Tuesday, September 29, 2026
More
    HomeOpinionUppal Murder Case : బిగ్ బ్రేకింగ్, ఆరుగంటల్లోనే వీడిన మర్డర్ మిస్టరీ, హైదరాబాద్ ఉప్ప...

    Uppal Murder Case : బిగ్ బ్రేకింగ్, ఆరుగంటల్లోనే వీడిన మర్డర్ మిస్టరీ, హైదరాబాద్ ఉప్ప ల్‌లో రాత్రికిరాత్రే హత్యకేసు చేధన 

    📰 Generate e-Paper Clip

    Uppal Murder Case : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ ఉప్పల్ లో ఆదివారం రాత్రి ఒక్కసారిగా కుదిపేసిన హత్య కేసు ను తెల్లవారు అయ్యేసరికి కథ పూర్తిగా ముగిసి పోయింది. నేరం చేసి న వాళ్లు తప్పించుకుంటారని అం తా అనుకున్నారు. కానీ పోలీసుల మెరుపు వేగం ముందు వారి ప్లాన్ మొత్తం కూలిపోయింది. కేవలం 6 గంటల్లోనే హంతకు లకు బేడీలు వే యడం నగరంలో చర్చనీయాంశ మైంది.

       ఫోన్ ఎత్తలేదన్న చిన్నగొడవ, చివరికి రక్తపాతం

    బానోతు సంతోష్, పొడిశెట్టి తరుణ్, సుధీర్ కుమార్ ముగ్గు రూ ఒక ప్పుడు గట్టి స్నేహితులు, మూడు రోజుల క్రితం సు ధీర్ తన బావ ఇం టి గృహప్రవేశానికి వీరిని ఆహ్వానిం చా డు. కానీ ఆ రోజు సంతోష్ చేసిన ఫోన్ కాల్స్‌కు సుధీర్ స్పం దించలేదు. పిలిచి ఫోన్ కూడా ఎత్తవా అన్న కోపం సంతోష్‌ లో మెల్లగా అ గ్నిలా మండింది. వాట్సాప్‌లో తిట్టుకోవడం మొదలై, ఆ కోపం ఆది వారం రాత్రి ప్రమాదకర మలుపు తీ సుకుంది. రాత్రి 7:30 గంటలకు చిలకానగర్ గ్రౌండ్‌కు “మా ట్లాడు కుందాం” అంటూ సుధీర్‌ను పిలిచారు.

    అక్కడ మాట మాట పెరిగింది కోపం నియంత్రణ కోల్పో యింది. ముందే ప్లాన్ చేసుకున్న సంతోష్ ఒక్కసారిగా కత్తి బయటకు తీశా డు. ప్రాణభయంతో సుధీర్ రోడ్డుపైకి పరు గెత్తాడు. కానీ హంతకులు వదల్లేదు వెంటాడారు, చివరకు క త్తులతో దారుణంగా పొడిచిచంపేశారు.

    రాత్రి ఫిర్యాదు,తెల్లవారేసరికి అరెస్టులు

    రాత్రి 10:30కి పోలీసులకు సమా చారం చేరింది. అక్కడి నుంచి పోలీసుల యాక్షన్ సినిమా స్పీడ్‌లో సాగింది. ఫోన్ సిగ్నల్స్ ట్రాక్, సీసీ టీవీ ఫుటేజీల విశ్లేషణ, ప్రత్యేక బృందాల గాలింపు ఈ టెక్నికల్ ఆ పరేషన్‌తో నిందితులు దాక్కున్న ప్రదేశాన్ని పోలీసులు గుర్తించారు.ఉదయం 4 గంటలకే నిo దితులు తలదాచుకున్న చోటును పోలీసులు చుట్టుముట్టా రు.

    తెల్లవారుజామున 4 గంటలకల్లా పోలీసులు నిందితులను చుట్టు ముట్టి అదుపులోకి తీసుకున్నారు.హత్యకు వాడిన కత్తి తో పాటు, పారిపోవడానికి ఉపయోగించిన యాక్టివా బై క్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల ఈ వేగ వం తమైన ఆపరేషన్‌పై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

    సాధారణంగా హత్య కేసుల్లో నిం దితులు పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈసారి 6 గంటల్లోనే కేసు ఛేదించడం పోలీసుల సమర్థ తను మరోసారి నిరూపించింది.చిన్న గొడ వ, పెద్ద కోపo, చివరికి ఒక ప్రాణం పోయింది కానీ నేరం చేసి న వాళ్లు తప్పించుకోలేరని ఈ ఘటన మరోసారి గుర్తుచేసిం ది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.