Sunday, September 27, 2026
More
    HomeTelanganaKarimnagar ACB surprise rides : అవినీతికి చెక్.. సర్వేయర్లపై ఏసీబీ ఉక్కుపాదం

    Karimnagar ACB surprise rides : అవినీతికి చెక్.. సర్వేయర్లపై ఏసీబీ ఉక్కుపాదం

    📰 Generate e-Paper Clip

    Karimnagar ACB surprise rides : కరీంనగర్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిర్వహించిన ఆకస్మిక దాడి లో ముగ్గురు సర్వేయర్లు లంచం తీసుకుంటూ పట్టుబడ్డా రు. భూమి కొలతలు నిర్వహించి నివేదిక అందించేందుకు డబ్బులు డిమాండ్ చేసిన మండల సర్వేయర్‌తో పాటు ఇ ద్దరు ప్రైవేట్ సర్వేయర్లను అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు.

    సైదాపూర్ మండలం అమ్మన్‌గుర్తి గ్రామానికి చెందిన ఓ రై తు తన భూమికి సంబంధించిన సర్వే చేయించాలని అధి కారులను సంప్రదించాడు. అయితే సర్వే ప్రక్రియ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలంటే లంచం ఇవ్వాలని కోరినట్లు బాధితుడు ఆరోపించాడు. ఈ వ్యవహారంపై అతడు ఏసీబీ అధికారుల ను ఆశ్రయించడంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

    Also Read:Telangana Hikes Land Values: భూముల మార్కెట్ విలువలకు భారీ పెంపు

    దర్యాప్తులో భాగంగా మండల సర్వేయర్ ఏ. కుమారస్వా మి, ప్రైవేట్ సర్వేయర్లు తీగల రాజేష్, వంగ వినీత్ రెడ్డి బా ధితుడి నుంచి విడతలవారీగా డబ్బులు తీసుకున్నట్లు అధి కారులు గుర్తించారు. ఇప్పటికే రెండు విడతల్లో లంచం స్వీ కరించిన వారు, మూడో విడతగా రూ.25 వేల రూపాయలు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.

    ఈ ఘటన అనంతరం ముగ్గురిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం వారిని కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపా రు.ప్రభుత్వ సేవలకు సంబంధించి ఎవరైనా లంచం డిమాం డ్ చేస్తే వెంటనే ఏసీబీని సంప్రదించాలని అధికారులు ప్రజల కు సూచించారు. ఇలాంటి అవినీతి చర్యలపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.