–ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇంక నూ ప్రారంభంకాని కాంటాలు
–వర్షాలతో ఒరిగిన పత్తి, వరిపంట లకు పరిహారం కోరుతున్న రైతులు
Tungaturthy Heavy Rains : ప్రజా దీవెన, తుంగతుర్తి: ఒకపక్క భారీ వర్షాలు మరోపక్క ధాన్యం కొ నుగోలు సెంటర్లలో పేరుకుపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేసే దిక్కులేక యావత్ రైతాంగం తీవ్రఆందోళనలో మునిగి తేలుతున్నారు. గత నెల రోజులుగా వరి కోతలు ప్రారంభించి న రైతన్న కోసిన వరి ధాన్యాన్ని ధా న్యం కొనుగోలు కేంద్రాల్లో పోశారు. అదే సమయంలో కోయకుండా పొ లాల్లోనే మిగిలిన వరిచేలు భారీ వ ర్షాలకు అడ్డంపడి తీవ్ర నష్టం వాటి ల్లుతోంది.
జిల్లాలో అంతటా ధాన్యం కొనుగో లు కేంద్రాలు ప్రారంభించిన ప్రభు త్వం తుంగతుర్తి మండలంలో ఇప్ప టివరకు ధాన్యం కొనుగోలు ప్రారం భించకపోవడం రైతులను ఆందోళ న గురిచేసే అంశoగా వ్యక్తమవు తోంది. తాము ధాన్యం పోసి సు మా రు పక్షం రోజులు దాటుతోందని ఇ ప్పటివరకు ధాన్యం కాంటాలు ప్రా రంభం కాలేదని రైతులు అంటున్నా రు.
వరి ధాన్యం తేమ శాతం కోసం ఆర బోయడం సాయంత్రానికల్లా భారీ వ ర్షాలు రావడంతో ఆరబోసిన ధా న్యాన్ని కుప్పలుగా చేయడం భారం గా మారిందని రైతులు అంటున్నా రు. ఏక్షణాన భారీ వర్షం వస్తుందో ఎ ప్పుడు ఎండ వస్తుందో తెలియని ప రిస్థితి నెలకొన్నాయని ఇలాంటి పరి స్థితులు ఉన్న దృష్ట్యా అధికారులు తక్షణమే కాంటాలు ప్రారంభించాల ని రైతుల కోరుతున్నారు.
ఖరీఫ్ ఆరంభ కాలంలో వర్షాలు లేక ఇబ్బందులు పడ్డ రైతాంగానికి పం ట చేతికి వచ్చే సమయానికి వర్షా లు శాపంగా మారాయని రైతులు అంటున్నారు .ఇప్పటికే పత్తి చేను వర్షార్పణం కాగా వరి చేలు కూడా భారీ వర్షాలకు నేల వాలాయి. అ డ్డంపడిన వరిచేలపై నుండి నీటి ప్ర వాహం వెళ్లడంతో వరిచేలన్నీ నీట తడిసిన ముద్దయ్యాయి. దాదాపు నెల రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో అన్నదా తలకు ఏం చేయాలో అర్థం కాని ప రిస్థితులు నెలకొన్నాయి.
కనీసం తడిసిన ధాన్యాన్ని ఆరబెట్ట డానికి కూడా వర్షాలు కురుస్తున్నా యి. ప్రభుత్వం తక్షణమే వర్షాల వ ల్ల నష్టపోయిన పత్తి చేలకు వరిచేల కు నష్టపరిహారం అందించే దిశగా స్పందించాలని యావత్ రైతాంగం కోరుతోంది. గతంలో ప్రకృతి బీభ త్సం ఏర్పడినప్పుడు అప్పటికి అ ప్పుడే పంట నష్టం అంచనా వేసి క నీసం రైతులకు ఎంతో కొంత ఆర్థిక సహాయం అందించే వారిని ప్రస్తు తం మాత్రం ఇప్పటివరకు పంట న ష్టం అంచనాగు అధికారులు ప్రయ త్నించకపోవడం విచారకరమని రైతులు అంటున్నారు.
ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు సెం టర్లలో ధాన్యం తూకాలు ప్రారంభిం చాలని వర్షం వల్ల నష్టపోయిన రై తాంగానికి నష్టపరిహారం అందించే దిశగా అధికారులు ముందుకు రా వాలని రైతుల కోరుతున్నారు.

