Sunday, September 27, 2026
More
    HomeIndiaUnion government key decision : బిగ్ బ్రేకింగ్, లీకేజీ ముఠాల గుండెల్లో గుబులు, పేపర్...

    Union government key decision : బిగ్ బ్రేకింగ్, లీకేజీ ముఠాల గుండెల్లో గుబులు, పేపర్ లీక్ కేసులకు “ఫాస్ట్ ట్రాక్” న్యాయం

    📰 Generate e-Paper Clip

     

    Union government key decision :  ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే ఇక జైలు తలుపులు త్వరగానే తెరుచుకుంటాయి. దేశంలో వరుస పేపర్ లీకేజీలతో అగ్గిమీద గుగ్గిలమవుతున్న నిరు ద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే సంచ లన నిర్ణ యం తీసుకుంది. ఇకపై పేపర్ లీ కేజీ కేసుల విచా రణకు ప్రత్యేకం గా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు’ ఏర్పాటు చేయను న్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ‘X’ (ట్విట్టర్) వేదికగా వే డివేడి గా ప్రకటించారు.ఈ నిర్ణ యంతో క్రిమినల్ ముఠాలకు కాలం చెల్లినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

    లీకేజీ రాయుళ్లకు వేగవంతమైన శిక్ష

    నిరుద్యోగుల కష్టాన్ని, వారి ఏళ్ల తరబడి శ్రమను సొమ్ము చేసు కుంటున్న ముఠాలపై ఉక్కుపా దం మోపడమే లక్ష్యం గా కేంద్రం ఈ అడుగు వేసింది. సంబంధిత శాఖలు, అధికా రులు ఆలస్యం చేయకుండా వెంటనే కార్యాచరణ ప్రారం భించాలని ప్రధాని ఆదేశించారు.

        భయం పుట్టించడమే లక్ష్యం

    కేసులను ఏళ్ల తరబడి సాగదీయకుండా, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరితగతిన విచారించి కఠిన శిక్షలు ఖరారు చేస్తా రు. ఈ వేగవంతమైన న్యాయం ద్వారా క్రిమినల్ ముఠాల్లో భయం పు ట్టించి, భవిష్యత్తులో ఇలాంటి దారుణాలకు ఎవ రూ తెగబడ కుండా అడ్డుకట్ట వేయవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

       ప్రధాని మోడీ ఏమన్నారంటే..?

    దేశ యువత ప్రయోజనాలు, వా రి ప్రకాశవంతమైన భవి ష్యత్తు కంటే మాకు ఏదీ ఎక్కువ కాదు. విద్యార్థుల జీవితా లతో ఆడుకునే లీకేజీ రాయుళ్లు ఎంతటి వారైనా సరే… వది లేదే లేదు చట్ట ప్ర కారం వారికి కఠినమైన శిక్ష పడేలా చూస్తా మని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు పోటీ పరీ క్షల తయారీలో ఉన్న అభ్యర్థుల హక్కులు, ప్రయోజ నాల ను రక్షించే దిశగా ఈ నిర్ణ యం ఒకకీలకమైన రక్షణ కవ చం లా మారనుంది. పేపర్ లీక్‌ల వల్ల తీవ్ర మనోవేదనకు గుర వుతున్న లక్షలాది మంది విద్యార్థుల్లో ఈ నిర్ణయం కొత్త ఆశ లను చిగురింపజేస్తోంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.