Bhainsa Road Accident : ప్రజా దీవెన, నిర్మల్: నిర్మల్ జిల్లా లో తెల్లజామున జరిగిన ఘోర రో డ్డుప్రమాదంలో నలుగురి నిండు జీ వితాలు తేలిపోయాయి. ఈ హృద య విదారక సంఘటన నిర్మల్ జి ల్లా భైంసా పట్టణంలో చోటు చేసు కుంది.
అందిన సమాచారం మేరకు వివ రా లు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో మంగళవారం తె ల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. భైంసా బస్ డిపో సమీపంలో కారు, కంటైనర్ లారీ ఢీ కొన్న ఈ దుర్ఘటనలో కారులో ప్ర యాణిస్తున్న నలుగురు వ్యక్తులు అ క్కడికక్కడే మృతి చెందగా ఇద్దరి ప రిస్థితి విషమంగా ఉందని తెలుస్తోం ది.
ప్రమాదంలో మృత్యువాత పడ్డ వా రంతా నిర్మల్ జిల్లా కుబేర్ మండ లం కుప్టి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్ని బాబన్న, భోజరాం పటేల్, రాజన్న, వికాస్‌గా గుర్తించగా ఈ నలుగురు హైదరాబా ద్ నుంచి తిరిగి స్వగ్రామానికి వె ళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలు స్తోంది.
ఇదిలా ఉండగా ప్రధానంగా కారు అ దుపుతప్పి కంటైనర్‌ను ఢీకొన డం తో ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనతో రోడ్డుపై రాకపోకలకు ఆటంకం కలిగింది. పో లీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమి త్తం తరలించారు. గాయపడిన వా రిని సమీప ఆసుపత్రికి తరలించి చి కిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
