Thursday, October 8, 2026
More
    HomePoliticsMinister Tummala : బిగ్ బ్రేకింగ్, మంత్రి తుమ్మల కీలక ప్రకటన, జనవరిలో రైతు యాంత్రీ...

    Minister Tummala : బిగ్ బ్రేకింగ్, మంత్రి తుమ్మల కీలక ప్రకటన, జనవరిలో రైతు యాంత్రీ కరణ పథకం పునఃప్రారంభం

    📰 Generate e-Paper Clip

    –ఇప్పటికే రైతుల నుండి దరఖా స్తులు తీసుకుంటున్న అధికారులు

    –రైతుభరోసా కోసం శాటిలైట్ ఇమె జ్ మ్యాపింగ్ పూర్తి చేయాలి

    –ఆయిల్ పామ్ పంట విస్తీర్ణం పెం చే విధంగా చర్యలు తీసుకోవాలి

    –సేంద్రియ వ్యవసాయంపై రైతుల కు విస్తృత అవగాహన కల్పించాలి

    Minister Tummala : ప్రజా దీవెన, హైదరాబాద్: జనవరి నెలలో ముఖ్యమంత్రి చేతుల మీ దుగా రైతు యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభించేందుకు అవసరమై న అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని వ్యవసాయశాఖ అధికారులను తు మ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. బుధవారం సచివాలయంలో వ్యవ సాయ, అనుబంధ శాఖల అధికారు లతో నిర్వహించిన సమీక్ష సమా వేశంలో మంత్రి పలు కీలక అంశాల పై దిశానిర్దేశం చేశారు. గత ప్రభు త్వంలో ఆపేసిన కేంద్ర ప్రభుత్వ ప థకాలలో ఒక్కొక్కటిగా మా ప్రభు త్వం పునరుద్ధరిస్తుందని, ఇప్పటికే జాతీయ ఆహర భద్రత మిషన్ లో భాగంగా పప్పుదినుసుల విత్తనా లను సబ్సిడీపై అందించడం జరిగిం దని గుర్తుచేశారు.

    ఇక ఇప్పుడు రైతు యాంత్రీకరణ ప థకాన్ని పునరుద్ధరించాలని ము ఖ్యమంత్రి నిర్ణయించినట్లు, ఈ ప థకంలో భాగంగా 1,31,000 మంది రైతులకు సబ్సిడీపై వివిధ పనిము ట్లు/యంత్రాలు అందచేయనున్న ట్లు తెలిపారు. రైతు యాంత్రీకరణ పథకం కింద ఇప్పటికే రాష్ట్రవ్యా ప్తంగా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జనవరి నెలలోగా ఈ ప్రక్రియను పూర్తిచేసి, రైతులకు ఆధునిక యం త్రాలు అందుబాటులోకి తీసుకురా వాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చే తుల మీదుగా పథకాన్ని జనవరి మొదటి వారంలో ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని అ ధికారులను ఆదేశించారు.

    గత ఐదేళ్ల కాలంలో రైతుబంధు పే రుతో రైతు యాంత్రీకరణ పథకాన్ని నిర్లక్ష్యం చేసిన అప్పటి ప్రభుత్వ వై ఖరిని మంత్రి ఈ సందర్భంగా తీవ్రం గా విమర్శించారు.

    జిల్లా వ్యవసాయ మరియు అను బంధ శాఖల అధికారులు జనవరి మొదటి వారంలో మండలాల వా రిగా పర్యటించి, రైతులకు అందు తున్న సబ్సిడీలు, యాంత్రీకరణ ప థకం దరఖాస్తులు, యూరియా యాప్ అమలు తదితర అంశాలపై క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్ సేకరించాలని మంత్రి సూచించారు. రైతుల సమ స్యలను నేరుగా తెలుసుకుని తక్ష ణమే పరిష్కారాలు అందించాల న్నారు.

    ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం నుం డి వచ్చే ఒక్క పైసాను కూడా వృధా చేయకూడదనే ఆలోచనతో ఉన్నా రని, అందుకోసం స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ ఎప్పటికప్పుడు విడుదల చే సేలా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని గుర్తుచేశారు. ఆ మేరకు ఇప్పటికే కేంద్ర పథకాల కోసం స్టేట్ మ్యాచిం గ్ గ్రాంట్ విడుదల చేసి 400 కోట్ల ను వినియోగించడం జరిగిందని తె లియజేశారు. ఆయిల్ పామ్ వంటి దీర్ఘకాలిక ఆదాయం ఇచ్చే పంటల సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రైతు లకు సబ్సిడీలు అందిస్తూ, ఆయిల్ పామ్ పంట విస్తీర్ణాన్ని గణనీయం గా పెంచాలని అధికారులను ఆదే శించారు. ఇది రైతుల ఆదాయం పెంచడంలో కీలకంగా నిలుస్తుంద న్నారు.

    రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూ రియా యాప్‌పై ప్రతిపక్షాలు అన వ సర రాద్ధాంతం చేస్తున్నాయని మం త్రి విమర్శించారు. ఇప్పటికే ఐదు జి ల్లాల్లో యూరియా యాప్ సమర్థ వంతంగా అమలవుతోందని, రైతు లు కూడా దీనిపై సంతృప్తి వ్యక్తం చే స్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష నా యకుల మాటలతో యాప్ అమ లులో లేని జిల్లాలలోని రైతులు ఎ క్కువగా యూరియా కొంటున్నారని తమ దృష్టికి వచ్చిందని, యాప్ ద్వారా కూడా రైతులు తమకు కా వాల్సినంత యూరియాను కొనుగో లు చేయొచ్చని, కావున రైతులెవ రు అనవసర భయాందోళనకు గురి కావద్దని మంత్రి కోరారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా యూరియా యా ప్ ను అమలు చేస్తామని మంత్రి స్ప ష్టం చేశారు.

    రబీ సీజన్ రైతుభరోసా కోసం శాటి లైట్ ఇమేజ్ మ్యాపింగ్ ను త్వరి త గతిన పూర్తి చేసి, రైతుభరోసా నిధు లు త్వరగా అందించేలా చర్యలు తీ సుకోవాలని అన్నారు. అలాగే ప్ర కృ తి వ్యవసాయం ప్రాధాన్యతను రై తులకు వివరించి, దీర్ఘకాలికంగా మట్టిసారాన్ని కాపాడుతూ ఖర్చు లు తగ్గించే విధానాలపై విస్తృత అ వగాహన కార్యక్రమాలు నిర్వహిం చాలని సూచించారు. రైతు సంక్షే మమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్య మని, రైతులకు అండగా నిలిచేలా అన్ని పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు అధికారులకు స్ప ష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.