Interstate Gang Arrest in Nalgonda ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: సులువుగా డబ్బు సంపాదించాలనే దు రాశ యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్న నకిలీ విద్య..వెరసి ఓ భార్యాభర్తల ముఠా ను కటకటాల వెనక్కి నెట్టింది. రద్దీ గా ఉండే సంతలు, అమా యక వృద్ధులు ఉండే దుకాణా లను టార్గెట్ చేస్తూ నకిలీ కరె న్సీని చలామణి చేస్తున్న భా ర్యాభర్తల ముఠాను నల్లగొండ జిల్లా చండూర్ పోలీసులు అ త్యంత చాకచక్యంగా బట్టబయలు చేశారు. ఈ సంచలన కే సు వివరాలను నల్లగొండ డిఎస్పీ కె. శివరాం రెడ్డి మీడియా కు వెల్లడించారు.
ఈ నెల 12వ తేదీన చండూర్ టౌన్‌లోని శ్రీ మాధురి మిల్క్ సెంటర్ వద్ద ఆవుల కిరణ్ అనే వ్యక్తి పాలు విక్రయిస్తుండగా, నిందితుడు బెజ వాడ రాజీవ్ అలియాస్ రాజు రూ .500 నోటు ఇచ్చి పాల ప్యాకెట్ కొ నుగోలు చేశాడు. అయితే, సద రు నోటుపై అనుమానం వచ్చిన కిరణ్ అప్రమత్తమై పోలీసు లకు ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు దీనిపై చండూ ర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 75/2026 కింద సరికొత్త భారతీ య న్యాయ సంహిత (BNS) సెక్ష న్లు 178, 17 9, 180, 181 r/ w 3 (5) ప్రకారం కేసు నమోదైంది.
టాస్క్‌ఫోర్స్ తరహాలో పోలీస్ బృందంచేజ్
నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు డిఎస్పీ కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో చండూర్ సీఐ టి. రా ము, ఎస్ఐ జె. శివ కుమార్ మరియు సిబ్బందితో కూ డిన ప్రత్యేక బృందం రంగంలోకి ది గింది. సాంకేతిక పరిజ్ఞానం, న మ్మక మైన సమాచారంతో ఈరోజు (15- 06-2026) ఉద యం నల్లగొండ లో ని మిర్యాలగూడ రోడ్డులో ఉన్న కంచర్ల టవర్స్ (ప్లాట్ నెం.506) పై దాడి చేసి ఇద్దరు నిందితులను అ దుపులోకి తీసుకున్నారు.
నిందితుల్లో మిర్యాలగూడెం కొత్త గూడెంకు చెందిన A-1గా బెజవా డ రాజీవ్ @ రాజు (38), అతని భార్య A-2 దుర్గం పావని (26) ఉండగా ప్రధాన నిందితుడు రాజీవ్ సామా న్యుడు కాదని విచారణ లో తేలింది. ఇతనిపై గతంలో ఒక హత్య కేసు, ఒక హత్యాయత్నం కేసు ఉన్నాడు. అంతే కా కుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మహబూబా బా ద్, తొర్రూర్, కరీం నగర్, గోదావరిఖని, జనగాం, అద్దంకి, సు బేదారి పోలీస్ స్టేషన్లలో మొత్తం 7 నకిలీ నోట్ల చలామణి కేసులు ఉన్నాయని వెల్లడించారు.ఇక మిర్యాలగూడ I టౌన్ పోలీస్ స్టేషన్లో ఇతనిపై రౌడీషీట్ కూడా ఉండడం గమనా ర్హం.
యూట్యూబ్ గురువు, ఆన్లైన్ సామాగ్రి
ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్క డానికి ఈ జంట యూ ట్యూబ్‌ను వేదికగా చేసుకుంది. యూట్యూబ్ లో దొంగనోట్ల తయారీ వీడియోలు చూసి, దానికి కావాల్సిన హై-క్వా లిటీ ప్రింటర్, బాండ్ పేపర్లను ఆన్ లైన్లో ఆర్డర్ చేశారు. దేశ ఆ ర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని తెలిసి నా కక్కుర్తితో ఇంట్లోనే నోట్లు ముద్రి స్తూ మార్కెట్లలో చలామణి చేయడం ప్రారం భించినట్లు నిందితులు నేరాన్ని ఒప్పుకున్నారు. నిందితుల వద్ద నుంచి 15 నకిలీ రూ. 500 నోట్లు, ఒక నెంబర్ లేని ప ల్సర్ బై క్, HP కంపెనీ ప్రింటర్ & స్కానర్, 100 జేకే ఎక్సెల్ సూపర్ వైట్ బాం డ్ పేపర్స్ కట్ చేసిన నోట్ల పేపర్ ముక్క లు, కత్తెర, స్పార్కెల్ పెన్, రెండు స్టీల్ స్కేళ్లు స్వాధీన పరు చుకున్నారు.
ఇదిలా ఉండగా కేసు నమోదైన కేవలం 3 రోజుల్లోనే అంత ర్రాష్ట్ర నేరచరిత్ర ఉన్న ముఠాను పట్టుకున్న చండూర్ ఎస్ఐ జె. శివకుమార్, ఏ ఎస్ఐ శ్రీరాములు, పిసిలు ఆనంద్ రెడ్డి, శివరాం కృష్ణ, నరేందర్, ఉ పేందర్లను జిల్లా ఎస్పీ శరత్ చం ద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను ప్రకటిం చారు. కాగా ప్ర జలు, వ్యాపారులు నగదు లావాదే వీల స మయంలో ముఖ్యంగా రూ. 500 నోట్లను తీసుకునేటప్పు డు జాగ్రత్తగా పరిశీలించాలని పోలీసు లు సూచించారు.


