Monday, September 28, 2026
More
    HomePoliticsCable Channel Journalists : బిగ్ బ్రేకింగ్, టీయూడబ్ల్యూజె అల్టి మేటం, కేబుల్ ఛానల్ జర్నలిస్టుల...

    Cable Channel Journalists : బిగ్ బ్రేకింగ్, టీయూడబ్ల్యూజె అల్టి మేటం, కేబుల్ ఛానల్ జర్నలిస్టుల కు అక్రెడిటేషన్లు ఇవ్వాల్సిందే

    📰 Generate e-Paper Clip

    Cable Channel Journalists : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్రంలోని కేబుల్ ఛానల్ జ ర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఇవ్వా ల్సిందేనని తెలంగాణ యూనియ న్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టిజేఎ ఫ్) రాష్ట్ర కమిటీ అల్టిమేటం జారీ చేసింది. కేబుల్ ఛానల్ జర్నలిస్టు లకు అక్రిడిటేషన్లు వచ్చేవరకు ఈ ప్రభుత్వంపై పోరాటం చేసి సా ధిం చేందుకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం అం డగా ఉంటుందని తెలంగాణ యూ నియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సం ఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆ స్కాని మారుతి సాగర్ స్పష్టం చేశా రు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్ కా న్ఫిరెన్స్ లో ఆయన మాట్లాడారు.

    జర్నలిస్టులకు అక్రెడిటేషన్ ల సం ఖ్యను భారీగా తగ్గించడానికి 252 జీవోను ఈ ప్రభుత్వం తీసుకువచ్చి తీరని అన్యాయం చేసిందని, గతం లో 239 జీవో ద్వారా 23 వేల అక్రి డిటేషన్లు అప్పటి బిఆర్ఎస్ ప్రభు త్వంలో నాటి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఇస్తే ఆ సంఖ్యను పదివేల దాకా తగ్గించే ది శగా ఈ నూతన జీఓ వచ్చిందని ఆరోపించారు. అనేక పోరాటాలు చేసిన అనంతరం సవరణ జీవో 1 03 తీసుకువచ్చినప్పటికీ జర్నలి స్టులందరికీ న్యాయం జరగలేదని, కేవలం విభజించి పాలించాలన్న డెస్క్, బ్యూరో జర్నలిస్టులకు ఒకే రకమైన కార్డు మాత్రం ఇస్తామని ప్రకటించినప్పటికీ కేబుల్ జర్నలి స్టులకు సవరణ జీవోలో కూడా ఏ మాత్రం న్యాయం జరగకపోవడం అన్యాయం అన్నారు.

    గతంలో ఐ అండ్ పి ఆర్ ద్వారా దాదాపు 44 కేబుల్ చానల్స్ కు రా ష్ట్ర స్టయిల్ 12 కార్డులు చొప్పున జారీ చేయడం జరిగిందని, ప్రస్తు తం ఆ సంఖ్యను సున్నాకు పరిమి తం చేయడం ఎంతవరకు న్యాయ మని ప్రశ్నించారు. కేబుల్ రిపోర్ట ర్ల కు న్యాయం జరిగే విషయంలో అ వసరమైతే కోర్టుమెట్లు ఎక్కుతా మని ప్రకటించారు. కేబుల్ జర్న లి స్టులకు జరుగుతున్న అన్యాయా న్ని నిరసిస్తూ సంఘీభావంగా మల్టీ సిగ్నల్ ఆపరేటర్లు ఒకరోజు కేబుల్ ప్రసారాలను కొన్ని గంటలపాటు ని లుపుదల చేసి తమ నిరసన తెల పాలని విజ్ఞప్తి చేశారు.

    సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగి రి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం నిరంకుశ ధోరణితో ముందుకు సా గుతోందని జర్నలిస్టులతో పెట్టుకు న్న ఏ ప్రభుత్వం కూడా భవిష్య త్తు లో మళ్లీ అధికారంలోకి వచ్చిన సం దర్భం లేదని చెప్పారు. కేబుల్ చా నల్స్ ను, శాటిలైట్ ఛానల్స్ ను వే రుగా చూడరాదని, అన్ని చానల్స్ లో పనిచేసేది జర్నలిస్టులే అనే వి షయాన్ని ప్రభుత్వం గుర్తు ఎరగాల న్నారు. ఎం ఎస్ ఓ ల సంఘం నా యకులు కొల్ల కిషోర్ మాట్లాడుతూ మల్టీ సిగ్నల్ ఆపరేటర్ల దృష్టిలో శా టిలైట్ ఛానల్ అయినా కేబుల్ ఛా నల్ అయిన ఒకటే అని, అన్ని చా నళ్లు కూడా వార్త ప్రసాదాలు అంది స్తాయన్నారు. కేబుల్ చానల్స్ రిపో ర్టర్స్ కు అన్యాయం జరిగితే ఒక రోజు కేబుల్ ప్రసారాలను నిలు పు దల చేసి తమ సత్తా ఏంటో చాటు తామని స్పష్టం చేశారు.ఈ కార్య క్రమంలో కేబుల్ చానల్స్ నిర్వాహ కులు,నాయకులు కడకంచి వెంక ట్ ,చారి, శివ, భరత్ తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.