Tuesday, September 29, 2026
More
    HomeIndiaHydro Project Tunnel Tragedy : బిగ్ బ్రేకింగ్, నిశ్శబ్దాన్ని చీల్చిన ఆక్రందనలు, నమాచి హైడ్రో...

    Hydro Project Tunnel Tragedy : బిగ్ బ్రేకింగ్, నిశ్శబ్దాన్ని చీల్చిన ఆక్రందనలు, నమాచి హైడ్రో ప్రా జెక్ట్‌ టన్నెల్‌లో మిగిలిన విషాదం

    📰 Generate e-Paper Clip

    Hydro Project Tunnel Tragedy : ప్రజా దీవె న, సిక్కిం: సిక్కిం రమ ణీయమైన కొండల మధ్య ఆ రాత్రి అంతా మా మూలుగానే మొదలైంది.యంత్రాల మోత, నీటి ప్రవాహ శ బ్దం, చెమట చుక్కల ను తుడుచుకుంటూ పనిలోని మగ్న మైన కార్మికులు… కానీ, ఒక్క క్షణంలో పరిస్థితి తల కిందు లైంది. నమాచి సమీపంలోని హై డ్రో పవర్ ప్రాజెక్ట్‌ ని ర్మాణ టన్నెల్‌ లో అనూహ్యంగా చోటుచేసుకున్న ఘోర ప్ర మాదం ఏడుగురు శ్రామికుల ప్రాణాలను బలిగొంది. ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరు గుతున్న సమయంలో ఊహించ ని విధం గా టన్నెల్ లోపల ప్రమాదం సంభవించింది. క్షణాల్లో దట్ట మైన చీకటి, గాలి ఆడని వాతావరణం అలుము కున్నాయి. ప్రాణా లు అరచేతిలో పెట్టుకుని బయటకు వ చ్చేందుకు యత్నించినప్పటికీ, ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే క న్నుమూశారు. ప్రతినిత్యం కష్టపడి దేశానికి వెలుగులు పం చేందుకు శ్రమిస్తున్న ఆ చే తులు, చీకటి గుహలోనే ఆవి రై పోవడం తీరని శోకాన్ని మిగిల్చింది.

        ముమ్మరంగా సహాయక చర్యలు

    ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్‌లు రం గంలోకి దిగాయి.ప్రాజెక్ట్ యజ మానులు, పోలీసులు మ రియు ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF) బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహా యక చర్యలను వేగవంతం చేశా యి.టన్నెల్ లోపల మరికొందరు చి క్కుకుని ఉంటారనే అనుమానంతో, ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

          ఆందోళనలో కుటుంబాలు

    పనులకు వెళ్లిన తమ వారు క్షేమంగా తిరిగి వస్తారేమోనని కా ర్మికుల కుటుంబ సభ్యులు గుం డెలు బాదుకుంటూ ఎ దురుచూ స్తున్నారు.ప్రకృతి ఒడిలో వెలుగులు నింపేందుకు నిర్మిస్తున్న ప్రాజెక్ట్, ఇలా కాటేయడంతో ఆ ప్రాంతమంతా తీ వ్ర విషాదఛా యలు అలుముకున్నాయి. ప్రమాదానికి గల అసలు కారణాల ను తెలుసుకునేందుకు అధికారులు వి చారణ వేగవంతం చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.