— రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Minister Komatireddy Venkata Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: మహిళలు స్వయం శక్తితో పైకి ఎదిగేందుకు రా ష్ట్ర ప్రభుత్వం అనేక రకాల కార్య క్ర మాలు అమలు చేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శా ఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్ర భుత్వ ధ్యేయమని అన్నారు.
సోమవారం అయన నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయావరణలో ఉన్న ఉదయాదిత్య భవన్లో నల్గొండ ము న్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మ హిళా స్వయం సహాయక సం ఘా ల సభ్యులకు 11.38 కోట్ల రూ పా యల వడ్డీ లేని రుణాలు చెక్కు ల ను అందజేశారు. అంతేకాక ఇంది ర మ్మ చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మహిళలను ఉద్దే శించి మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టిందని, ఇ ప్ప టివరకు 265 కోట్ల మంది ఉచిత బ స్సులో ప్రయాణం చేసినట్లు చెప్పా రు. సమాజంలో పేద వారందరికీ రే షన్ కార్డులు ఇవ్వడంతో పాటు, స న్న బియ్యం ఇస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని తెలిపారు. నల్గొండ సమీపంలోని ఎస్ఎల్బీసీ వద్ద 5 కో ట్ల రూపాయలతో రెండు ఎకరాల వి స్తీర్ణంలో మహిళ సంఘాల ఆధ్వ ర్యంలో పెట్రోల్ పంప్ ఏర్పాటు చే శామని, రెండు నెలల్లో ఇది పూర్త వుతుందన్నారు. ప్రతి నియోజక వ ర్గంలో మహిళలతో పెట్రోల్ పంపు ఏర్పాటు చేస్తుండగా, ప్రభుత్వమే స్థలం ,రుణాలు మంజూరు చేసి రైస్ మిల్లులు ఏర్పాటు చేసే ఆలోచన లో ఉన్నట్లు చెప్పారు.
వచ్చే సంవత్సరంలోపు ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇన్ఫ లు ఇస్తామని, ఇంకా ఎవరైనా స్థలం కలిగి ఉంటే తక్షణమే ఇందిరమ్మ ఇ ల్లు మంజూరు చేస్తామని మంత్రి తె లిపారు. పిల్లలను బాగా చదివిం చుకోవాలని, చిన్న వయసులో పెళ్లి ళ్లు చేయవద్దని, ఎవరైనా ఆర్థిక స్తో మత లేక పెద్ద పెద్ద చదువులు చది వించలేకపోతే తనను సంప్రదిస్తే స హకారం అందిస్తానని తెలిపారు. ప్ర తీక్ ఫౌండేషన్ ద్వారా బొట్టుగూడా పాఠశాలను 13 కోట్ల రూపాయల తో ప్రైవేట్ పాఠశాలలకు మించి అ న్ని హంగులతో తీర్చిదిద్దుతున్నా మని, త్వరలోనే ప్రారంభోత్సవం చేయనున్నట్లు మంత్రి వెల్లడించా రు.
ఐటిపాములలో 50 లక్షల రూపా యలు వెచ్చించి 50 మంది మహిళ లకు సోలార్ ప్యానల్ ఏర్పాటు చే యించామని, దాని ద్వారా వారు ఆ దాయం పొందుతున్నారని తెలిపా రు. మహిళలును కోటీశ్వరులను చే సే వరకు వారి వెంటే ఉంటామని మంత్రి వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మా ట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కు ఉచిత బస్సు తోపాటు ,వారి అ భ్యున్నతికి కుటుంబాల తోడ్పాటు కు అనేక కార్యక్రమాల అమలు చే స్తున్నదని తెలిపారు. ఆర్థికంగా వా రు నిలదొక్కునేందుకు వడ్డీ లేని రు ణాలను ఇస్తున్నదని, ఇది మంచి అవకాశం అని,ఈ అవకాశాన్ని స ద్వినియోగం చేసుకోవాలని కోరా రు. 2023- 2024 -25 ఆర్థిక సంవ త్సరంలో 2872 స్వయం సహాయ క సంఘాల మహిళలకు 11.38 కోట్ల రూపాయలు చెక్కులు పంపి ణీ చేస్తున్నట్లు తెలిపారు.
నల్గొండ పట్టణంలో సుమారు 5 కో ట్ల రూపాయ లను స్వయం సహా యక మహిళా సంఘాలకు వడ్డీ లే ని రుణాలు చెల్లిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నాలుగు మున్సిపా లిటీలలో ఇందిరమ్మ చీరల పంపిణీ సైతం చేపట్టడం జరిగిందని,సోమ, మంగళవారం వరకు వీటిని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అ లాగే స్వయం సహాయక మహిళా సంఘాలకు లక్ష్యాన్ని మించి 165 శాతం బ్యాంక్ రుణాలు అందించ డం జరిగిందని ఆయన వెల్లడిం చారు.
స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు క లెక్టర్, ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి మా ట్లా డారు. కాగా పట్టణ స్థాయి ఫెడరే ష న్ అధ్యక్షురాలు జయమ్మ, లావ ణ్యలు మాట్లాడారు. ఈ కార్యక్ర మంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి , మెప్మా పీడీ శ్రీని వాస్, మార్కెట్ క మిటీ చైర్మన్ జూకూరి రమేష్ , ము న్సిపల్ కమిషనర్ సయ్యద్ ముస బ్ అహ్మద్, గృహ నిర్మాణ శాఖ పీ డీ రాజ్ కుమార్ తదితరులు పాల్గొ న్నారు.



