SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, చిట్యాల: నల్లగొండ జి ల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్ర జలు సహకరించాలని జిల్లా యస్పి శరత్ చంద్ర పవార్ పిలుపునిచ్చా రు.పంచాయతీ ఎన్నికల దృష్ట్యా గ్రా మ ప్రజలు ప్రతి ఒక్కరు ఎన్నికల ని యమాలు, నిబంధనలు పాటించా లని కోరారు. రాబోయే గ్రామ పంచా యతీ ఎన్నికలు దృష్ట్యా, ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరగడానికి ప్రజలు సహకరించాల న్నారు.
చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్రంపల్లి,సుంకనేపల్లి,ఏపూరు గ్రామాల ప్రజలకు నిర్వహించిన అ వగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రాబోయే గ్రామ పం చాయతీ ఎన్నికలు ప్రశాంత వాతా వరణంలో ఓటు హక్కు వినియో గించుకోవాలని,ఎలాంటి గొడవలు, గ్రూప్ తగాదాలు, ర్యాలీలు, అల్లర్లు జరుగకుండా పోలీసులకు సహక రించాలన్నారు.
ఎన్నికల ప్రవర్తన నియమాలు అమ ల్లో ఉన్నందున ఎవరైనా ఓటర్లను బెదిరించడం, బలవంతం చేయ డం, ప్రలోభపెట్టడం వంటి చర్యల కు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
గ్రామల్లో డబ్బు,మద్యం బహు మ తులు పంపిణీ సరఫరా చేయకూ డ దని ప్రజలు కూడా ఎన్నికల సమ యంలో ఎలాంటి ప్రలోభాలకు తలో గ్గకుండా ప్రశాంతమైన వాతావర ణంలో ఓటు హక్కు వినియోగించు కోవడానికి పోలీస్ శాఖ పటిష్ట కా ర్యాచరణ ఏర్పాటు చేయడం జరి గిందని తెలిపారు.
ఎవరైనా ఎన్నికల నిబంధనలు ఉ ల్లంఘిస్తున్నా ప్రలోబాలకు గురి చే సిన డయల్ 100 లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ను తెలిపాలని అన్నా రు.ఈ కార్యక్రమంలో నార్కట్ పల్లి సిఐ నాగరాజు,చిట్యాల ఎస్ఐ మ ధుబాబు, గ్రామ ప్రజలు తదితరు లు పాల్గొన్నారు.

