Tuesday, September 29, 2026
More
    HomeIndiaMinister KomatiReddy VenkataReddy: మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి కీల క వ్యాఖ్య, ప్రజాప్రతినిధులు, అధి...

    Minister KomatiReddy VenkataReddy: మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి కీల క వ్యాఖ్య, ప్రజాప్రతినిధులు, అధి కారుల సమన్వయం అవసరం

    📰 Generate e-Paper Clip

    Minister KomatiReddy VenkataReddy: ప్రజా దీవెన, నల్లగొండ: ప్రజా ప్రతి నిధులు, అధికారులు కలిసి పని చే స్తే పేదల అభివృద్ధి, సంక్షేమం సా ధ్యమవుతుందని రాష్ట్ర రో డ్డు, భ వనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక 99 రో జు ల కార్యా చరణ ప్రణాళి క అమలులో భాగంగా గురు వారం నల్గొండ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, మున్సిపల్ కాన్సిలర్లకు ఉద్దేశించి ఏ ర్పాటుచేసిన శిక్ష ణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

    అనంతరం మంత్రి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన స్థా నిక ప్రజా ప్రతినిధులపై అనేక బాధ్యతలు ఉన్నాయని, ప్రజ లతో మమేకమై ప నులు చేసినప్పుడే ప్రజల మన్నన లను పొందుతారన్నారు. మున్సిప ల్ పట్టణాలలో ప్రజలు అనేక సమ స్యలతో ఉంటారని, వారి సమస్య లను తెలుసుకొని వాటిని తీర్చేం దుకు చర్యలు తీసుకోవాలని, ఏవైనా సమ స్యలుంటే తమ దృష్టికి తీ సుకురావాలని, తన వంతు స హ కారం మున్సిపాలిటీల అభివృద్ధికి ఎల్లప్పుడు ఉంటుందని మంత్రి వెల్లడించారు.

    ముఖ్యంగా విద్యతోనే మార్పు వ స్తుందని ప్రతి ఒక్కరు చదువుకు నే లా చూడాలని, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు పారిశుధ్యంపై దృష్టి సా రించాలని, అలాగే బడ్జెట్ సమావే శాలు నిర్వహించి మున్సిపాలిటీ లను సవ్యంగా నిర్వహిం చేలా చర్యలు తీసుకోవాలని ,వేసవి దృష్ట్యా తాగునీటి సమ స్యలేకుండా ప్రణాళిక రూపొందించాలని, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా నిర్వహించే కార్యక్రమాలపై దృష్టి సా రించాలని అన్నారు.

    రాజకీయాలకతీతంగా ప్రజాప్రతి నిధులు, అధికారులంద రూ కలిసి పనిచేసి అభివృద్ధి, సంక్షేమాన్ని సా ధించాలని కలిసికట్టుగా పనిచేస్తే ఇ ది సాధ్యమవుతుందని తెలిపారు. వన్నుల వసూలు పై కూడా దృష్టి పెట్టాలన్నారు. అభివృద్ధి తో పాటు, రోడ్డు భద్రత ,యువత మత్తుపదా ర్థాల బారిన పడకుండా ఉండడం, తదితర సామాజిక అంశాలపై కూ డా దృష్టి సాధించాలని తెలిపారు. 10400 కోట్ల రూపాయలతో చేప ట్టనున్న హైదరాబాద్- విజయవా డ జాతీయరహదారి విస్తరణ పను లకు టెండర్లు పిలవడం జరిగిందని ,320 కోట్ల రూపాయలతో నల్గొండ నుండి ధర్వేశిపురం వరకు రహదా రి విస్తరణకు టెండర్లు పిలిచామని, మాల్- హైదరాబాద్ లై న్ విస్తరణ పనులు కూడా చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడిం చారు.


    నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్ర శేఖర్ మాట్లాడుతూ ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళిక అమలులో భాగంగా క్షే త్ర స్థాయిలో కార్యక్రమాలను ఆచ రణలో పెట్టాల్సిన అవసరం ఉం ద ని, ప్రజలకు మంచి సేవ లు అందిం చేందుకు నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌ న్సిలర్లు దృష్టి సారించాలన్నారు. జిల్లాను అభివృద్ధి ప థం లో తీసుకువెళ్ళేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, క్షేత్ర స్థాయికి వెళ్ళినప్పుడు ప్రజల సమస్యలు తెలుస్తాయని, మున్సిపల్ చైర్మ న్లు,కౌన్సిలర్లు, సమస్యలను తెలు సుకొని పరిష్కారానికి కృషి చేయా లని, అధికారులు, ప్రజాప్రతినిధు లు సమన్వయంతో మమేకమై ప్ర జలకు సౌకర్యాలు, సేవ లు కల్పిం చాల్సిన అవసరం ఉందన్నారు.

    మున్సిపల్ సమస్యలను తన దృ ష్టికి తీసుకురావాలని, తాను కూడా జిల్లాలో పర్యటించినప్పుడు సమస్యల పరి ష్కారానికి కృషి చేస్తానని ,అదేవిధంగా ప్రజావాణిలో సమ స్యల కోసం ప్రజలు సమ ర్పించే సమస్యలపై కూడా దృష్టి సారిస్తాన్నారు. ఉగాదికి సామూహి క ఇందిరమ్మ గృహ ప్రవే శాల కార్య క్రమానికి చర్యలు తీసుకోవాలని, వెంటనే మున్సి పల్ బడ్జెట్ స మా వేశాలను ఏర్పాటు చేసి బడ్జెట్ అంచ నా లపై చర్చించాలని, 99 రో జుల కార్యాచరణ ప్రణాళికను షె డ్యూల్ ప్రకారం ముందుకు తీసు కె ళ్లాలని విజ్ఞప్తి చేశారు.

    నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీ నివాస్ రెడ్డి మాట్లాడుతూ నూత నంగా ఎన్నికైన మున్సిపల్ కార్పొ రేటర్లకు, కౌన్సిల ర్లకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించడం సంతోషమని, నూతన ప్రజాప్రతినిధులు ప్రజల్లో ప్రభుత్వ పథకాల పట్ల అ వగాహన తీసుకుని వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. నల్గొండను స్మార్ట్ సిటీ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఎ మ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికై న మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజల కో సం పని చేయాలని, ప్రజా క్షేత్రంలో ఉండాలని పిలుపునిచ్చారు. నకిరేకల్ శాసనస భ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పథకాలను తెలుసు కొని అవగాహన పొందినప్పు డే క్షేత్రస్థాయిలో ప్రజలకు మంచి చేయ గలుగుతారని, ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరా రు.

    ఈ సందర్భంగా ఆయా శాఖల అ ధికారులు వారి శాఖల ద్వారా అమలు చేసే పలు ప్రభుత్వ పథకాల పై పవర్ పా యింట్ ప్రజెంటేషన్ ద్వారా, వీడియోల ద్వారా మున్సి పల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు అవగాహన కల్పించారు. పలువు రు కౌ న్సిలర్లు, కార్పొరేటర్లు మాట్లాడుతూ నూతనంగా ఎ న్నికైన తమకు ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కా ర్య క్రమం సందర్భంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికతో పాటు, ప్ర భుత్వ పథకాలపై అవగాహన క ల్పించడం సంతోషంగా ఉం దని,ఇది తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని అ న్నారు. మిర్యాల గూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్ జే, శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అద న పుకలెక్టర్,, నల్గొండ ఆర్ డి వై. అశోక్ రెడ్డి, మిర్యాలగూడ సబ్ కలె క్టర్ నారాయణ అమిత్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూడి, రమేష్, చండూరు ఆర్డీవో శ్రీదేవి, జిల్లా అ ధికారు లు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు ఈ శిక్షణ కార్యక్ర మానికి హాజరయ్యారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.