Wednesday, October 7, 2026
More
    HomePoliticsMaulana Abul Kalam Azad : మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో ముందుకెళ్లాలి 

    Maulana Abul Kalam Azad : మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో ముందుకెళ్లాలి 

    📰 Generate e-Paper Clip

    — నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

    Maulana Abul Kalam Azad : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: భారత స్వాతంత్ర సమరయోధు డు, బహుభాషా కోవిదుడు, దేశ వి ద్యారంగ పురోభివృద్ధికి కృషిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో ముందుకెళ్లాలని జిల్లా క లెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చా రు.భారత దేశ మొదటి విద్యా శాఖ మంత్రి, మైనార్టీల అభివృద్ధికి ఎంతో కృషిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి,మరియు జాతీ య విద్యా దినోత్సవాన్ని పురస్క రించుకొని మంగళవారం జిల్లా కలె క్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన మౌ లానా అబుల్ కలాం ఆజాద్ జ యంతి వేడుకలకు ఆమె ముఖ్య అ తిథిగా హాజరయ్యారు.

    ఈ సందర్భంగా కలెక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళుల ర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత దేశ మొట్ట మొదటి విద్యాశాఖ మంత్రిగా పని చేసిన మౌలానా అబుల్ కలాం ఆ జాద్ దేశ విద్యాభివృద్ధికి ఎంతగా నో కృషి చేశారని, ఆయన సమ యంలోనే ఐఐటి వంటి అత్యున్నత విద్యా సంస్థలను స్థాపించడం జ రి గిందని తెలిపారు. అంతేకాక ఆయ న భారతరత్న గ్రహీత అని,సకల భాషా కోవిదుడని, అరబిక్, ఇంగ్లీ ష్ ,ఉర్దూ, హిందీ, పర్షియా,బెంగాలీ వంటి భాషలలో మంచి ప్రావీణ్యం సంపాదించారని తెలిపారు.

    అందరితో సౌమ్యంగా మాట్లాడు తూ మృదుస్వభావిగా పేరుపొం దా రని, మైనార్టీల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని చెప్పారు. వారి ఆశ యాల కనుగుణంగా, వారి స్ఫూర్తి తో జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

    రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివా స్,ఇంచార్జ్ డి ఆర్ ఓ వై.అశోక్ రె డ్డి,జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అ ధికారి విజయేందర్ రెడ్డి,డిఈఓ భి క్షపతి,కలెక్టర్ కార్యాలయ ఏఓ మో తీలాల్,మైనారిటీ పెద్దలు డాక్టర్ ఎం ఏ ఖాన్,సయ్యద్ హసన్,ఎం డి స లీం,ఎం ఏ రఫీ,ఉమర్ షరీఫ్, స య్యద్ జాఫర్, బాబాజియఉ ద్దీన్, మసిఉద్దీన్,అహ్మద్ ఖలీమ్ తదిత రులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.