–మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సి రెడ్డి
Ex MLC Alugubelli Narsi Reddy : ప్రజా దీవెన, తిప్పర్తి: ప్రభుత్వ ఉపా ధ్యాయులకు టీచర్ ట్రైనింగ్ టెస్ట్ నుంచి మినహాయింపు అవకాశం క ల్పించాలని మాజీ ఉపాధ్యాయ శా సన మండలి సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. తిప్పర్తి మండల కేంద్రంలో ఆదివారం జరిగి న తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యా య ఫెడరేషన్ నల్లగొండ జిల్లా కమి టీ విస్తృత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లా డారు.
కేంద్ర ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పు నరుద్ధరించాలని, కార్మికుల హక్కు లను కాలరాస్తూ ఇటీవల కార్మికుల కు చట్టం చేసిన నాలుగు లేబర్ కో డ్లను రద్దు చేయాలని, జాతీయ వి ద్యా విధానం 2020 అమలు ద్వా రా విద్యా రంగానికి తీవ్ర నష్టం కలు గుతుందని మతపరమైన విభజన విద్యార్థులలో కలిగించే అంశాలు అందులో ఉన్నాయని, దేశంలో మొ త్తం పేరిట మూటత్వం పెరిగిపోతు న్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మతపరమైన మాలలు వేస్తూ బడి కి పంపించటం సరికాదని ప్రైవేట్ పాఠశాలల్లో ఇటువంటి పద్ధతులు అమలు కావటం లేదని దీని ద్వారా ఉపాధ్యాయులు సక్రమంగా పనిచే యలేక విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టలేకపోతున్నారని, అందరికీ ఒకే విద్య అందాలని సమానమైన నా ణ్యమైన ఉచిత విద్య అందినప్పు డే సమాజాభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం విద్యకు బడ్జెట్లో నిధులు పెంచకుండా ఇది ఎలా సాధ్యమై తుందని, ప్రీ ప్రైమరీ పాఠశాలలు లేకుండా బడిని నడపలేమని తర గతికో గది తరగతికో టీచర్ ఉన్న ప్పుడే అది సాధ్యమవుతుందని చెప్పారు.
ప్రతినెల 700 కోట్లు కేటాయిస్తామ ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి రెం డు నెలలు మాత్రమే కేటాయించిం దని పెన్షనర్లకు రావలసిన బకా యి లను చెల్లించడంలో ప్రభుత్వం పూ ర్తిగా విఫలమైందని పిఆర్సి నివేదిక తెప్పించుకొని కొత్త స్కేలు ఇవ్వాల ని ఎన్నికల్లో ఉన్న ఐదు డిఏలు చె ల్లించడంలో ప్రభుత్వానికి ఏ మా త్రం చిత్తశుద్ధి కనిపించడం లేదని, కేంద్రం కార్పొరేట్ అనుకూల విధా నాన్ని నియంతృత్వ పోకడలను అ నుసరించటం వలన జిడిపి 7.8 నుండి 6.4 పడిపోయిందని ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి నిరుద్యోగ రేటు 9.2%గా ఉన్నదన్నారు.
టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి మాట్లాడుతూ అభ్యుద య భావజాలంతో జాతీయ భావా లతో రాజ్యాంగాన్ని పరిరక్షించుకో వాలని, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ విధా నాన్ని రద్దు చేయాలని విద్యకు 60 శాతం గ్రాంటును కేంద్రమే ఇవ్వాల ని పాతికేళ్ల సర్వీస్ పూర్తి చేసిన ఉ పాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హ త పరీక్ష ( టెట్ ) అవసరమని చెప్ప డం సరికాదని దీనివల్ల 40 లక్షల మంది ఉపాధ్యాయులు ఉద్యోగా లను కోల్పోతారని దీనిపై దేశంలోని కొన్ని రాష్ట్రాలు రివ్యూ పిటిషన్ సు ప్రీంకోర్టులో వేశాయని గుర్తు చేశా రు.
పార్లమెoటు లో దీనిపై సవరణ చే యాలని జాతీయస్థాయిలో ఎస్ టి ఎఫ్ఐ టిఎస్ యుటిఎఫ్ పోరాటా లు చేస్తుందని ప్రభుత్వ పాఠశా ల ల్లో ఎన్రోల్మెంట్ తగ్గటానికి ప్రభుత్వ నిర్ణయాలే కారణమని, ప్రైవేట్ కా ర్పొరేట్ స్కూల్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అందరి బడిగా మా ర్చాలని అది కొందరు బడి కా కూడ దని, ప్రభుత్వ పాఠశాలలలో ఎన్రో ల్మెంట్ తగ్గటానికి ఉపాధ్యాయులే కారణమని చెప్పటం సరికాదని పెం డింగ్ లో ఉన్న ఐదు డీఏలను వెం టనే మంజూరు చేయాలని 2024 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగు ల కు పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే చెల్లిం చాలని, కేంద్రం రాష్ట్రాలను అణచి వేసే ధోరణి మానుకోవాలని విద్య కేంద్రం నుండి అధిక నిధులు మం జూరు చేయాలని ఈ విద్యా సం వ త్సరంలో గతం కంటే ఎక్కువ మం ది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల ల్లో చేరారని తెలంగాణ ప్రభుత్వం పూర్వ ప్రాథమిక విద్య నుండి యూ నివర్సిటీ విద్య వరకు సమీక్షించి స మూలంగా మార్పులు తెచ్చేందుకు ప్రయత్నించాలన్నారు.
అంతకు ముందు ఈ సందర్భం గా జాతీయ పతాకాన్ని సీనియర్ నా యకులు బడుగు అరుణ యస్.టి. యఫ్.ఐ పతాకాన్ని సీనియర్ నా యకులు దేవిరెడ్డి లింగారెడ్డి, టియ స్ యుటియఫ్ పతాకాన్ని సీని య ర్ నాయకులు చొల్లేటి యోగేంద్ర నా థ్ ఆవిష్కరించిన అనంతరం అ మ రవీరులకు పుష్పాంజలి ఘటించి ని వాళులర్పించారు.
నల్లగొండ జిల్లా టిఎస్ యుటిఎఫ్ అధ్యక్షులు బక్కా శ్రీనివాసాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యదర్శులు చిలుక రా జు రాములు, ముదిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, శ్రీమతి జి. నాగమణి , జిల్లా ప్ర ధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటే శం, ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర కోశా ధి కారి ఎడ్ల సైదులు,రాష్ట్ర సాంస్కృ తిక కన్వీనర్ నల్ల నరసింహ, జిల్లా ఉపాధ్యక్షులు నర్రా శేఖర్ రెడ్డి, జిల్లా కోశాధికారి వడ్త్య రాజు, సీనియర్ నాయకులు పిన్నం వీరాచారి, జెవి వి రాష్ట్ర ఉపాధ్యక్షులు నన్నూరి వెంకటరమణారెడ్డి, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఎన్ సోమయ్య, తెలంగాణ పౌర స్పందన వేదిక జి ల్లా అధ్యక్షుడు పాల్వాయి అంజిరె డ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పందిరి శ్యాంసుందర్, తెలంగాణ సాహితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కుకుడాల గోవర్ధన్, జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్ర ధాన కార్యదర్శి కే రాఫెల్, టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్షులు నల పరాజు వెంకన్న , యాట మధుసూ దన్ రెడ్డి, ఎం మురళయ్య, గేర నర సింహ, మార్తాల శ్రీనివాసరెడ్డి, రా చ మల్ల రమాదేవి, కాశిరెడ్డి కృష్ణారెడ్డి, పగిల్ల సైదులు, జాల అరుణ, కొమ ర్రాజు సైదులు, గంటెలవెంకటయ్య, గుండా వేదశ్రీ, పగిడిపాటి నరసింహ ఎర్ర నాగుల సైదులు, చిన్న వెంకన్న, భాను ప్రకాష్, చింతలమళ్ళ వరల క్ష్మి , గిరి యాదయ్య, సురేందర్ రె డ్డి, రాకేష్ కుమార్ ,గోన శ్రీలత , వా యిస్ ఆఫ్ తెలంగాణ కన్వీనర్ దా సరి ప్రభాకర్, తిప్పర్తి మండలం అ ధ్యక్షులు ఎండి కైరుద్దీన్ ప్రధాన కా ర్యదర్శి ఆదిమల్ల శ్రీనివాస్, నాగ రా జు, పుణ్యావతి తదితరులు పాల్గొ న్నారు.

