Sunday, September 27, 2026
More
    HomeIndiaUnion, State governments frauds : బీసీల సంక్షేమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూదొందే 

    Union, State governments frauds : బీసీల సంక్షేమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూదొందే 

    📰 Generate e-Paper Clip

    Union, State governments frauds : ప్రజా దీవెన, నల్ల గొండ టౌన్:బీసీల సంక్షేమం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేంద ర్ గౌడ్ విమర్శించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని యాదవ సంఘం భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తెలంగాణ బీసీ సం క్షేమ సంఘం నల్గొండ జిల్లా అ ధ్య క్షులు చిలకరాజు సతీష్ కుమార్ తో కలిసి మాట్లాడారు.

    రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు రాజకీయ, విద్యా, ఆర్థిక రంగాల్లో తగిన ప్రాధాన్యత కల్పించడంలో ప్ర భుత్వాలు విఫల మయ్యాయని అన్నారు. బీసీల అ భ్యున్న తికి ప్రత్యేక కార్యాచరణ చే పట్టి, వారి హక్కులను పరిరక్షిం చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా ర్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యపై మాట్లాడుతూ ప్ర భుత్వం బకాయిల ను సకాలంలో విడుదల చేయక పోవ డంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

    ఫీజులు చెల్లించలేక అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్య కు దూరమవుతున్న పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. అర్హు లైన ప్రతి విద్యా ర్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కా లర్‌షిప్‌ లు పూర్తిస్థాయిలో అందే లా ప్రభుత్వం తక్షణ చర్యలు తీ సుకోవాలని ఆయన కోరారు. బీ సీల అభివృద్ధి కోసం ప్రత్యే క నిధులు కేటాయించి, సంక్షేమ పథకాలను సమర్థవంతం గా అమలు చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వాలు బీసీ ల సమస్యల పరి ష్కారంపై నిర్లక్ష్య వైఖరి మరియు జీవో నెంబర్ 7ను రద్దు చేసే అంత వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్య మాలను ఉధృతం చేస్తామని మేకపోతుల నరేందర్ గౌడ్ హె చ్చరించారు.

    ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సరికొండ రామ కృష్ణం రాజు, రాష్ట్ర అధికార ప్రతినిది నీలం వెంకటమధు, రాష్ట్ర లీగల్ అడ్వైజర్ చొల్లేటి రమేష్, రాష్ట్ర ఉపా ధ్యక్షులు కొత్త లింగస్వామి యాద వ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు సత్యనారాయణ గౌడ్, జిల్లా ఉపా ధ్యక్షులు వెంపటి నరసిం హ జిల్లా నాయకులు దొండ సాంబయ్య, ఊ ళ్లేoదుల అంజ య్య, డబ్బికార్ రాజా, కృష్ణ యాదవ్, కాస్ఫరాజ్ జానీ, మ ధు, గడ్డం మారయ్య, రేక్య నాయక్, కొత్తకొండ రమేష్ తదిత రులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.