–ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి చేసేలా ప్రణాళికలు
–వుమెన్ ఎంపవర్ మెంట్’ ఇంటి నుంచే మొదలవ్వాలి
-‘వీ-ఎనేబుల్ గ్రాడ్యుయేషన్ వేడు క’లో మంత్రి శ్రీధర్ బాబు
Minister Sridhar Babu : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గా ణ రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియో జక వర్గంలో మహిళల కోసం ప్రత్యే కంగా ఎంఎస్‌ఎంఈ పార్కును అభి వృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్ర కటించారు. మహిళా సాధికారతను మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నామన్నారు. 2047 నాటి కి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రి లియన్ డాలర్లకు చేర్చాలన్న లక్ష్య సాధనలో మహిళలను కీలక భాగ స్వామ్యం చేస్తామన్నారు. ‘వీ హబ్’ ఆధ్వర్యంలో ఆదివారం జూబ్లీహి ల్స్ లోని డా. బీఆర్ అంబేద్కర్ ఓపె న్ యూనివర్సిటీలో నిర్వహించిన ‘వీ – ఎనేబుల్ గ్రాడ్యుయేషన్ వేడు క’కు ఆయన ముఖ్య అతిథిగా హా జరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మహిళా సాధికారత పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చా లంటే మార్పు అనేది ఇంటి నుంచే మొదలు కావాలన్నారు. ఇప్పుడి ప్పుడే సమాజంలో ప్రగతిశీల మా ర్పు కనిపిస్తుందని, ఇది ఆహ్వానిం చదగ్గ పరిణామన్నారు. 2017-18 నుంచి 2023- 24 మధ్య కాలంలో మహిళాశ్రామిక శక్తి భాగస్వామ్యం 22 శాతం నుంచి 40.3 శాతానికి పెరగడమే ఇందుకు నిదర్శనమ న్నారు.
తెలంగాణలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 52.7 శాతం అ ని, ఇది జాతీయ సగటు 45.2 శా తం కంటే ఎక్కువగా నమోదు కావ డం రాష్ట్ర పురోగతిని ప్రతిబింబి స్తోందన్నారు.
మహిళలు కూడా పు రుషులకు ధీటుగా వ్యాపారాలు ప్రా రంభించి విజయవంతంగా నిర్వ హించగల రని ‘వీ హబ్’ నిరూపిం చిందన్నా రు. ఈ స్ఫూర్తితో ఔత్సాహిక మ హిళా పారిశ్రామికవేత్తలు ప్రారంభిం చే సార్టప్స్ ను అంతర్జాతీయ స్థా యిలో ఎంటర్ ప్రైజెస్ గా మార్చేలా ‘వీ హ బ్ 2.o’ కు ప్రణాళికలు రూ పొందిస్తున్నామన్నారు.
ఈ వేదిక ద్వారా ఒకేచోట స్కిల్స్, టెక్నాలజీ, ఫైనాన్స్, మార్కెట్, మెం టార్షిప్ అందుబాటులో ఉండేలా ‘ఎ కో సిస్టం’ ను అభివృద్ధి చే స్తామ న్నారు.
మహిళల ఆలోచన తీరులో నూ మార్పురావాలని, ఉద్యోగాల కోసం కాకుండా వాటిని సృష్టించే లా కొత్త గా ఆలోచించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ క్రీడాకారి ణి జ్వాల గుప్తా, ఫిలిం ప్రొడ్యూసర్ ప్రి యాంక దత్, వీహబ్ సీఈవో సీ తా పల్లచోల్ల తదితరులు పాల్గొన్నా రు.


