Wednesday, October 7, 2026
More
    HomePoliticsUnion Minister Bandi Sanjay : కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచ లన ప్రకటన,...

    Union Minister Bandi Sanjay : కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచ లన ప్రకటన, మార్చి నాటికి మావో యిజానికి అంతం పలుకుతాం 

    📰 Generate e-Paper Clip

    Union Minister Bandi Sanjay : ప్రజా దీవెన, వేములవాడ: దేశవ్యా ప్తంగా అర్బన్ నక్సల్స్ మాయలో ప డి మావోయిస్టులు మోసపోయి ప్రా ణాలు కోల్పోవద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు మార్ చెప్పారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అమిత్ షా కేం ద్ర హోంమంత్రిగా ఉన్నారని, ఇచ్చిన మాట మేరకు వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేసి తీరు తారన్నారు.‘‘అర్బన్ నక్సల్స్ పట్ట ణాల్లో కుటుంబ సభ్యులతో కలిసి జల్సా చేస్తున్నారని, ఏ పార్టీ అ ధి కారంలో ఉన్నా పైరవీలు చేసుకుం టూ ఆస్తులు కూడగట్టుకుని కార్లలో తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. వాళ్ల మాటలు నమ్మిన అమాయకు లు తుపాకీ పట్టుకుని అడవుల్లో తి రుగుతూ తిండీ తిప్పలేక ప్రాణాలు కోల్పోతున్నారు. అర్బన్ నక్సల్స్ చె ప్పేదొకటి. చేసేదొకటి. వారి మాట లు నమ్మి మోసపోవద్దని, మంచి ఆ లోచనలతో సమాజంలోకి రండి, ప్ర జలకు సేవ చేయండని పిలుపు ని చ్చారు. మావోయిస్టులు జన జీవన స్ర వంతిలో కలవడానికి మరో 4 నె లల సమయం మాత్రమే ఉందని, 2026 మార్చినాటికి మావోయిజా న్ని అంతం చేసి తీరుతామని పున రుద్ఘాటించారు.

    మంగళవారం సిరిసిల్ల జిల్లా వేము లవాడ ఏరియా ఆసుపత్రికి విచ్చేసి న కేంద్ర మంత్రి బండి సంజయ్ నేష నల్ మినరల్ డెవలెప్ మెంట్ కార్పొ రేషన్ (ఎన్ఎండీసీ) సహాకారంతో సీఎస్సార్ నిధులతో కొనుగోలు చే సిన రూ.1.5 కోట్ల విలువైన వైద్య పరికరాలను ఆసుపత్రికి అందజేశా రు. జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ తోపాటు వైద్యశాఖ అధికారులతో కలిసి ఆ పరికరాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ పరిశీలించారు. ఆ సుపత్రి అంతా కలియ తిరిగి రోగు లు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంత రం కలెక్టర్, అధికారులతో కొద్దిసేపు సమావేశమై ఆసుపత్రి అభివ్రుద్ధి, పే దలకు మెరుగైన సేవలు అందించేం దుకు అవసరమైన చర్యలు తీసుకో వాలని కోరారు.

    ఈ విషయoలో సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని బండి సంజయ్ భరోసా ఇచ్చారు. అనంత రం మీడియాతో మాట్లాడారు.బండి సంజయ్ వ్యాఖ్యలు ఆయన మాట ల్లోనే..

    కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మి షన్ పేరుతో దేశంలోని అన్ని ఆసు పత్రులకు పెద్ద ఎత్తున నిధులు కేటా యిస్తొంది. ఆ నిధులతోనే ఆసు ప త్రులు నడుస్తున్నాయి. ప్రైవేట్ ఆ సుపత్రుల్లో వైద్యం ఖరీదైన నేప థ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అ న్ని సౌకర్యాలు కల్పించేందుకు య త్నిస్తోంది. చాలా ఆసుపత్రుల్లో సూ దులు, మందులు, కాటన్ కూడా లే ని పరిస్థితి ఉంటే,నా కరీంనగర్ పా ర్లమెంట్ పరిధిలోని ఆసుపత్రుల్లో పేదలకు పూర్తిగా వైద్య సేవలం దిం చేందుకు యత్నిస్తున్నా. అందులో భాగంగా అల్ట్రాసౌండ్, ఈసీజీ మి షన్ వంటి ముఖ్యమైన 16 వైద్య ప రికరాలను అందించాను.

    వేములవాడ ఆసుపత్రిలో మొత్తం రూ.1.5 కోట్ల వ్యయంతో ఈ పరిక రాలను కొనుగోలు చేశాం. దీంతో పాటు హుజూరాబాద్, హుస్నాబా ద్, జమ్మికుంట ఆసుపత్రులకు కూ డా ఇదే స్థాయిలో వైద్య పరికరాలు అందిస్తున్నాం. అందుకోసం నేషన ల్ మినరల్ డెవలెప్ మెంట్ కార్పొ రేషన్(ఎన్ఎండీసీ) సహకారంతో రూ.5 కోట్ల సీఎస్సార్ నిధులను సే కరించి ఈ వైద్య పరికరాలను కొను గోలు చేసి ఆయా ఆసుపత్రులకు అందించాం. భవిష్యత్తులో ఈ ఆసు పత్రులకు అన్ని రకాల సహాయం అందిస్తా.

    యువ డాక్టర్లకు నా సూచన ఒక్క టే. డాక్టర్ల రిక్రూట్ మెంట్ కోసం క లెక్టర్ 89 వైద్య పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. యువ డా క్ట ర్లంతా దరఖాస్తు చేసుకుని ఉద్యో గాలు పొందాలని కోరుతున్నా. క రీంనగర్ నుండి వేములవాడ ఎంతో దూరం కూడా లేదు. ఉద్యోగాల్లో చే రి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు సేవ చేయాలని కోరుతున్నా. మీ చ దువుకు సార్ధకత, మీ తల్లిదండ్రుల రుణం తీరాలంటే పేదలకు సేవ చే యాలని కోరుతున్నా. కరీంనగర్ స హా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పేదల ను ఆదుకుంటాం.

    తుపాకీ ద్వారా రాజ్యాధికారం సా ధ్యం కాదు. తుపాకీ పట్టుకుని అ మాయకులైన దళిత, గిరిజనులను చంపారు. పోలీసులను చంపారు. మా ప్రతాప రామక్రిష్ణను కూడా కా ల్చి చంపేందుకు యత్నించారు. చా వుదాకా వెళ్లొచ్చారు. జాతీయ జెం డా ఎగరేయొద్దని నక్సలైట్లు బీజేపీ నేతలను ఎంతోమందిని కాల్చి చం పారు. జాతీయ జెండా ఎగరేసేటో డు భారతీయుడా నల్లజెండా ఎగరే సేటోడు భారతీయుడా నక్సలైట్లది ఏ సిద్ధాంతం తుపాకీ ద్వారా మీరు సాధించిందేమిటి మీరు సాధించింద ల్లా అమాయకులను పొట్టన పెట్టు కున్నారు. మీరూ బలైపోయారు.

    మేం బ్యాలెట్ ను నమ్ముకుని ము చ్చటగా మూడోసారి దేశ ప్రజల ఆశీ ర్వాదంతో మోదీ ఆధ్వర్యంలో బీజే పీ అధికారంలోకి రాగలిగాం. మీరు తుపాకీ పట్టుకుని పోలీసులను, ద ళిత, గిరిజనులను చంపడం, మీ రూ చనిపోవడం మినహా మీరు సా ధించిందేమిటి ఈ రోజు దేశంలో ఉ న్నది ఆషామాషీ ప్రభుత్వం కాదు. మోదీ ప్రభుత్వం. దేశ సరిహద్దులో జ మవాను వద్ద, పోలీసుల వద్ద మాత్రమే తుపాకీ ఉండాలి. మా వోయిస్టులను తుపాకులను వదిలి జన జీవన స్రవంతిలో కలవాలి. మావోయిజాన్ని అంతం చేయడమే మా లక్ష్యం. మావోయిస్టులు లొం గిపోవాలని అమిత్ షా అవకాశమి చ్చినా వినకుండా ప్రాణాలు కోల్పో తున్నారు.

    తుపాకీతో అసలు మీరు సాధించే దేమిటి తుపాకీ పట్టుకుంటే కక్ష మిం చే ప్రసక్తే లేదు. కలం పట్టి చదువు కునే అమ్మాయిలకు మాయమాట లు చెప్పి తుపాకులు పట్టి అడవు ల్లోకి పంపితే… తిండి తిప్పలు లేక తిరుగుతున్నారు. చనిపోతున్నా రు. ఎవరైనా లొంగిపోతే వాళ్లపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారు.

    మావోయిస్టులారా 4 నెలలు మాత్ర మే మీకు సమయం ఉంది. 2026 మార్చిలోపు మావోయిస్టులను అం తం చేయడమే మా లక్ష్యం. అమిత్ షా మాట ఇస్తే నిలబెట్టుకునే నాయ కుడు. మావోయిస్టు కేంద్ర కమిటీ స భ్యుడు హిడ్మా, ఆయన భార్య సా ధించిందేమిటి? అర్బన్ నక్సల్స్ మా యలో పడి మీ ప్రాణాలు తీసుకోవ ద్దు. అర్బన్ నక్సల్స్ ఏసీల్లో విలాస వంతమైన జీవితాన్ని గడుపుతు న్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చి నా పైరవీలు చేస్తూ ఆస్తులు సంపా దించుకుంటూ కార్లలో తిరుగుతు న్నారు. మీరు మాత్రం అడవుల్లో తిండి తిప్పలు లేకుండా తుపాకీ ప ట్టుకుని తిరుగుతూ ప్రాణాలు కో ల్పోతున్నారు. అర్బన్ నక్సల్స్ చె ప్పేదొకటి. చేసేదొకటి. వారి మాట లు నమ్మి మోసపోవద్దు. మంచి ఆ లోచనలతో సమాజంలోకి రండి. ప్ర జలకు సేవ చేయండి.

    తుపాకీ పట్టుకుని చర్చలు జరు పు తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. తుపాకీ వీడాల్సిందే. జన జీవన స్ర వంతిలో కలవాల్సిందే. తుపాకీ వీడి జనంలోకి వచ్చే వారికి కేంద్రం పూర్తి గా సహకరిస్తోంది. బుల్లెట్ ను న మ్ముకుంటే ప్రాణాలు తీసుకోవడం మినహా మీరు సాధించేదేమీ లేదు. బ్యాలెట్ ను నమ్ముకుంటే అధికా రంలోకి రాగలమనే విషయాన్ని గు ర్తుంచుకోండoటూ బండి సంజయ్ పిలుపునిచ్చారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.