BRS Ex Minister Harish Rao : ప్రజా దీవెన, హైదరా బాద్: తెలం గాణ రాజకీయాల్లో మాటలయుద్ధం రోజురో జుకు మరింత వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి ఎనుముల రే వంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. మహాభారతంలో ఉన్న కర్ణునిలా గా నేను నా స్నేహితులకు సహాయం చేస్తానని సీఎం చె ప్పి న మాటలపై హరీశ్ రావు సెటైర్లు వేశారు.రేవంత్ రెడ్డి కర్ణు డు కాదు కుంభకర్ణుడని ఆయన విమర్శించారు. ఎన్నికలు రాగానే నిద్రలే స్తాడు, ఎన్నికలు పూర్తికాగానే మళ్లీ నిద్రపో తాడు. సమస్యలు వచ్చి నప్పుడు మాత్రం బాధ్యత తీసుకో కుండా ఇతరులపై నిందలు వేస్తూ కాలక్షేపం చేస్తాడన్నారు. ఎన్నికల ముందు రైతులకు రైతుబంధు ఇ స్తామని చెప్పి, ఎ న్నికల తర్వాత మాట తప్పడం ఏమిటి నిజంగా కర్ణుడి లాం టి దాత అయితే రైతు బంధు ఎందుకు ఆపేశారు 24 గం ట ల కరెంట్, ఆరుగ్యారెంటీల అమలు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.
కర్ణుడు తన గుండెలు చీల్చి కవచ కుండలాలను ఇచ్చిన దా త అని గుర్తుచేస్తూ, “కర్ణుడు ప్రజల కోసం త్యాగం చేసినవా డు. కానీ ప్రజల గుండెలపై తన్నే నాయకుడు కర్ణు డు ఎలా అవుతాడని విమర్శించా రు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో జరిగిన సమావేశంలో ఆయన మరింత ఆగ్రహంగా మాట్లా డారు.ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో ఇండ్లు కూల్చి వేసి న ఘటనను ప్రస్తావిస్తూ, బాధితుల ఆవేదన చూసి పోలీ సులే కన్నీరు పెట్టుకున్నారని చెప్పారు.
ఆవీడియోలు చూసి రాష్ట్రం మొత్తం దిగ్భ్రాంతికి గురైం ద న్నారు.మాజీ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాలనను అభివృద్ధికి కేరాఫ్‌గా పేర్కొన్న హరీశ్ రావు, ప్రస్తు త కాంగ్రెస్ ప్రభుత్వా న్ని విధ్వంసానికి కేరాఫ్‌గా విమర్శిం చారు. హైదరాబాదులో హైడ్రా పేరుతో, మూసీ సుందరీకరణ పేరు తో పేదల ఇళ్లు కూల్చివేస్తున్నారని ఆరోపించారు.
కట్టడం చేతకాని నాయకుడు కూ ల్చడానికి ఎలా హక్కు పొందాడని ప్రశ్నించారు. అలాగే ముఖ్యమంత్రి ప్రకటించిన “99 రోజుల ప్రణాళికపై కూడా ఆయన వ్యంగ్యంగా స్పం దిం చారు. ప్రజలకు ఇచ్చిన హామీ లు అమలు చేయకుండా మ ళ్లీ కొత్త ప్రణాళికల పేరుతో ముందుకు రావడం ప్రజలను మోసం చేయడమన్నారు. ఇలా తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం రోజు రోజుకు మరింత తీవ్రంగా మారుతోం ది. రాబోయే రోజుల్లో ఈ రాజకీయ విమర్శలు మరింత వేడె క్కే అవకాశం ఉందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

