Friday, October 9, 2026
More
    HomeOpinionNalgonda Collecter IlaTripathi : నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి కీలకవ్యాఖ్య, జిల్లాలో అర్హతున్న దివ్యాంగులందరికీ...

    Nalgonda Collecter IlaTripathi : నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి కీలకవ్యాఖ్య, జిల్లాలో అర్హతున్న దివ్యాంగులందరికీ దశలవారీగా బ్యాటరీ ట్రైసైకిల్స్

    📰 Generate e-Paper Clip

     

    Nalgonda Collecter IlaTripathi :  ప్రజా దీవెన, నల్ల గొం డ: నల్లగొండ జిల్లాలో అర్హత ఉన్న దివ్యాంగులందరికీ దశలవారీగా బ్యాటరీతో న డి చే ట్రై సైకిల్స్ ను అందజేస్తామని జిల్లా కలెక్టర్ ఇ లా త్రిపాఠి తెలిపారు. బుధవారం ఈసీఐఎల్ సహకారంతో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం సమీపంలోని టీటీడీసీ లో దివ్యాంగులకై ఏర్పాటు చేసిన బ్యాటరీ మోటార్ సై కిళ్ల పంపిణీ కా ర్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజ రయ్యారు. ప్రజావాణి, ఇతర సమ యాలలో జిల్లాలో అనేకమంది ది వ్యాంగులు తమకు బ్యాట రీతో నడి చే ట్రై సైకిల్స్ కావాలని కోరిన కోరిక మేరకు ఈసీఐఎల్ యాజమాన్యం తో మాట్లాడి మొదటి విడతన జిల్లా లోని 105 మం ది దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే మోటార్ సైకిల్ ఇ ప్పిస్తున్నా మని, ముందుగా బుధవా రం 50 మందికి వీటిని పంపిణీ చే య డం జరుగుతున్నదని తెలిపారు.

    దివ్యాంగులకు ఇచ్చిన బ్యాటరీ ఆ పరేటెడ్ సైకిల్స్ ను సద్వినియో గం చేసుకోవాలని ఆమె కోరారు. బ్యా టరీతో నడిచే సైకిల్లను ది వ్యాంగులకు ఇవ్వడం ద్వారా వారు ఇంకా ఆర్థికంగా పైకి ఎదిగేం దుకు అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో వీటిని ఇప్పించడం జరిగిం దని తెలిపారు. తాను జిల్లా కలెక్టర్ గా వచ్చిన అనంతరం జిల్లాలో దివ్యాంగుల సర్వే ని ర్వహించడం జరిగిందని, ఆ సర్వే లో జిల్లాలో సుమారు 55,000 మం ది దివ్యాంగులు ఉన్నట్లు తెలిసిందని, అం దులో ఎంతో మందికి వివిధ రకాల దివ్యంగ పరికరాలు అవసరం ఉన్నట్లు గుర్తించామని, ముం దుగా సుమారు 70 నుండి 80 ల క్ష ల రూపాయల విలువచేసే బ్యాట రితో నడిచే మోటార్ సైకిళ్లు ఇప్పి స్తున్నామని, ఇందుకు ఆమె ఈసీ ఐఎల్ యాజమాన్యానికి కృతజ్ఞ తలు తెలిపారు.

    భవిష్యత్తులో ఈసీఐఎల్ నల్గొండ జిల్లాకు మరింత సహకారం అం దించాలని కోరారు. ముఖ్యంగా మారు మూల గిరిజన ప్రాంతాలలో బాలిక లకు సంబంధించి టాయిలెట్లు, రక్త హీనత నివారణ , పౌష్టి కాహారం, త దితర అంశాలలో సహకారం అందించాలని, ఇందుకు గాను ముందే ప్రతిపాదనలను సమర్పించడం జరుగుతుందని, న ల్గొండ జిల్లా రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా అని, గిరి జన ప్రజలు ఎ క్కువగా ఉన్న జిల్లా అని తెలిపారు. దివ్యాంగులకు మూడు చక్రాల సైకిల్ లాగానే కృ త్రిమ అవయవాలు అవసరం ఉం దని, ఇందుకు సంబంధించి సర్వే నిర్వహిస్తున్నామని, సర్వే రిపోర్టు వచ్చిన తర్వా త ఆలింకోకు, ఈ సీ ఐఎల్ కు సమర్పిస్తామని, ఈ విషయంలో స హకారం అందించాల్సిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు.

    ఈసీఐఎల్ సిఎండి అనురాగ్ కుమార్ మాట్లాడుతూ నల్గొండ లాం టి జిల్లాకు తమ సంస్థ ద్వారా ది వ్యాంగులకు మూడు చక్రాల సైకి ళ్లు అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. తమ సంస్థ చం ద్రయాన్ తో పాటు, న్యూక్లియర్ పవర్ త యారీ వంటి అంశాలలో చేస్తున్న ద ని, సిఎస్ఆర్ నిధుల కింద సామా జిక కార్యక్రమాల్లో భాగంగా నల్గొండ జిల్లాలోని దివ్యాంగులకు బ్యాటరీ తో నడిచే మూ డు చక్రాల సైకిళ్లు స హకారం అందించినట్లు ఆయన వె ల్లడించా రు. ముఖ్యంగా జిల్లా కలె క్టర్ ఇలా త్రిపాఠి చర్య మేరకు మూ డు చక్రాల సైకిళ్లు అందించినట్లు వెల్లడించారు.

    ఈసీఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సం తోష్ రామస్వామి, చీఫ్ విజిలె న్స్ ఆఫీసర్ కృష్ణ కుమార్, చీఫ్ మెడిక ల్ ఆఫీసర్ డాక్టర్ వేణు బా బు, అ లింకో డీజీఎం సందేశ్ సింగ్, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణ వేణి తదిత రులు మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ,ఈసీ ఐఎల్ సిఎండి అ నురాగ్ కుమార్ లు వికలాంగులకు మూడు చ క్రాల సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈసీఐఎల్ డి ప్యూటీ జనరల్ మేనేజర్ సునీల్ కుమార్, టెక్నికల్ ఆఫీసర్ సాంబ మూర్తి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అ ధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డి సి హెచ్ఎస్ డాక్టర్ మాతృనాయక్, డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి ,జిల్లా విద్యాశా ఖ అధికారి బిక్ష పతి, డిప్యూటీ డి ఎం హెచ్ డాక్టర్ కళ్యా ణ్, అలింకో నుండి డాక్టర్ రవి శంకర్, సునీల్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.