Inter-District Gang : ప్రజా దీవెన, దేవరకొండ: గత కొంత కాలంగా జిల్లాలో మేకలు, గొర్రెలు దొంగతనం జరుగుతున్న నేపద్యం లో నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చం ద్ర పవార్ ప్రత్యేక బృందాలు ఏర్పా టు చేసి ఇట్టి దొంగతనాలకు పాల్ప డుతున్న నేరస్తులపై నిశితమైన ని ఘా పెట్టాలన్న ఆదేశo మేరకు గు రువారం తెల్లవారుజామున ఖరీదై న కార్లలో గొర్రెలను మేకలను దొం గతనం చేస్తున్న అరెస్టు చేసినట్టు దేవరకొండ ఏ ఎస్ పి దేవరకొండ మౌనిక తెలిపారు. గురువారం ఆమె ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించా రు. ఉదయం 4 గంటల ప్రాంతంలో చింతపల్లి పోలీస్ చింతపల్లి X రోడ్ వద్ద వాహన తనిఖీ చేపడుతున్న సమయంలో AP 37BZ 5666 నెంబర్ గల ఒక స్కార్పియో కారు వారి నుండి తప్పించుకొని పోవడా నికి ప్రయత్నించగా వెంటనే చింత పల్లి పోలీస్ వారు అట్టి వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీ సులకు పట్టుబడిన వారిలో 3 మగ వారు, ఇద్దరు మహిళలు ఉన్నార న్నారు. వారిని మా వద్ద ఉన్న ఫిం గర్ ప్రింట్ స్కానర్ తో చెక్ చేయగా వారిపై గతంలో మేకల దొంగతనం కేసులు ఉన్నట్టు తేలిందన్నారు.
వారందరిని వెంటనే అదుపులోకి తీసుకొని విచారించగా అమ్మలూరి విజయ ప్రసాద్, దాసర్ల వినోద్ కు మార్, గుంజ కార్తీక్, సంపంగి శా రద, అమ్మలూరి నందిని, బేబీ వీరి పైన గతంలో నల్గొండ రూరల్ పి ఎ స్, కనగల్, చండూర్, విజయపురి, నార్కట్పల్లి, నల్గొండ 2 టౌన్, మ ర్రి గూడ, దేవరకొండ, శాలిగౌరారం, నాంపల్లి, మునుగోడు, చింతపల్లి పిఎస్ లలో మేకల దొంగతనాల నే రాలలో నిందితులు గా ఉన్నారని చెప్పార. వీరు గతంలో జైలుకు వె ళ్ళినా బైలు పై వచ్చిన ప్రవర్తన మా ర్చుకోకుండా తిరిగి నేరాలు చేయా లనీ నిర్ణయించుకొని, అనుకున్న ప్ర కారంగా వీరికీ పరిచయం ఉన్న వా రందరూ కలిసి గ్యాంగ్ లుగా ఏ ర్ప డి ఎవరికీ అనుమానం రాకుండా ఖ రీదైన కార్లలో వచ్చి పగటి పూట రె క్కి నిర్వహించి రాత్రి సమయాలలో ఖరీదైన కార్లలో వచ్చి మేకలను కా ర్లలో వేసుకొని మేకల దొంగతనాల కు పాల్పడుతుంటారు.
పట్టుబడిన నేరస్థులు చెప్పిన వివ రాల ప్రకారంగా చింతపల్లి, దేవర కొండ, గుడిపల్లి, కల్వకుర్తి పోలీస్ స్టేషన్ల పరిధిలో మేకల దొంగతనా ల కు పాల్పడినట్టు తెలిపారు. వీరు దొంగలించిన మేకలను సంతలలో గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసు కుంటారు. ఇట్టి నేరాలలో సంబం ధించి నిందితుల నుండి లక్ష ఇరవై వేల రూపాయల నగదు మరియు 36 లక్షలు విలువచేసే మూడు ఖరీ దైన కార్లను సీజ్ స్వాధీనం చేసు కు ని కేసు నమోదు చేయడం జరిగిం దన్నారు.
సదరు ముఠా సభ్యులను పట్టు కో వడంలో ప్రతిభ కనపరిచిన నాం పల్లి సిఐ రాజు, చింతపల్లి ఎస్సై రా మ్మూర్తి, చింతపల్లి సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సైదులు, కానిస్టేబుల్స్ చరణ్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, విజ య్ హోంగార్డులు శేఖర్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినం దిం చి దేవరకొండ ఏఎస్పీ రివార్డును అందజేశారు.

