Tuesday, September 29, 2026
More
    HomeOpinionSuryapet SP Narasimha : యువత డ్రగ్స్‌కుదూరంగా ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి 

    Suryapet SP Narasimha : యువత డ్రగ్స్‌కుదూరంగా ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి 

    📰 Generate e-Paper Clip

    Suryapet SP Narasimha : ప్రజాదీవెన, సూర్యాపేట: ప్ర జా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కా ర్యాచరణలో భా గంగా సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చి వ్వెం ల మండల పరిధిలోని దురా జుపల్లి గ్రామ సమీపంలో గల ప్రతిష్ట ఫార్మసీ కళాశాలలో విద్యార్థుల కు డ్రగ్స్ నిర్మూలన ప ట్ల విస్తృత అ వగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కా ర్యక్రమానికి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ముఖ్యఅతి థిగా హాజరై ప్రసంగించారు.ఈ సం దర్భంగా జిల్లా ఎస్పీ మా ట్లాడుతూ మన సమాజం నుండి డ్రగ్స్ తరిమి వేసి డ్రగ్స్ ర హిత సమాజ నిర్మా ణం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం కృత నిశ్చయంతో ఉన్నది, దీనికోసం సంబంధిత ప్రభుత్వ అధి కారులు, జిల్లా పోలీస్, జిల్లా యంత్రాంగం అనుక్షణం పని చేస్తుంది అన్నారు.

    యువత, విద్యార్థులు ఉన్నత ల క్ష్యాల వైపు సాధనచేయా ల్సి అన్నారు. కష్టపడే వయస్సులో వ్యసనాలకు అలవాటు పడొద్దు, చెడు కు దూరంగా ఉండాలి, మంచి స్నే హితులను, మంచి పుస్తకాలను ఎంచుకోవాలి, తల్లిదండులకు, చ దువు నేర్పు గురువులకు మంచి పే రు తేవాలి, సమాజానికి, ప్రజ లకు మంచి సేవ చేసే వనరుగా ఎదగాలి అని అన్నారు. మ హిళలు, బాల లు, విద్యార్థుల రక్షణలో అనుక్షణం పని చే స్తున్నాము అన్నారు.

    ప్రస్తుతం మన సమాజాన్ని, ము ఖ్యంగా దేశానికి వెన్నుముక లాంటి యువతను డ్రగ్స్ మహమ్మారి పట్టి పీడిస్తోందని అన్నారు. మాదకద్ర వ్యాల వల్ల భావితరాలు తమ ఉ జ్వల భవిష్యత్తును చేతులారా కోల్పోతున్నాయని హెచ్చరించా రు. డ్రగ్స్‌కు బానిసలైన యువత తీవ్ర అనారోగ్యాల బారిన పడట మే కాకుండా, కుటుంబాలను రో డ్డున పడేస్తున్నారని పేర్కొన్నారు. “దేశ భవిష్యత్తు యువత చేతుల్లో నే ఉంది. అలాంటి యువశక్తి డ్రగ్స్ లాంటి మాదకద్రవ్యాలకు బానిసలై తే దేశ ప్రగతి కుంటుపడుతుంది.

    డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్క విద్యార్థి, పౌరు డు భాగ స్వాములు కావాలి అన్నారు. జిల్లాలో ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి విక్రయాలు జరుగుతున్నా, వాటి మూలా లు ఉన్నా వెంటనే పోలీసు వారికి సమాచారం అందించి స హకరించాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యం గా ఉంచబడతాయి. గంజాయి లేదా ఇతర వ్యసనాలకు బానిసలైన వారు ఎవరైనా ఉంటే, వారిని గుర్తించి సంరక్షణ (పునరావాస) కేం ద్రాలకు తరలించి వారి జీవితాల్లో మార్పు తీసుకు రావడా నికి అందరూ కృషి చేయాలి అన్నారు.

     

    జిల్లా పోలీస్ శాఖ డ్రగ్స్ నిర్మూలన కు అనుక్షణం పనిచేస్తోం ది. నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ, గంజాయి సంబంధిత కే సుల్లో ఉన్న పాత నేర స్థులపై నిఘా ఉంచి, వారికి కౌన్సి లింగ్ ఇస్తున్నాము అన్నారు. డ్రగ్స్ మహమ్మారిని రూపు మాపడంలో యువతరం ముందుండాలని, సమాజ మార్పు కోసం పోలీసులతో చేతులు కలపాలని ఎస్పీ పిలుపు నిచ్చా రు. డ్రగ్స్, గంజాయి నిర్మూ లనలో తమవంతు భాగస్వాము లం అవుతాము, గంజాయి అలవాటు ఉన్నవారిలో పరివర్త న తెస్తాం అని విద్యార్థులు ప్రతిజ్ఞ చేయించడం జరిగినది.

     

    ఈ సమాజంలో మరో తీవ్ర అంశా లు రోడ్డు ప్రమాదాలు, సై బర్ మోసాలు అన్నారు. వీటిని అరికట్టా లంటే ప్రజలు అవ గాహన, ముందు చూపు, జాగ్రత్తలు ప్రదానం అన్నారు. జీవి తంలో ఎదిగి కుటుం బాలకు తల్లిదండ్రులకు అండగా ఉం డాల్సిన వారు అజాగ్రత్తగా వా హనాలు నడుపు రోడ్డు ప్ర మాదాల కు గురవుతున్నారు అన్నారు.

    వాహనాలు నడిపే టప్పుడు ముంద స్తు జాగ్రతలు పాటిం చాలి అని కోరారు. అత్యాశకు పోయి అపరిచి తులకు మన వ్యక్తిగత సమాచా రాన్ని ఇచ్చినట్లయితే మోసాలకు గురిఅ వుతామని తెలిపా రు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటన లు ఫోన్ల కు వచ్చే మెసేజ్లను స్పందించి అపరిచితులకు ఎవరు డబ్బులు చెల్లిం చవద్దు అని కోరారు.

    బహుమతులు ఉన్నాయి తక్కువ తక్కువ వడ్డీలకు లోన్స్ ఇస్తాము ప్రభుత్వ పథకాలు ఇస్తాము ప్రాసెసింగ్ ఫీజు చెల్లిం చాలి అంటే అ లాంటి సమాచారాన్ని నమీ ఎవరు కూడా అపరిచితులకు డబ్బులు పంపకూడదు అన్నారు. ఈ కార్య క్రమంలో సూర్యాపేట రూరల్ సిఐ రాజశేఖర్, చివ్వెంల ఎస్ఐ మహే ష్, కనకరాత్నం, బరోసా ఎస్ఐ మౌనిక, షీటీం ఎస్సై నీలిమ, పో లీసు సిబ్బంది కళాశాల యాజ మాన్యం డా. రామకృష్ణ, అధ్యాప కులు, పెద్ద సంఖ్యలో విద్యార్థిని, విద్యార్థులు మరియు పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొ న్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.