Wednesday, September 30, 2026
More
    HomeOpinionNalgonda SP Sharath Chandra Pawar Surprise Inspection : చందంపేట పోలీస్ స్టేషన్ లో...

    Nalgonda SP Sharath Chandra Pawar Surprise Inspection : చందంపేట పోలీస్ స్టేషన్ లో న ల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మిక తనిఖీ 

    📰 Generate e-Paper Clip

    Nalgonda SP Sharath Chandra Pawar Surprise Inspection : ప్రజా దీవె న, చందంపేట: నల్లగొండ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్ష ణను మరో స్థాయికి తీసుకెళ్లే దిశగా వార్షిక తనిఖీలు వేగ వంతమయ్యాయి. బుధవారం దేవర కొండ సబ్ డివిజన్ ప రిధిలోని చందంపేట పోలీస్ స్టేషన్‌ను జి ల్లా ఎస్పీ శరత్ చం ద్ర పవార్ సర్ప్రైజ్ తనిఖీ చేశారు. సాంకేతిక పరిజ్ఞానం, హై టెక్ పోలీసింగ్ స మ్మిళితంగా సాగి న ఈ తనిఖీల్లో స్టేషన్ పనితీరుపై ఎస్పీ సంతృప్తి వ్యక్తం చే స్తూ, భవిష్యత్ కార్యా చర ణపై కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.

    పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఎస్పీకి అధికారులు ఘన స్వాగ తం పలికారు. అనంతరం ఆయన స్టే షన్‌లోని ప్రతి విభాగా న్ని లోతుగా పరిశీలించారు.డిజిటల్ రికార్డులు, ఆన్‌లైన్ కే సు నమోదు విధానం, సీసీటీఎన్‌ఎస్ (CCTNS) అప్‌డేట్స్‌ ను నేరుగా పరిశీ లించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్లు, పోలీ స్ కిట్ల వినియోగం మరియు ఆయుధాల భద్రతా స్థితిగ తు లను తనిఖీ చేశారు.

    పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షించి, దర్యాప్తులో ఆధునిక ఫోరెన్సిక్, డేటా అనలిటిక్స్ పద్ధ తులను ఉపయోగించాల ని సూచించారు. ఎస్పీ సమీక్షా ము ఖ్యాంశాలు తనిఖీ అనం తరం నిర్వహించిన సమీక్షా సమావేశం లో ఎస్పీ శరత్ చం ద్ర పవార్ మాట్లాడుతూ ప్రజలకు ఫ్రెండ్లీ, ట్రా న్స్పరెంట్ మరి యు హై-రెస్పాన్స్ పోలీసింగ్ అందించడమే మా ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు.

    ప్రతి ఫిర్యాదుకూ వేగవంతమైన, చట్టబద్ధమైన పరిష్కారం లభిం చాలి. బాధితుడు స్టేషన్ నుంచి పూర్తి నమ్మకంతో బయటకు వెళ్లే లా మన పనితీరు ఉండాలని ఎస్పీ ఆదేశిం చారు.గ్రామాలు, కూ డళ్లు, వ్యాపార ప్రాంతాల్లో మూడవ కన్ను (CC TV నెట్‌వర్క్) ను మరింత విస్తరించాలని, VP O వ్యవస్థ ప్రజలకు ఇంకా చేరువ కావాలి. కమ్యూనిటీ పోలీ సింగ్ ద్వారా ప్రజల్లో భద్రతాభావం పెంపొందించాలని సూ చించారు.నైట్ పెట్రోలింగ్ పెంచాలి రౌడీ షీ టర్లు, అనుమానితుల కదలికల పై రియల్ టైమ్ నిఘా ఉంచాలి.

    గంజాయి మరియు మత్తు పదా ర్థాల విక్రయాలు, రవాణాపై ఉ క్కుపాదం మోపాలని కఠిన హె చ్చరికలు జారీ చేశారు. సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం, మహిళలు మరియు చిన్నారులకు రక్షణ కల్పించడం లో ఏమాత్రం ని ర్లక్ష్యం వహించ కూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉన్నతాధి కారులు ఈ ఉన్నత స్థాయి తనిఖీ కార్య క్రమంలో ఎస్పీతో పాటుదేవరకొండ డీఎస్పీ శ్రీనివాస్ రా వు, ఎస్‌బీ సీఐ నాగరాజు, డీసీ ఆర్‌బీ సీఐ శ్రీను నాయక్,డిండి సీఐ బిసన్న, చందంపేట ఎస్‌ఐలోకేష్, ఇతర పోలీస్ అధికా రులు, స్టేషన్ సిబ్బంది పాల్గొని పీఎస్ పురోగతి నివేదికలను అందించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.