరీ ష్ రావు ను తిట్టారు కనుక వాయి దా వేసుకొని పోయారా.

    డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా బాయ్ కాట్ నిర్ణయాన్ని హరీష్ రావు తీసు కున్నారా, లేక బీఆర్ఎస్ అధినా యకత్వం తీసుకుందా. బీఆర్ఎస్ మిగతా డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు స బి తా, శ్రీనివాస్ యాదవ్ లు కూ డా తమ టైమ్ హరీష్ రావుకే ఇవ్వమన్నారు. అంటే హరీష్ రావు పార్టీలో తనకంటూ ఒక గుంపును తయారు చేసుకుంటున్నారు. బా య్ కాట్ నిర్ణయం కచ్చితంగా హరీష్ రావు దే అని నేను బలంగా నమ్ముతున్నా.ఒక వేళ కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ తీసుకొని ఉంటే అది శ్రేయస్కరమై న పద్దతి కాదు. కృష్ణా నది నీళ్లపై సభలు పెడ తామంటున్నారు. చట్ట సభలో వచ్చిన అవకాశాన్ని వదు లుకోవటం సరికాదు. ప్రజలు ఏమ నుకున్న సరే బీఆర్ఎస్ లో తోక కు క్కను ఊపే పరిస్థితి వచ్చింది.ప్రతిపక్షం లేకపోవటంతో కాంగ్రెస్ వాళ్లు ఇష్టమొచ్చినట్లు అబద్దాలు చెప్పారు.

    బీఆర్ఎస్ ఉండి ఉంటే ఆ అబ ద్దా లను అడ్డుకునే అవకాశం ఉం డేది కదా. హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారంట. అంతకు ముందు ఆయనను నేను కొన్ని ప్ర శ్నలు అడుగుతున్నా. తెలంగాణకు 3 శాతం నీటి వాటా తగ్గించే ఒప్పం దానికి సంతకం చేసింది మీరు కా దా.ఇప్పటికే కట్టిన ప్రాజెక్ట్ లపై తె లంగాణకు 37 శాతం, ఆంధ్రాకు 63 శాతం వాటా ఉండేది. కానీ కాళే శ్వరరావు అని పిలిపించుకున్న హ రీష్ రావు మనకు 34 శాతం నీళ్ల వాటాకే అంగీకరిస్తూ సంతకం చేశా రు. ఇది నిజమా? కాదా? చెప్పాలి. విజ్ఞతకే వదిలేస్తున్నా అంటే ప్రజలు గమనిస్తారు. నేను అడిగిన ప్రశ్నల కు మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో సమాధానం చెప్పాలి.

    జూరాల నుంచి శ్రీశైలం కు ఇన్ టేక్ పాయింట్ ఎందుకు మార్చారో కూ డా చెప్పాలి.అప్పుడు కేసీఆర్ గారు చాలా చెప్పారు. కానీ అవి కాలేదు.హరీష్ రావు ధనదాహాం కారణం గానే ఇన్ టేక్ పాయింట్ శ్రీశైలం కు మారింది. ఏల్లూర్ పంప్ హౌస్ ను అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ గా మా ర్చారు. అందుకు దాదాపు 14 వం దల కోట్లు ఖర్చు పెట్టారు.దీని కార ణంగా 30 మీటర్ల ఎత్తు పెరిగి మనం తీసుకోవా ల్సిన వాటర్ కెపా సి టీ తగ్గింది. పైగా అండర్ గ్రౌండ్ పం ప్ హౌస్ కారణంగా కల్వకుర్తి లిప్ట్ ఇరిగేషన్ లో మోటార్లు చెడిపోయా యి. మొత్తం 5 మోటార్లకు గాను ఇ ప్పటి వరకు 3 మోటార్లే పనిచేస్తు న్నాయి. వాటిని రిపేర్ కూడా చేయ లేదు. కచ్చితంగా నేను అడిగిన ప్ర శ్నలకు హరీష్ రావు సమాధానం చె ప్పాలి. అసెంబ్లీలో చెప్పే అంశాలను పార్టీ ఆఫీస్ లో చెప్పటం సరికాదు.

    హరీష్ రావు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అంటేనే ఆయనకు రేవంత్ తో మ్యా చ్ ఫిక్సింగ్ రాజకీయాలు ఉంటా యి. కేసీఆర్ ని కసబ్ తో పోల్చితే నేను మాత్రమే రియాక్ట్ అయ్యాను.కేసీఆర్ లేకుండా తెలం గాణ లేదు. అలాంటి వ్యక్తిని టెర్రరిస్ట్ తో పోల్చు తారా. రాజకీయం గా హుందాగా వి మర్శలు చేయాలని భావించే వ్యక్తి ని నేను. కేసీ ఆర్ ని ఉరి తీయాలని రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి కృ ష్ణానది లో నష్టం చేస్తున్న దానికి ఆ యనను రెండుసార్లు ఉరి తీయాలి.కేసీఆర్ ని అలా విమర్శించటం దే శద్రోహామే అవుతుంది. కేసీఆర్ ని అలా విమర్శిస్తే బీఆర్ఎస్ నుంచి ఎవరు మాట్లాడలేదు. వాళ్ల ఎజెం డాలు వాళ్లకు ఉన్నాయి. అందుకే వాళ్లు లోపల, నేను బయట ఉన్నా ను.

    ఉమ్మడి రాష్ట్రంలోనే పాలమూరు- రంగారెడ్డి కి 70 టీఎంసీలు, కొ డం గల్- నారాయణ్ పేట్ కు 7.50 టీ ఎంసీలు కేటాయించారు. కానీ 45 టీఎంసీలకు పరిమితమవటానికి ఎందుకు సంతకం చేశా రు. బీజేపీ కి తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేదు. పో రాటం చేయాల్సిన వాళ్లు పట్టించు కోవటం లేదు. బీసీ రిజర్వేషన్ల విష యంలోనూ బీజేపీ అలాగే చేసింది.సమస్య తీర్చే స్థాయిలో ఉండి మనతో పా టు ధర్నా చేయటం ఏంటీ? బీసీ రిజర్వేషన్లు ఇవ్వాల్సిన వాళ్లు ఇ వ్వాలి. మనలాంటి వాళ్లు అడగా లి. బీఆర్ఎస్ హయాంలో నన్ను ని జామాబాద్ కే పరిమితం చేశారు. అయినా సరే ఆ ప్రభుత్వంలో తీసు కున్న నిర్ణయాల్లో నాకు కూడా భా గం ఉన్నట్లే. నేను జనం బాట ప్రా రంభించినప్పుడే క్షమాపణ చెప్పి ముందుకు కదిలాను. నాయకులు తప్పులు చేసినప్పుడు క్షమాపణ కోరి సరిదిద్దుకోవాలి.

    బీఆర్ఎస్ హయాంలో రైతులకు బే డీలు వేశారు. ఉద్యమకారుల కు చే యాల్సినంతా చేయలేదు. ఆ పా పంలో నాకు భాగస్వామ్యం ఉన్న ట్లే. అందుకే క్షమాపణ చెప్పాను.భవిష్యత్ లో చాలా జరుగు తాయి. ఇక నేను సక్సెస్ అవుతానా? ఫెయి ల్ అవుతానా? ప్రజలు నిర్ణయిస్తా రు. సూర్యాపేట జిల్లా అంటే నాకు ప్రత్యేక అభిమానం. జాగృతి తొలి దశలో ముఖ్యమైన చాలా కార్య క్ర మాలు ఇక్కడ చేశాం. ఫణిగిరి మ్యూజియంలో కళాఖండాలు ఇ ప్పటికీ మా జాగృ తి ఆఫీస్ లో ఉ న్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనే జూ రాస్ పల్లి గుట్ట మీద దేవస్థానం కో సం కొట్లాడినం. గొల్లగట్టు జాతర ఘనంగా జరి పించాలని కూడా మే ము ఫైట్ చేశాం. బీఎన్ రెడ్డి, ముల్లు స్వరా జం, మాలోజు వీరన్న లాంటి మహనీయులు పుట్టిన ఈ గడ్డకు సలాం. బీఎన్ రెడ్డి పేరును ఏదైనా ప్రాజెక్ట్ కు పెట్టాలని ఇక్కడి ప్రజ లు కోరుతున్నారు.

    ముల్లు స్వరాజ్యం కాంస్య విగ్ర హా న్ని ప్రభుత్వం ఖర్చుతో సు ర్యా పేట్ లో ఏర్పాటు చేయాలి.ఉప్పల మ ధుసూదన్ నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. ఎంతో నిజాయితీ ప రులు. ఎమ్మెల్యే అ యిన కూడా ఆ యన చెప్పులు కుట్టారు. ఏదైనా మంచి కార్య క్రమానికి ఆయన పేరు పెట్టాలి. బండి యాదగిరి రాసిన పా ట స్ఫూర్తితో నిజాంపైన పోరాటం చేశాం. అదే స్ఫూర్తితో నేను కూడా గుంట నక్క మీద యుద్ధం చేస్తు న్నా. సామాజిక తెలంగాణ ను ప్ర తిపాదించిన వ్యక్తి మారోజు వీర న్న. ఆయన స్ఫూర్తితోనే మేము కూ డా ఉద్యమం చేస్తున్నాం. ఇక కేం ద్రంలో ఉన్న కర్కశ ప్రభుత్వం మా వోయిస్టులను లొంగదీసుకుంటున్న తీరు బాధాకరం. ఇప్పుడు న్న పరి స్థితుల్లో అడవుల్లో తుపాకీ ద్వారా పోరాటం కష్టం. రాజకీ య ప్రక్రియ లో మీరంతా భాగం కావాలని కోరు తున్నా. రాజకీ యంగా మాలాంటి వాళ్లకు దారి చూపాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా.

    సూర్యాపేట జిల్లాలో విస్తృ తంగా పర్యటించాo…ఇక సూ ర్యాపేట జిల్లా పర్యటనలో భాగంగా ముందుగా అర్వపల్లి కేజీబీవీ వె ళ్లాం. అక్కడ దోమలు, కోతుల బె డ దతో తీవ్ర సమస్యలు ఉన్నాయి. ఆ డపిల్లలే కాదా అని చులకనగా చూస్తే చరిత్ర మార్చేస్తారని హెచ్చరి స్తున్నా. వెంటనే ఈ స్కూల్ లో సౌ కర్యాలు ఏర్పాటు చేయాలని కూ డా నేను కలెక్టర్ ని డిమాండ్ చేస్తు న్న. ఎస్సారెస్పీ కాల్వ దగ్గర చూ సిన కాల్వలు మెయింటెనెన్స్ లేకుం డా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అన్ లైన్డ్ కెనాల్స్ తో మనకు అ న్యాయం చేశారు. తెలం గాణ వ చ్చాక మనం సరిచేసుకుంది ఏమీ లేదు. కనీసం మెయిం టెనెన్స్ కు రూపాయి కూడా ఇవ్వలేదు. ఆపరే షన్స్ అండే మెయిం టెనెన్స్ విభా గానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వా లు పైసా నిధులు ఇవ్వలేదు. రుద్ర మ చెరువును 5 టీఎంసీల రిజర్వా యర్ చేస్తామ ని బీఆర్ఎస్ మాట ఇచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్ర భుత్వం కూడా అదే మాట ఇచ్చిం ది. కానీ చేయలేదు. వెంటనే రుద్ర మ చెరువును 5 టీఎంసీల రిజర్వా యర్ గా మార్చాలి.

    తుంగతుర్తి లో 100 పడకల హాస్పి టల్ పూర్తి కాలేదు. ఉన్న 30 పడక ల హాస్పిటల్ ను కూల్చేసి 12 బెడ్స్ చేశారు. విచిత్రంగా గత ప్రభుత్వం లో ఎమ్మెల్యే, ఈ ప్రభుత్వం ఎమ్మె ల్యేలు రెండుసార్లు శంకుస్థాపన చే శారు. కానీ పనులు పూర్తి కాలేదు. బిల్లులు రాకపో వటంతో పనులు చే యలేదని కాంట్రాక్టర్ చెబుతున్నాడు. ఆయన కు జిల్లాలో మూడు హా స్పిటల్స్ నిర్మాణం టెండర్ వస్తే ఒ కటి తర్వాత ఒకటి కడతామంటు న్నారు. అగ్రిమెంట్ లో ఉన్న సమ యం దాటిపోయింది. నిబంధనల కు విరుద్ధంగా ఉన్న ఈ అంశాన్ని కలెక్టర్ పరిశీలించాలి. గుండ్ల సిం గారం లో బ్రిడ్జి పరిస్థితి దారు ణంగా ఉంది. దాని స్థానంలో కొత్తది నిర్మిం చాలి. తుంగతుర్తి, సు ర్యాపేట్ లో 20 రోజులుగా మిషన్ భగీరథ మం చి నీళ్లు వస్తలేవు. త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించాలి. గత ప్రభుత్వంలోనే ఇసుక బుక్కారు. ఇ ప్పుడు ఉన్న వాళ్లు కూడా ఇసుక బుక్కుతు న్నారు. కానీ దాని కార ణoగా బ్రిడ్జిల కూలే పరిస్థితి వస్తుం ది. ఇసుక విషయంలో ఏ ప్రభుత్వం వచ్చిన సరే మ్యాచ్ ఫిక్సింగ్ తో దో పిడీ చేస్తున్నారు. తుంగతుర్తి ని మున్సిపాలిటీ చేయలేదు. ఎందు కు చేస్తలేరని ప్రజలు అడుగుతున్నా రు.

    సూర్యాపేట్ లో ఇంటిగ్రేటేడ్ మా ర్కె ట్ ను ఊరిలో కట్టాల్సి ఉండ గా ఊరిబయటకట్టారు. టౌన్ లో రోడ్ వె డల్పు కోసం నోటీసులు ఇచ్చిన మూడు రోజుల్లో 300 వందల షాప్ లు కూల్చేశారు. 8 ఏళ్లుగా వారికి పరిహారం ఇవ్వలేదు.కేసు వేసిన వా ళ్లను భయపె డుతున్నారు. కలెక్టర్ కల్పించుకొని ఆ 3 వందల షాప్ ల వారికి పరిహారం ఇప్పించాలి. ఇంటి గ్రేటేడ్ వెజ్- నాజ్ వెజ్ మార్కెట్ 50 కోట్లో, 36 కోట్లతోనే కట్టారు అంటు న్నారు. కానీ అక్కడ ఉన్న సమ స్య లతో అది అందుబాటులోకి రాలే దు. జగదీష్ రెడ్డి మంత్రి గా ఉన్నప్ప టికీ సూర్యాపేట పరిస్థితి మారలే దు. కనీసం ప్రతిపక్షంలో ఉన్న ఇ ప్పుడైనా ప్రజలకు మంచి చేసేలా ఆ యన ప్రయత్నం చే యాలి. టౌన్ లో పూల్లారెడ్డి చెరువు ను ట్యాంక్ బం డ్ చేస్తామని చేయలేదు. 2023 అ సెంబ్లీ ఎన్నికలు అనగానే హడావు డిగా సీసీ రోడ్డు వేశారు. ఇప్పుడు ప్ర భుత్వం మారాక అండర్ గ్రౌండ్ డ్రై నేజీ కోసం వాటిని తవ్వతున్నారు.

    అంటే ఎవరికీ లాభం లేకుండా ప్రజా ధనం దుర్వినియోగం చేయ టం చూస్తుంటే బాధనిపిస్తోంది. వాగు ల్లో కట్టి చెక్ డ్యామ్ లు ఏ డాదికే కొ ట్టుకుపోయాయి. టౌన్ లో ఆత్మగౌ రవ కుల భవనాలు ఇవ్వలేదు.సూర్యాపేట్ లో 9 వందలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టారు. వాటిలో 8 వందల మందికి సున్నం కూడా వేయ కుండా ఇచ్చేశారు. ఇ వ్వలేదు. చీదేళ్ల లో డబుల్ బెడ్ రూమ్ లు కూడా ఎలాంటి వసతు లు లేకుండా ఇచ్చేశారు. సూర్యాపే ట మె డికల్ కాలేజ్ లో 300 మంది ఫ్రొఫెసర్లకు గాను 150 మంది మా త్రమే ఉన్నారు. ఇక చీదేళ్ల గ్రామా న్ని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దత్త త తీసుకున్నారంట. అక్కడి ఆరు కిలోమీటర్ల రోడ్డు పై ప్రయా ణించా లంటే 60 కిలోమీటర్లు ప్రయాణించి నంత సమయం పడు తోంది. రోడ్డు పూర్తిగా ఆధ్వాన్నంగా గుంతలతో నిండి ఉంది. వెంటనే రోడ్డు వేయా లని డిమాండ్ చేస్తున్నా. హుజుర్ నగర్ లో కూడా 14 ఏళ్ల కింద ఉత్త మ్ కుమార్ రెడ్డి మంత్రి ఉన్న సమ యంలో కట్టిన 2 వేల ఇళ్లు ఎవరికీ ఇవ్వలేదు. ఇప్పటికైనా వాటిని అ ర్హులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తు న్నా. కృష్ణానది మట్టంపల్లి వద్ద ఓ ఫార్మా కంపె నీ వాడు మొత్తం వెస్టేజ్ పడేశాడు. దీంతో వంద గ్రామాలకు నీళ్లు ఇవ్వలేదు. కానీ ఆ వెస్టేజ్ ప డేసిన ఫార్మా కంపెనీని గుర్తించ లే దు.

    నిఘా వ్యవస్థ, పోలీసులు ఏం చేస్తు న్నారని మంత్రి ఉత్తమ్ కుమా ర్ రెడ్డి ప్రశ్నిస్తున్నా.ఎస్సారెస్సీ స్టేజ్- 2 లో భాగంగా సూర్యాపేట్ లో ఒక్క రిజ ర్వాయర్ కూడా లేదు. రిజర్వాయ ర్లు కడితినే సూర్యాపే ట, కోదాడ, తుంగతుర్తి ప్రజలకు మేలు జరుగు తుంది. అదే విధం గా కాల్వలకు కూ డా లైనింగ్ వేయించాలని డిమాండ్ చేస్తున్నా. 30 వేల ఎకరాలకు నీళ్లి చ్చే మూసీ గేట్ గతంలో ఊడిపో యింది. అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు 280 కోట్లతో ప్రాజెక్ట్ కడతా మని అన్నారు. కానీ ఇప్ప టి కీ అతిగతీ లేదు. హుజుర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో 54 లిప్ట్ లు ఉంటే 17 లిప్ట్ ల పాక్షిక్షంగా, 21 లిప్ట్ లు పూర్తిగా పనిచేస్తలేవు. వీట న్నింటిని కాదని గతంలో బీఆర్ఎస్ 1450 కోట్లతో మెగా లిప్ట్ ప్రాజెక్ట్ ను ప్రతిపాదించింది. అప్పుడు దాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యతిరేకిం చారు. కానీ ఇప్పుడు 500 కోట్లు పెంచి వేగంగా ఆ లిప్ట్ పనులను చేస్తున్నారు.

    మూడేళ్లలో ఏమీ మారిందని ఉత్త మ్ కుమార్ రెడ్డి ఈ లిప్ట్ పను లను చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చే స్తున్నా. లిఫ్ట్ ల రిపేర్ కు డబ్బులు ఇస్తారా? అదే విధంగా మెగా లిప్ట్ లో మీ వాటా ఎంతో చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి హౌసింగ్ మినిస్ట ర్ గా ఉన్న ప్పుడే 13 వేల ఎకరాల సున్నపు గనులు పోయాయి. పులిచింతల ప్రాజెక్ట్ ద్వారా మనకు నష్టం జరిగి తే కూడా ఆయన మాట్లాడలేదు. ఆంధ్రా ప్రభుత్వం 36 టీఎంసీల నీ టిని ఆపితే మటంపల్లి వద్ద లక్ష్మీ నరసింహా స్వామి ఆలయంమునిగిపో తుం ది. మీకు స్వామి మీద భక్తి ఉంటే 30 టీఎంసీల కన్నా ఎక్కువ నీళ్లు స్టోర్ చేయకుండా ఆంధ్రా ప్ర భుత్వాన్ని ఒప్పించాలి. నాగా ర్జున సాగర్ లెప్ట్ కెనాల్ మెయింటెన్స్ ను పట్టించుకోవటం లేదు. దీనిపై ఉత్త మ్ కుమార్ రెడ్డి దృష్టి పెట్టాలి.

    1000 కోట్ల కస్టమ్ మిల్లింగ్ స్కామ్ నిందితులపై ఇప్పటికీ చర్యలు తీ సుకుంటలేరు. ఊరి మధ్యలో కట్టా ల్సిన కలెక్టరేట్ ను ఊరి అవతల ప్రైవేట్ వెంచర్ లో కట్టారు. పైగా అక్కడ 25 ఎకరాలను రూ. 25 లక్షలు ఇచ్చి కొన్నారు.తెలంగాణలో ఏ ప్రాజెక్ట్ లో భూమి పోయిన రైతులకు కూడా ఎకరాకు ఇంత పరిహారం ఇవ్వలేదు. జగదీష్ అన్న చాలా స్పెషల్ కాబట్టి ఆయన ఎకరాకు రూ. 25 లక్షలు ఇప్పించు కున్నారు. ఆ చుట్టుపక్కల 3 వంద ల ఎకరాలు వెంచర్లు వేసి అక్రమా లు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగదీష్ రెడ్డి ఫ్రెండ్స్ కనుక చర్యలు ఉండవు. కానీ తెలంగాణ ప్రజలకు ఈ విషయం తెలియాలని నేను చె బుతున్నా. జగదీష్ రెడ్డి మనుషు లకు దేవుళ్లు, చెరువులు అన్న కూ డా లెక్కలేదు. కర్నాల చెరువును కూడా ఆక్రమించారు. అలుగు పో యే దాని మీద రోడ్డు వేశారు. దీనిపై నేను గూగుల్ ఫోటోస్ తో హైడ్రాకు ఫిర్యాదు చేస్తా. చర్యలు తీసుకుం టారో లేదో అన్న దాన్ని బట్టి ఉత్త మ్, జగదీష్ రెడ్డి ల అండర్ స్టాండిం గ్ తెలుస్తుంది. విజయవాడ- సూ ర్యాపేట హై వే వెంచర్ లో కూడా అ క్రమాలు జరిగాయి. వాటిపై కేంద్రా నికి ఫిర్యాదు చేస్తా.జీవో 58, 59 ను అడ్డుపెట్టుకొని సూర్యాపేట్ లో 5 ఎకరాల భూమిని రైగ్యులరైజ్ చేసుకున్నారు. గుర్రంపోడు భూ ముల విషయంలో స్కామ్ జరిగి న ట్లు గతంలో పెద్ద వివాదం నడిచిం ది. కానీ ఈ ప్రభుత్వం కూడా దా ని పై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదో చెప్పాలి.

    చివ్వెల మండలంలో ఆరు ఎకరాల భూమి దేవుడి భూ ములను కబ్జా చేశారు.ఎండోమెంట్ అధికారులు క చ్చితంగా దానిపై చర్యలు తీసుకో వాలి. టౌన్ లోని ఆటో నగర్ వాళ్ల కు 50 ఎకరాలు ఇస్తామని చెప్పి 5 ఎకరాలు కూడా ఇవ్వలేదు. జగదీ ష్ అన్న వాళ్ల అమ్మ బర్త్ డే సంద ర్భంగా కబడ్డీ పోటీలు పెట్టి దేశ వ్యా ప్తంగా తెలంగాణ పరువు తీశారు.పోటీల సందర్భంగా వీళ్లు అస్తవ్య స్థంగా చేసిన ఏర్పాట్లతో ఒకరు చని పోయారు. 26 మందికి గాయాల య్యాయి. వారికి ఉచితంగా వైద్యం కూడా చేయించలేదు. దీంతో వా ళ్లంతా తెలంగాణ గురించి చెడుగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఇప్ప టికైనా అవకాశం ఉంటే ఆ గాయప డిన వారికి చికిత్స అందించాలి.

    జగదీష్ రెడ్డి, హరీష్ రావు మీద నా కు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదు. వాళ్ల అవినీతి గురించి మా త్రమే నేను మాట్లాడుతున్నాను.అవినీతి లేకుండా ఉన్నప్పుడే అట్ట డుగున్న ఉన్న ప్రజలకు కూడా లా భం జరుగుతుంది. లేదంటే అవి నీ తి తో అక్రమార్జన చేసి మళ్లీ ఎల క్ష న్స్ లో ఖర్చు చేస్తారు. పది వేల రూ పాయలు ఓటుకు ఇచ్చి తండ్రిని స ర్పంచ్ గా గెలిపించుకుంటారు. అవినీతి కారణంగా ప్రజలకు కావా ల్సిన మేలు, ప్రయోజనాలు జరగ వు. నేను మాట్లాడటం కారణంగా జగదీష్ రెడ్డి చుట్టు ఉన్న వాళ్లు నా పై ఏడుస్తారు.కానీ సూర్యాపేట్ జి ల్లాలోని పది లక్షల మంది ప్రజల కోసం మాట్లా డుతున్నాను. ఇప్పటికైనా సరే మ నం అవినీతి లేకుండా తెలంగాణను బాగు చేసుకోవాలి. వ్యవస్థలో లి మిటెడ్ గా ఉన్న అవి నీతిని మనం ఆపలేము. కానీ ఇష్టా నుసారం గా అవినీతి పాల్పడటం కరెక్ట్ కాదు.

    అడ్డగోలుగా అవినీతి చేసే వ్యక్తుల పై నేను మాట్లాడుతూనే ఉంటా. యూరియా కోసం యాప్ మీద చా లా కంప్లైంట్స్ వస్తున్నాయి. ముం దు రైతులకు స్మా ర్ట్ ఫోన్లు ఇచ్చి యాప్ పెట్టాలి. లేదoటే వాళ్లు ఇ బ్బందిపడే పరిస్థితి ఉంది. పార్టీనే వద్దనుకున్నా తర్వాత నైతికతతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశా ను. నేను జాగృతి ఏర్పాటుకు ముందు లక్షన్నర కిలోమీటర్లు తిరిగి అధ్యయనం చేశా ను. ఇప్పుడు కూ డా అదే విధంగా సమస్యలపై అధ్య యనం చేస్తు న్నా. రా ష్ట్రంలో ఒక్కో జిల్లాలో రెండు రోజులు ఉంటూ ప్ర తి సమ స్యపై మాట్లాడుతున్నా నా యకులు ఎవరైనా ఉన్నారా. బీఆర్ ఎస్ లో జరిగిన అన్యాయంపై మా ట్లాడుతూనే ఇప్పుడు ఎలా బాగు చేయాలనిచూస్తున్నాం.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.